Twin Wedding | కవలలను పెండ్లి చేసుకున్న ట్విన్స్ బ్రదర్స్.. కామారెడ్డిలో అరుదైన ఘటన
Twin Wedding | పెండ్లిని స్వర్గంలో నిర్ణయిస్తారని అంటారు.. ఈ నలుగురు కవలల వివాహాన్నీ (Twin Wedding) ఆ భగవంతుడు ముందే నిర్ణయించాడేమో. సాధారణంగా పెండ్లి వేడుకల్లో వధూవరుల జంట చూడముచ్చటగా ఉంటే బంధుమిత్రులు మురిసిపోతుంటారు. అలాంటిది, ఒకేలా ఉండే ఇద్దరు అబ్బాయిలు.. ఒకేలా ఉంటే ఇద్దరు అమ్మాయిలను వివాహం చేసుకుంటే.. ఆ పెండ్లికి హాజరయ్యే బంధువుల మురిపెం ఇంకెంత ఉంటుందో చెప్పాల్సిన పనేలేదు.
Twin Wedding | త్రినేత్ర.న్యూస్: పెండ్లిని స్వర్గంలో నిర్ణయిస్తారని అంటారు.. ఈ నలుగురు కవలల వివాహాన్నీ (Twin Wedding) ఆ భగవంతుడు ముందే నిర్ణయించాడేమో. సాధారణంగా పెండ్లి వేడుకల్లో వధూవరుల జంట చూడముచ్చటగా ఉంటే బంధుమిత్రులు మురిసిపోతుంటారు. అలాంటిది, ఒకేలా ఉండే ఇద్దరు అబ్బాయిలు.. ఒకేలా ఉంటే ఇద్దరు అమ్మాయిలను వివాహం చేసుకుంటే.. ఆ పెండ్లికి హాజరయ్యే బంధువుల మురిపెం ఇంకెంత ఉంటుందో చెప్పాల్సిన పనేలేదు. ఇలాంటి ఘటనే కామారెడ్డి (Kamareddy) జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్లో చోటుచేసుకుంది.
ఘన్‌పూర్‌కి చెందిన దుంపటి విజయ్, వినయ్ కవలలు. చడటానికి ఇద్దరూ అచ్చం ఒకేలా ఉంటారు. అలాగే తాడ్వాయి మండలం దేమి కలాన్ గ్రామానికి చెందిన కుమ్మరి కీర్తన, కీర్తిలు కూడా కవలలు. వీరిద్దరూ కూడా ఒకే రూపురేఖలతో ఉంటారు. ఒకే పోలికలతో జన్మించిన ఈ రెండు జంటలు మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఈ రెండు జంటలు విజయ్-కీర్తన, వినయ్-కీర్తి ఒకే ముహూర్తానికి వివాహం జరగడం గమనార్హం. చూడముచ్చటగా ఉన్న ఈ కవలల జంటలను చూసి ఆశ్చర్యపోవడం అందరి వంతయ్యింది. ఇద్దరు కవలలు, మరో ఇద్దరు కవలలను వివాహం చేసుకోవడం చాలా అరుదని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
https://x.com/jsuryareddy/status/2026183335295557801
సంబంధిత వార్తలు

Cristiano Ronaldo | పదేండ్లుగా డేటింగ్.. ఎట్టకేలకు వివాహబంధంలోకి రొనాల్డో
ఆగస్టు 12, 2026

Sri Chaitanya School | కర్రలతో కొట్టి.. బూట్లతో తొక్కారు.. దమ్మాయిగూడ శ్రీచైతన్య సూల్లో పదో తరగతి విద్యార్థిపై సహచరుల దాడి..
ఆగస్టు 10, 2026

Rythu Bharosa | రైతు భరోసా నిధులు పక్కదారి.. ఏఈవోపై వేటు
జులై 25, 2026
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు



