త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sajjanar | డ్ర‌గ్స్ క‌ట్ట‌డిపై మీ ఆలోచ‌న సూప‌ర్‌.. ఈ ప్ర‌య‌త్నం ప్ర‌తొక్క‌రికీ మార్గ‌ద‌ర్శ‌కం కావాలి

CP Sajjanar | డ్ర‌గ్స్ క‌ట్ట‌డిపై దుబ్బాక (Dubbaka) యువ‌త ఆలోచ‌న‌కు హైద‌రాబాద్ సీపీ సజ్జ‌నార్ ఫిదా అయ్యారు.

S

Telangana | Published On Oct 18, 2026, 3.07 pm IST

CP Sajjanar | డ్ర‌గ్స్ క‌ట్ట‌డిపై మీ ఆలోచ‌న సూప‌ర్‌.. ఈ ప్ర‌య‌త్నం ప్ర‌తొక్క‌రికీ మార్గ‌ద‌ర్శ‌కం కావాలి
Advertisement
  • దుబ్బాక యువ‌కిర‌ణం స్పోర్ట్స్ క్ల‌బ్ స‌భ్యుల‌పై సీపీ స‌జ్జ‌నార్ ప్ర‌శంస‌ల జ‌ల్లు

CP Sajjanar | త్రినేత్ర న్యూస్: డ్ర‌గ్స్ క‌ట్ట‌డిపై దుబ్బాక (Dubbaka) యువ‌త ఆలోచ‌న‌కు హైద‌రాబాద్ సీపీ సజ్జ‌నార్ ఫిదా అయ్యారు. భక్తితో పాటు సామాజిక బాధ్యతను జోడించి, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను నవ సమాజ నిర్మాణ వేదికగా మార్చిన యువకిరణం స్పోర్ట్స్ క్లబ్ (Yuvakiranam Sports Club) స‌భ్యులపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురించారు. వీరి ఆలోచ‌న బాగుంద‌ని.. ఈ ప్ర‌య‌త్నం ప్ర‌తి ఒక్క‌రికీ మార్గ‌ద‌ర్శకం కావాల‌ని ఆకాంక్షించారు. ఈమేర‌కు ఆదివారం ఆయ‌న ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

ద‌స‌రా పండ‌గను పుర‌స్క‌రించుకొని నిర్వ‌హించే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సంద‌ర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక యువ‌కిర‌ణం స్పోర్ట్స్ క్ల‌బ్ స‌భ్యులు వినూత్న ఆలోచ‌న చేయ‌డం బాగుంది. పండుగ వేళ వారు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా డ్రగ్స్ నిర్మూలన, ఆన్‌లైన్ బెట్టింగ్ నివారణ, రోడ్డు భద్రత వంటి కీలక అంశాలపై పోలీస్ అధికారుల సందేశాలతో ప్రజల్లో చైతన్యం నింపడం స్ఫూర్తిదాయ‌కం. ఇది వారి ఆలోచనా పరిపక్వతకు నిదర్శనం.

నిరంతరం సమాజ రక్షణ కోసం పనిచేసే పోలీసు అధికారుల సేవలను గుర్తించారు. యువతకు ఆదర్శంగా నిలిపేలా మండపాన్ని తీర్చిదిద్దిన క్లబ్ నిర్వాహకులందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. నేటి యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ, ఉన్నత ఆశయాలతో సమాజ హితం కోసం ముందడుగు వేసేందుకు ఈ ప్రయత్నం అందరికీ మార్గదర్శకంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా అని స‌జ్జ‌నార్ ట్వీట్ చేశారు.

Advertisement
Advertisement