త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalwakuntla Kavitha | ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక‌లో బ‌రిలో ఉంటాం: టీఆర్ఎస్ చీఫ్‌ క‌విత

Kalwakuntla Kavitha | వ‌చ్చే ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక‌లో తెలంగాణ ర‌క్ష‌ణ సేన బ‌రిలో దిగుతుంద‌ని టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌క‌టించారు. ఇంకా అభ్య‌ర్థిని డిసైడ్ చేయ‌లేద‌ని.. త్వ‌ర‌లో ఎవ‌రిని పోటీలో నిల‌పాల‌నే దానిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.

S

Telangana | Published On Sep 26, 2026, 2.27 pm IST

Kalwakuntla Kavitha | ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక‌లో బ‌రిలో ఉంటాం: టీఆర్ఎస్ చీఫ్‌ క‌విత
Advertisement

Kalwakuntla Kavitha | త్రినేత్ర న్యూస్: వ‌చ్చే ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక‌లో తెలంగాణ ర‌క్ష‌ణ సేన బ‌రిలో దిగుతుంద‌ని టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌క‌టించారు. ఇంకా అభ్య‌ర్థిని డిసైడ్ చేయ‌లేద‌ని.. త్వ‌ర‌లో ఎవ‌రిని పోటీలో నిల‌పాల‌నే దానిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ ప్ర‌భుత్వం కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమిత‌మైంద‌ని.. చేత‌ల్లో శూన్య‌మ‌ని విమ‌ర్శించారు. ఫామ్‌హౌస్‌ల ప‌రిశీల‌న త‌ప్పా చర్య‌లు ఉండ‌వ‌ని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఫామ్‌హౌస్ పేరిట కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుంద‌ని మండిప‌డ్డారు. శ‌నివారం బంజారాహిల్స్‌లో ఆమె మీడియా స‌మావేశంలో మాట్లాడారు. ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి మ‌రో పార్టీలో ఎంపీగా పోటీ చేయ‌డం రాజ్యాంగ విరుద్ధ‌మ‌న్నారు. ఈ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్‌ను ఓడించాల‌న్నారు.

నిమ్స్‌లో బెడ్ దొర‌క‌ని ప‌రిస్థితి..

అందరికి అందుబాటులో వైద్యం ఉంటుంది అని చెప్పే నిమ్స్ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఫోన్ వస్తే తప్ప బెడ్ దొరకని పరిస్థితి ఉంది. సామాన్యుడికి ఆక్సిజన్ బెడ్ అవసరమైతే 4 నుంచి 7 రోజులు వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. బెడ్లు అందుబాటులో లేక వీల్ చైర్ లో కూర్చోబెట్టి చికిత్స చేయాల్సిన పరిస్థితి ఉన్నపటికీ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు.

చేదు వాస్త‌వాలు బ‌య‌ట‌కొస్తున్న‌య్‌

ఆదిలాబాద్ ఘటన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న పరిస్థితిపై సమాచారం సేకరిస్తే అత్యంత భయంకరమైన చేదు వాస్తవాలు బయటపడ్డాయి. 2020-21 లో 6 వేలు, 2022-23 లో 4,933, 2024-25 లో 3,853 మంది పసి పిల్లలు చనిపోయారు. చేతగాని ముఖ్యమంత్రి వైద్య రంగాన్ని విస్మరించి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.

వీడియోలు తీసి మాకు ట్యాగ్ చేయండి..

తెలంగాణ యువతా, నిజమైన మార్పు కోసం మన సోషల్ మీడియా స్క్రీన్‌లను ఉపయోగిద్దాం. మీ ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి, అక్కడి వాస్తవ పరిస్థితులను ఫొటోలు లేదా వీడియోల రూపంలో నమోదు చేయండి. వాటిని మాకు ట్యాగ్ చేయండి లేదా పంపించండి. మనమంతా కలిసి ప్రభుత్వంపై ప్రజల సమ‌ష్టి ఒత్తిడి తీసుకువచ్చి, మన ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచేలా కృషి చేద్దాం. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చెందే వరకు, ప్రతి పౌరుడికి వారు అర్హమైన నాణ్యమైన వైద్యం అందే వరకు తెలంగాణ రక్షణ సేన వెనక్కి తగ్గదు అని క‌విత స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement