Jalamandali | తాగునీటి దుర్వినియోగం.. ఫోర్ ఫాదర్స్ పబ్‌కు రూ. 20 వేల జరిమానా
Jalamandali | హైదరాబాద్ మహానగరంలో తాగునీటి వృథా, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి( Jalamandali ) కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ సర్కిల్, జూబ్లీహిల్స్ వార్డు పరిధిలోని రోడ్ నంబర్ 45, ప్లాట్ నంబర్ 872లో ఉన్న ఫోర్ ఫాదర్స్ పబ్ (Fore Fathers Pub)లో నీటి దుర్వినియోగానికి సంబంధించి అందిన ఫిర్యాదుపై జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు.
తాగునీటి కనెక్షన్ తొలగింపు
కమర్షియల్ వాటర్ ట్యాంకర్ల సరఫరా కూడా నిలిపివేత
నీటి వృథాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
హెచ్చరించిన జలమండలి
Jalamandali | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్ మహానగరంలో తాగునీటి వృథా, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి( Jalamandali ) కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ సర్కిల్, జూబ్లీహిల్స్ వార్డు పరిధిలోని రోడ్ నంబర్ 45, ప్లాట్ నంబర్ 872లో ఉన్న ఫోర్ ఫాదర్స్ పబ్ (Fore Fathers Pub)లో నీటి దుర్వినియోగానికి సంబంధించి అందిన ఫిర్యాదుపై జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల అనంతరం నీటి దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించి, సదరు పబ్ యాజమాన్యానికి రూ.20 వేల జరిమానా విధించారు. అంతేకాకుండా తాగునీటి కనెక్షన్‌ను తొలగించడంతో పాటు జలమండలి ఫిల్లింగ్ స్టేషన్ నుంచి కమర్షియల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా అందించే నీటి సరఫరాను కూడా నిలిపివేశారు. రానున్న వేసవిలో నీటి లభ్యతపై ఒత్తిడి పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ప్రతి నీటి చుక్కనూ పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, ఇతర వాణిజ్య సంస్థలు తాగునీటిని వృథా చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. నీటి దుర్వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలతో పాటు నీటి కనెక్షన్ల తొలగింపు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి హెచ్చరించింది.
నీటి దుర్వినియోగంపై సమాచారం అందించండి
తాగునీటి వృథా, దుర్వినియోగానికి సంబంధించిన ఘటనలు ప్రజల దృష్టికి వచ్చిన పక్షంలో, సంబంధిత ఫొటోలు, వీడియోలు, వ్యక్తులు లేదా సంస్థల వివరాలు, ఘటన జరిగిన ప్రాంతం, పూర్తి చిరునామాతో సహా జలమండలి వాట్సాప్ నంబర్ 99499 30003 కు సమాచారం అందించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా కస్టమర్ కేర్ నంబర్ 155313 ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని తెలిపింది.
అందిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, ఉల్లంఘనలు నిర్ధారణ అయిన పక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని జలమండలి హామీ ఇచ్చింది. తాగునీటి సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరింది.
సంబంధిత వార్తలు

BRS Party | ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’.. ‘వెలుగు’ యాజమాన్యానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
అక్టోబర్ 18, 2026

CP Sajjanar | డ్రగ్స్ కట్టడిపై మీ ఆలోచన సూపర్.. ఈ ప్రయత్నం ప్రతొక్కరికీ మార్గదర్శకం కావాలి
అక్టోబర్ 18, 2026

CPI Kunamneni Sambashivarao | ఎర్ర జెండాలన్ని ఏకమైతేనే పెద్ద ఎన్నికల్లో గెలుస్తం
అక్టోబర్ 18, 2026
తాజావార్తలు
- ●Jyoti Poorvaj | హీరోయిన్గా గుప్పెడంత మనసు సీరియల్ నటి - భర్తతో కలిసి సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ
- ●BRS Party | ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’.. 'వెలుగు' యాజమాన్యానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
- ●CP Sajjanar | డ్రగ్స్ కట్టడిపై మీ ఆలోచన సూపర్.. ఈ ప్రయత్నం ప్రతొక్కరికీ మార్గదర్శకం కావాలి
- ●Vijay - Rashmika | పెళ్లి చేసుకుందామని వంద సార్లు అడిగింది - కాఫీ విత్ కరణ్ షోలో రష్మికపై విజయ్ కామెంట్స్
- ●CPI Kunamneni Sambashivarao | ఎర్ర జెండాలన్ని ఏకమైతేనే పెద్ద ఎన్నికల్లో గెలుస్తం
- ●Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరిట.. నిరుద్యోగులను దోచుకుంటున్న రేవంత్ సర్కార్ : హరీశ్‌రావు

Jyoti Poorvaj | హీరోయిన్గా గుప్పెడంత మనసు సీరియల్ నటి - భర్తతో కలిసి సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ

BRS Party | ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’.. 'వెలుగు' యాజమాన్యానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు

CP Sajjanar | డ్రగ్స్ కట్టడిపై మీ ఆలోచన సూపర్.. ఈ ప్రయత్నం ప్రతొక్కరికీ మార్గదర్శకం కావాలి

Vijay - Rashmika | పెళ్లి చేసుకుందామని వంద సార్లు అడిగింది - కాఫీ విత్ కరణ్ షోలో రష్మికపై విజయ్ కామెంట్స్



