త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medaram | వ‌న‌దేవ‌త‌ల ద‌ర్శ‌నానికి పోటెత్తిన భ‌క్త‌జ‌నం.. మేడారం చుట్టూ 4 కి.మీ.మేర‌ ట్రాఫిక్‌

Medaram Jatara | రాష్ట్ర పండుగ‌, దేశంలోనే అతిపెద్ద గిరిజ‌న సంబురం మేడారం మ‌హా జాత‌ర (Medaram Jatara) మ‌రికొన్ని గంట‌ల్లో ప్రారంభం కానుంది. నాలుగు రోజుల‌పాటు సాగే ఈ వ‌న‌జ‌న జాత‌ర‌కు సార‌ల‌మ్మ‌, ప‌గిడిద్ద‌రాజు, గోవింద‌రాజుల‌ను గ‌ద్దెలపై ప్ర‌తిష్టించ‌డంతో అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది.

G

Telangana | Published On Jan 28, 2026, 7.54 am IST

Medaram | వ‌న‌దేవ‌త‌ల ద‌ర్శ‌నానికి పోటెత్తిన భ‌క్త‌జ‌నం.. మేడారం చుట్టూ 4 కి.మీ.మేర‌ ట్రాఫిక్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర పండుగ‌, దేశంలోనే అతిపెద్ద గిరిజ‌న సంబురం మేడారం మ‌హా జాత‌ర (Medaram Jatara) మ‌రికొన్ని గంట‌ల్లో ప్రారంభం కానుంది. నాలుగు రోజుల‌పాటు సాగే ఈ వ‌న‌జ‌న జాత‌ర‌కు సార‌ల‌మ్మ‌, ప‌గిడిద్ద‌రాజు, గోవింద‌రాజుల‌ను గ‌ద్దెలపై ప్ర‌తిష్టించ‌డంతో అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. మొద‌ట సార‌ల‌మ్మ క‌న్నెప‌ల్లి నుంచి మేడారానికి (Medaram) త‌ర‌లిరానుంది. అనంత‌రం ప‌గిద్ద‌రాజు, గోవింద‌రాజులు మేడారంలో గ‌ద్దెల‌పై కొలువుదీరనున్నారు. గురువారం సాయంత్రం స‌మ్మ‌క్కను మేడారం గ‌ద్దెపై ప్ర‌తిష్టించ‌నున్నారు. దీంతో మొక్కులు చెల్లించుకునేందుకే లక్షల మంది జాతరకు తరలి వస్తున్నారు.

జాత‌ర‌కు తెర‌లేవ‌క ముందే మేడారం పరిసర ప్రాంతాలు భక్త జనంతో కిక్కిరిసిపోయింది. బుధవారం తెల్ల‌వారుజామునే భ‌క్తులు పోటెత్తారు. ఆటోలు, ట్రాక్టర్లు, కార్లు, బస్సుల్లో పెద్ద సంఖ్య‌లో తరలి వస్తున్నారు. దీంతో వాహ‌నాలు నెమ్మ‌దిగా క‌దులుతుండ‌టంతో సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నెలకొంది. ఇక‌ జంపన్న వాగు వద్ద ఇసుకేస్తే రాలనంత‌ జనం కనిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తున్నారు. వాహ‌నాలు వేగంగా క‌దిలేలా చూస్తున్నారు.

కాగా, మేడారం మహా జాతర నేపథ్యంతో సీఎం రేవంత్‌ రెడ్డి, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్ర‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం మహా జాతరను వైభవంగా జరుపుకోవాలని సీఎం రేవంత్‌ కోరారు. గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలతో నాలుగు రోజుల పాటు జరిగే పండుగను వన దేవతల మహోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కోటిన్నరకుపైగా భక్తులు తరలి వచ్చే జాతరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనంగా ఏర్పాట్లు చేసిందన్నారు.

తెలంగాణ గడ్డపై అన్యాయానికి వ్యతిరేకంగా సాగిన ధిక్కారానికి, గిరిజన సంస్కృతి గౌరవార్థం చేసిన త్యాగానికి సమ్మక్క-సారలమ్మలు అసలైన ప్రతీకల‌ని కేసీఆర్ కొనియాడారు. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మేడారం జాతర, దక్షిణ భారత కుంభమేళాను తలపిస్తూ ఆధ్యాత్మిక వెలుగులు చిమ్ముతోందని పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement