Inter Admissions | ఇంటర్ ప్రవేశాలకు బ్రేక్.. సంస్కరణల అమలుకేనా?
Inter Admissions | రాష్ట్రంలో ఇంటర్ ప్రవేశాల ప్రక్రియకు (Inter Admissions) బ్రేక్ పడింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, గురుకులాల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలను ప్రారంభించ వచ్చని, ఈ నెల 8 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అడ్మిషన్ల షెడ్యూల్‌ను ప్రకటించారు.
Inter Admissions | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో ఇంటర్ ప్రవేశాల ప్రక్రియకు (Inter Admissions) బ్రేక్ పడింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, గురుకులాల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలను ప్రారంభించ వచ్చని, ఈ నెల 8 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అడ్మిషన్ల షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించాలని అందులో పేర్కొన్నారు. అయితే దానిని 24 గంటల్లోపే వాటికి బ్రేక్ వేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేదాక ప్రవేశాలు చేపట్టకూడదని స్పష్టం చేశారు. ఇంటర్ విద్యలో కొన్ని కీలక సంస్కరణలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రవేశాల ప్రక్రియకు బ్రేక్ వేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ఎయిడెడ్, కోఆపరేటివ్, గురుకుల, మోడల్ స్కూల్, కాంపోజిట్ డిగ్రీ కాలేజీలకు ఇది వస్తుందని తెలిపారు. దీంతో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే సంస్కరణలపై చర్చ నడుస్తున్నది.
రాష్ట్రంలో పలుచోట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్యాంప్‌సలోనే జూనియర్ కాలేజీలు కూడా ఉన్నాయి. కొత్త విద్యాసంవత్సరంలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు కానున్నాయి. ఇందులో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బోధన ఉంటుంది. ఒకే క్యాంప్‌సలో 12వ తరగతి వరకు ఉన్న చోట్ల ప్రవేశాలు ప్రత్యేకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
పాఠశాల విద్య 12వ తరగతి వరకు ఉండాలని జాతీయ విద్యా విధానంలో పొందుపరిచిన విషయం తెలిసిందే. రాష్ట్ర విద్యా కమిషన్ కూడా ప్రభుత్వానికి ఇదే విషయం సూచించింది. అదేవిధంగా ఇటర్ బోర్డు, పదోతరగతికి ప్రత్యేక వ్యవస్థలు ఎందుకని కేంద్ర విద్యాశాఖ ఇటీవల ప్రశ్నించింది. ఇంటర్ బోర్డును పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని సూచించింది. ఇందులో భాగంగా కొన్ని సంస్కరణలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇక డిగ్రీలో దోస్త్ తరహాలోనే ఇంటర్‌లో అడ్మిషన్లను ఆన్‌లైన్‌లో చేపట్టాలని ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. ఈ నేపథ్యంలో ఇంటర్ ప్రవేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



