Entrance Exams | ఒకేరోజు, ఒకే సమయంలో రెండు ప్రవేశ పరీక్షలు.. అయోమయంలో విద్యార్థులు
Entrance Exams | రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇక ప్రవేశ పరీక్షలు (Entrance Exams) ప్రారంభం కానున్నాయి. వీటిలో చూపే ప్రతిభ ఆధారంగానే మెరుగైన కాలేజీల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి అవకాశం ఏర్పడనుంది.
Entrance Exams | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇక ప్రవేశ పరీక్షలు (Entrance Exams) ప్రారంభం కానున్నాయి. వీటిలో చూపే ప్రతిభ ఆధారంగానే మెరుగైన కాలేజీల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి అవకాశం ఏర్పడనుంది. తద్వారా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట పడుతుంది. అయితే రెండు ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లు ఒకే రోజు ఉంటే? అది కూడా ఒకే సమయంలో ఉంటే?.. వాటికోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుంది. ఏ పరీక్ష రాయాలి?, దేనిని వదులు కోవాలి?. ఒక పరీక్ష రాయాలంటే మరోదానిని వదులుకోవాల్సిందే..!. టీజీ ఆర్‌జేసీ, కేజీబీవీ ఇంటర్ ప్రవేశాల పరీక్షల విషయంలో సరిగ్గా అదే జరిగింది.
తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు (TGRJC), కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాల్లో (KGBV) ఇంటర్ ప్రవేశాల కోసం ఒకే రోజు, ఒకే సమయంలో కామన్ ఎంట్రెన్స్ టెస్టు నిర్వహిస్తున్నారు. మే 3న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు ఈ రెండు పరీక్షలు జరగనున్నాయి. దీంతో రెండింటి కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏదో ఒక పరీక్ష మాత్రమే రాయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. దేనిని వదులుకోవాలి, ఏది రాయాలని తేల్చుకోలేకపోతున్నారు. అందువల్ల పరీక్ష విషయంలో ప్రభుత్వం స్పందించి ఒకే రోజు కాకుండా వేర్వేరు తేదీల్లో పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
మధ్యాహ్నం 2 గంటలకు పదో తరగతి ఫలితాలు.. నేరుగా వాట్సాప్‌కే..
ప్రభుత్వ ఆస్తులతో చెలగాటం.. ప్రముఖ ఐటీ సంస్థపై క్రిమినల్ కేసు!
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






