TUWJ | తెలంగాణ కోసం జర్నలిస్టులు జీవితాలను త్యాగం చేశారు : విరాహత్ అలీ
TUWJ | తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టులు క్రియాశీలక పాత్ర పోషించారని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) అధ్యక్షులు విరాహత్ అలీ తెలిపారు. తెలంగాణ కోసం కొంతమంది జర్నలిస్టులు తమ జీవితాలను త్యాగం చేశారని ఆయన పేర్కొన్నారు.
TUWJ | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టులు క్రియాశీలక పాత్ర పోషించారని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) అధ్యక్షులు విరాహత్ అలీ తెలిపారు. తెలంగాణ కోసం కొంతమంది జర్నలిస్టులు తమ జీవితాలను త్యాగం చేశారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీని విరాహత్ అలీ కలిసి తెలంగాణ జర్నలిస్టుల త్యాగాలను గుర్తించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం ఎంతో చారిత్రాత్మకమైంది.. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తమ వంతు పాత్రను పోషించిన మహత్తర ప్రజా ఉద్యమం అది.. ఆ ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన క్రియాశీలక పాత్ర అత్యంత విశిష్టమైనది. జర్నలిస్టులు కేవలం వార్తలను సేకరించి ప్రచారం చేసే బాధ్యతకే పరిమితం కాలేదు. ఓ వైపు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి తెలియజేయడం, మరోవైపు ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను, వాస్తవాలను ప్రజలకు చేరవేసి ఉద్యమానికి నైతిక బలం చేకూర్చడం వంటి కీలక బాధ్యతలను నిర్వర్తించారు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రజల ఆవేదనను, ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడంలో జర్నలిస్టులు అత్యంత కీలకమైన పాత్రను పోషించారు. తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న వివక్షను, సామాజిక-ఆర్థిక అసమానతలను, ప్రాంతీయ అన్యాయాలను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకువచ్చారు అని విరాహత్ తెలిపారు.
జర్నలిస్టులు తమ ఉద్యోగాలను కూడా కోల్పోయారు..
అనేక ప్రాంతాల్లో జర్నలిస్టులు ఉద్యమకారులతో కలిసి ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పలుచోట్ల ఉద్యమ జాయింట్ యాక్షన్ కమిటీలకు నాయకత్వం వహించారు. ఉద్యమ సమయంలో పోలీసులు జర్నలిస్టులపై లాఠీచార్జీలు జరిపిన సంఘటనలు ఎన్నో చోట్ల చోటుచేసుకున్నాయి. ఉద్యమానికి కేంద్రంగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీతో పాటు పలు చోట్ల పోలీసులు కెమెరాలను ధ్వంసం చేయడం, వార్తా సేకరణను అడ్డుకోవడం, జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేయడం, బెదిరింపులకు పాల్పడడం, గాయపర్చడం వంటి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ విధినిర్వహణలో జర్నలిస్టులు వెనుకడుగు వేయలేదు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ప్రపంచానికి చాటిచెప్పే బాధ్యతను నిర్వర్తించారు. అంతేకాకుండా, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నందుకు పలువురు జర్నలిస్టులు తమ ఉద్యోగాలను కూడా కోల్పోయారు. కొందరు యాజమాన్యాల ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. మరికొందరు తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకు ఉద్యోగాలకు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి తెలంగాణ సమాజం కోసం తమ జీవితాలను అంకితం చేశారని ఆయన పేర్కొన్నారు.
ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలు కొనసాగించండి..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో జర్నలిస్టుల పాత్రను గత ప్రభుత్వం గుర్తించి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజున జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలు అందించింది. ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రక్రియ కొనసాగించేందుకు కమిటీ సిఫారసు చేయాలని కోరుతున్నాం. అలాగే ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని సేవలందించిన జర్నలిస్టులకు ఉద్యమకారులుగా గుర్తింపు కల్పించే విధంగా ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించి, వారి సేవలకు తగిన గౌరవం, గుర్తింపు, ప్రభుత్వం కల్పించే అన్ని అర్హతలను అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. తెలంగాణ ఉద్యమ చరిత్రలో జర్నలిస్టుల సేవలు, త్యాగాలు చిరస్థాయిగా నిలిచేలా మీ కమిటీ న్యాయమైన నిర్ణయం తీసుకుంటుందని విశ్వసిస్తున్నామని విరాహత్ అలీ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

K Shobha Reddy | సీఎం గారూ అపాయింట్మెంట్ ఇవ్వండి ప్లీజ్.. ట్రోల్స్‌పై కే శోభారెడ్డి ఆవేదన
సెప్టెంబర్ 21, 2026

MLC Dasoju Sravan | నిన్న పులి.. నేడు పిల్లి.. ‘దానం’పై ఎమ్మెల్సీ దాసోజు సెటైర్లు
సెప్టెంబర్ 20, 2026

Vardhannapeta | మార్చురీలో శవాన్ని పీక్కతిన్న ఎలుకలు.. ఎక్కడో తెలుసా..?
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Digital Arrest | డిజిటల్ అరెస్ట్ మోసాలు.. పూణెలో సీనియర్ సిటిజన్లకు రూ.100 కోట్లు నష్టం..
- ●Harish Rao | 8.4 టీఎంసీల నీరున్నా ఎందుకు మనసొస్తలేదు రేవంత్?
- ●Revanth Reddy Sircilla Public Meeting | గులాబీ కోటలపై రేవంత్ దండయాత్ర: ఈనెల 30న సిరిసిల్లలో కాంగ్రెస్ భారీ సభ.. నెక్స్ట్ టార్గెట్ సిద్దిపేట
- ●Samantha | ప్రెగ్నెన్సీతో అర్ధరాత్రి వరకు షూటింగ్.. సమంత డెడికేషన్‌పై నెటిజన్ల ప్రశంసలు
- ●Delhi | ఢిల్లీలో మరో దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి ఆరోతరగతి బాలికపై లైంగిక దాడి
- ●Venkatesh | ముగ్గురు హీరోయిన్లతో వెంకటేష్ స్టెప్పులు - ఆదర్శకుటుంబం ఫస్ట్ సింగిల్‌పై అప్డేట్

Digital Arrest | డిజిటల్ అరెస్ట్ మోసాలు.. పూణెలో సీనియర్ సిటిజన్లకు రూ.100 కోట్లు నష్టం..

Harish Rao | 8.4 టీఎంసీల నీరున్నా ఎందుకు మనసొస్తలేదు రేవంత్?

Revanth Reddy Sircilla Public Meeting | గులాబీ కోటలపై రేవంత్ దండయాత్ర: ఈనెల 30న సిరిసిల్లలో కాంగ్రెస్ భారీ సభ.. నెక్స్ట్ టార్గెట్ సిద్దిపేట

Samantha | ప్రెగ్నెన్సీతో అర్ధరాత్రి వరకు షూటింగ్.. సమంత డెడికేషన్‌పై నెటిజన్ల ప్రశంసలు



