Cristiano Ronaldo | పదేండ్లుగా డేటింగ్.. ఎట్టకేలకు వివాహబంధంలోకి రొనాల్డో
Cristiano Ronaldo | ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ (Portugal) స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) ఎట్టకేలకు పెండ్లి పీటలెక్కనున్నాడు. తన ప్రేయసి జార్జినా రోడ్రిగ్స్‌ను (Georgina Rodriguez) వివాహం (Wedding) చేసుకోనున్నాడు. ఈమేరకు రొనాల్డో స్వయంగా ప్రకటించారు.
Cristiano Ronaldo | త్రినేత్ర.న్యూస్: ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ (Portugal) స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) ఎట్టకేలకు పెండ్లి పీటలెక్కనున్నాడు. తన ప్రేయసి జార్జినా రోడ్రిగ్స్‌ను (Georgina Rodriguez) వివాహం (Wedding) చేసుకోనున్నాడు. ఈమేరకు రొనాల్డో స్వయంగా ప్రకటించారు. వీరిద్దరు దాదాపు పదేండ్లుగా డేటింగ్‌లో ఉండటం గమనార్హం. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జార్జినాతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. 'సీ హర్ట్ సింబల్ జీ' అంటూ పోస్ట్‌కు చిన్న క్యాప్షన్ ఇచ్చాడు. క్రిస్టియానో, జార్జినా పేర్లలోని తొలి అక్షరాలతో ఈ క్యాప్షన్ రూపొందించారు.

ఆ ఫొటోలో అతడు, జార్జినా ఒకరి చేతిని మరొకరు పట్టుకుని కనిపించారు. ఇద్దరి చేతులకు పెండ్లి ఉంగరాలు ఉన్నాయి. ఈ ఫొటోతోనే తమ వివాహాన్ని రొనాల్డో అధికారికంగా వెల్లడించారు. 2016 నుంచి జార్జినాతో డేటింగ్‌లో ఉన్నాడు. రొనాల్డో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే అభిమానులు, ఫుట్‌బాల్ ప్రపంచం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

పెండ్లి కాకుండానే ఐదుగురు పిల్లలకు తండ్రి..
రిచెస్ట్ ఫుట్‌బాలర్ ( Football Star) అయిన రొనాల్డో పెండ్లి చేసుకోకుండానే ఐదుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. 2010లో తన కుమారుడు జూనియర్ రొనాల్డోను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించాడు. అయితే తన కుమారుడి తల్లి వివరాలను మాత్రం ఇప్పటికే అతడు గోప్యంగా ఉంచాడు.

2017లో సరోగసి ద్వారా కవలలు ఇవా మారియా, మేటియో రొనాల్డోకు జన్మనిచ్చాడు. వీరి తల్లి వివరాలు కూడా అందుబాటులో లేవు. ఇక 2017, నవంబర్‌లో జార్జినా, రొనాల్డో జంటకు అలనా మార్టినాకు జన్మించింది. ఆ తర్వాత 2022లో కవలలు ఎస్మెరెల్డా, ఏంజెల్ జిన్మించారు. అయితే ఏంజెల్ పుట్టిన కాసేపటికే మరణించాడు.
Cristiano Ronaldo marries Georgina Rodriguez. pic.twitter.com/W9NSVlguvP
— Globe Eye News (@GlobeEyeNews) August 11, 2026
Cristiano Ronaldo finally MARRIES Georgina Rodríguez
The football star announced the WEDDING by sharing a photo of their rings from the ceremony in Cascais, Portugal signing off with 'C❤️G' pic.twitter.com/4t3qKeE0zz
— RTVisual (@RT_Visual_on_X) August 11, 2026
సంబంధిత వార్తలు

FIFA World Cup 2030 | మూడు ఖండాలు.. ఆరు దేశాల్లో 2030 ఫిఫా వరల్డ్ కప్.. భారత్‌కు ఆడే ఛాన్స్ దక్కుతుందా?
జులై 21, 2026

Wedding | పెళ్లిలో మటన్‌కు బదులు చికెన్ వడ్డించారని.. కర్రలు, కత్తులతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు
జులై 11, 2026

Cristiano Ronaldo | ఇదే నా చివరి ప్రపంచకప్.. ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో
జులై 6, 2026
తాజావార్తలు
- ●SBI Recruitment | SBI జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్.. 9,124 పోస్టులకు దరఖాస్తులు షురూ
- ●‘హస్తం’ గూటిలో ‘గులాబీ’ల త్రిశంకు స్వర్గం: అభివృద్ధి ఆశలు.. గౌరవం గల్లంతు: ఫిరాయింపు నేతల రాజకీయ తంటాలు!
- ●Horoscope | ఆగస్టు 12 రాశిఫలాలు.. ఈ రాశి వారు పాత మిత్రులను తిరిగి కలుస్తారు!
- ●Genetics and longevity | స్మోకింగ్, డ్రింకింగ్ చేసినా కొందరు వందేళ్లు ఎలా బతుకుతారు? ఆయుష్షు వెనకున్న అసలు రహస్యాన్ని విప్పిన సైంటిస్టులు
- ●Petroleum Dealers Association | పెట్రోల్ డీలర్ల డిమాండ్లపై ఢిల్లీలో కీలక భేటీ: పార్లమెంటరీ ప్యానెల్ ఛైర్మన్‌తో అసోసియేషన్ చర్చలు
- ●Section 22A lands Telangana | 22A భూముల చిక్కులు: ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఆ లిస్ట్‌లోనే.. ప్రభుత్వానికి నిపుణుల కీలక సూచనలు

SBI Recruitment | SBI జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్.. 9,124 పోస్టులకు దరఖాస్తులు షురూ

‘హస్తం’ గూటిలో ‘గులాబీ’ల త్రిశంకు స్వర్గం: అభివృద్ధి ఆశలు.. గౌరవం గల్లంతు: ఫిరాయింపు నేతల రాజకీయ తంటాలు!

Horoscope | ఆగస్టు 12 రాశిఫలాలు.. ఈ రాశి వారు పాత మిత్రులను తిరిగి కలుస్తారు!

Genetics and longevity | స్మోకింగ్, డ్రింకింగ్ చేసినా కొందరు వందేళ్లు ఎలా బతుకుతారు? ఆయుష్షు వెనకున్న అసలు రహస్యాన్ని విప్పిన సైంటిస్టులు



