త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jyoti Poorvaj | హీరోయిన్‌గా గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ న‌టి – భ‌ర్త‌తో క‌లిసి సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ మూవీ

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఫేమ్ జ్యోతి పూర్వ‌జ్ హీరోయిన్‌గా మారింది. తెలుగులో కిల్ల‌ర్ పేరుతో ఓ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ మూవీ చేసింది. ఈ సినిమాలో జ్యోతి పూర్వ‌జ్ భ‌ర్త హీరోగా న‌టిస్తూనే ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అక్టోబ‌ర్ 30 కిల్ల‌ర్ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

N

Entertainment | Published On Oct 18, 2026, 3.24 pm IST

Jyoti Poorvaj | హీరోయిన్‌గా గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ న‌టి – భ‌ర్త‌తో క‌లిసి సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ మూవీ
Advertisement

Jyoti Poorvaj |  గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌తో తెలుగునాట‌ ఫేమ‌స్ అయ్యింది జ్యోతి పూర్వ‌జ్‌. స్టార్ మాలో టెలికాస్ట్ అయిన ఈ సీరియ‌ల్‌లో జ‌గ‌తి పాత్ర‌లో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. తాజాగా జ్యోతి పూర్వ‌జ్ హీరోయిన్‌గా మారింది. కిల్ల‌ర్ పేరుతో తెలుగులో ఓ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ మూవీ చేసింది. ఈ సినిమాకు జ్యోతి పూర్వ‌జ్ భ‌ర్త సుకు పూర్వ‌జ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అత‌డే హీరోగా కూడా క‌నిపించ‌బోతున్నాడు.

రిలీజ్ ఎప్పుడంటే?

కిల్ల‌ర్ మూవీ అక్టోబ‌ర్ 30న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో మ‌ల్టీపుల్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో జ్యోతి క‌నిపించ‌బోతుంది. గ్లామ‌ర్‌, యాక్ష‌న్ ప్ర‌ధానంగా ఆమె పాత్ర సాగ‌నుంది. స్పై, టెర్ర‌రిస్ట్‌, ర‌క్తం తాగే పిశాచి... ర‌క‌ర‌కాల మారువేషాల్లో క‌నిపించే ఓ యువ‌తి ఎవ‌రు? ఆమెను ప‌ట్టుకోవ‌డానికి పోలీసులు ఎందుకు అన్వేషిస్తున్నార‌నే అంశాల‌తో సుకు పూర్వ‌జ్ ఈ సినిమాను రూపొందించారు.

ట్రైల‌ర్ రిలీజ్‌...

కిల్ల‌ర్ మూవీ ట్రైల‌ర్‌ను అక్టోబ‌ర్ 21న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. డైరెక్ట‌ర్‌, హీరోగానే కాకుండా ఈ సినిమాకు ఓ ప్రొడ్యూస‌ర్‌గా కూడా సుకు పూర్వ‌జ్ వ్య‌వ‌హ‌రిస్తోన్నారు. కిల్ల‌ర్ కంటే ముందు క‌న్న‌డంలో చాలానే సినిమాలు చేసింది జ్యోతి పూర్వ‌జ్‌. తెలుగులో మాత్రం సీరియ‌ల్స్‌లోనే క‌నిపించింది.

 

Advertisement
Advertisement