త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TPCC Gouri Satish | 22A పై బీజేపీ డైవర్ట్ పాలిటిక్స్.. రాష్ట్రాన్ని లూటీ చేసిన కేటీఆర్‌కు ఆ అర్హత లేదు

22A భూములపై బీజేపీ ధర్నాలు చేయడం హాస్యాస్పదమని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరి సతీష్ మండిపడ్డారు. దమ్ముంటే బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు.

J

Telangana | Published On Sep 5, 2026, 5.06 pm IST

TPCC Gouri Satish | 22A పై బీజేపీ డైవర్ట్ పాలిటిక్స్.. రాష్ట్రాన్ని లూటీ చేసిన కేటీఆర్‌కు ఆ అర్హత లేదు
Advertisement
  • 1908 నాటి 22A చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినట్లుగా బీజేపీ నేతలు వక్రీకరిస్తూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని గౌరి సతీష్ ఆగ్రహం
  • నల్ల చట్టాలతో వెయ్యి మంది రైతుల ప్రాణాలు బలిగొన్న బీజేపీకి.. రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని విమర్శ
  • రెవెన్యూ మంత్రి సారథ్యంలో ఎంఆర్ఓ (MRO) స్థాయి నుంచి సీసీఎల్ఏ (CCLA) వరకు కేస్ బై కేస్ (Case by case) 22A సమస్యలను పరిష్కరిస్తున్నట్లు వెల్లడి
  • పదేళ్ల పాటు యువతను, ఉద్యోగులను గాలికొదిలేసి ఆర్థిక విధ్వంసం సృష్టించిన బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ పాలనను విమర్శించే హక్కు లేదని మండిపాటు

TPCC Gouri Satish | త్రినేత్ర.న్యూస్ : ఇందిరా పార్క్ (Indira Park) వద్ద 22A భూముల సమస్యలపై భారతీయ జనతా పార్టీ (BJP) చేస్తున్న ధర్నాలపై టీపీసీసీ అధికార ప్రతినిధి (TPCC Spokesperson) గౌరి సతీష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల చావులకు కారణమైన బీజేపీ నేతలు రైతుల గురించి మాట్లాడటం, రాష్ట్రాన్ని ఆర్థికంగా అప్పులపాలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ( BRS Working President) కేటీఆర్ కాంగ్రెస్ పాలనను విమర్శించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

బీజేపీకి ఆ నైతిక అర్హత లేదు

22A చట్టం అనేది 1908లో వచ్చిందని, కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కాంగ్రెస్ దాన్ని కొత్తగా తెచ్చినట్లు బీజేపీ నేతలు వక్రీకరించి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో నల్ల చట్టాలు తెచ్చి సుమారు వెయ్యి మంది రైతుల చావుకు కారణమైన బీజేపీకి రైతుల గురించి మాట్లాడే హక్కే లేదని తేల్చి చెప్పారు. రైతులపై నిజంగా ప్రేమ ఉంటే గిట్టుబాటు ధర (Minimum Support Price) కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులను తప్పుదోవ పట్టించేలా డైవర్ట్ పాలిటిక్స్ (Divert politics) మానుకోవాలని సూచించారు.

గత ప్రభుత్వ హయాంలో 22A ను ఏ విధంగా ఇంప్లిమెంట్ (Implement) చేశారో అందరికీ తెలుసని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి సారథ్యంలో ఆ సమస్యలను పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. ఎంఆర్ఓ (MRO) స్థాయి నుంచి సీసీఎల్ఏ (CCLA) కమిషనర్ వరకు కేస్ బై కేస్ (Case by case) 22A సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని వివరించారు.

కేటీఆర్‌కు కౌంటర్.. దమ్ముంటే హౌస్‌కు రండి

కరీంనగర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలకు గౌరి సతీష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు యువతను, ఉద్యోగులను గాలికొదిలేసిన బీఆర్ఎస్.. నేడు సామాజిక న్యాయం, ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కనీసం ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా, రాష్ట్రాన్ని లూటీ చేసి ఆర్థిక విధ్వంసం (Economic destruction) సృష్టించిన కేటీఆర్‌కు.. 1000 రోజుల కాంగ్రెస్ ప్రగతిని విమర్శించే నైతిక అర్హత లేదని మండిపడ్డారు.

అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్న ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించేముందు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ (Budget) పట్ల, సంక్షేమ పథకాల పట్ల దమ్ము, ధైర్యం, నైతికత ఉంటే బీఆర్ఎస్ ఎల్పీ (BRSLP) లీడర్‌ కేసీఆర్‌ను అసెంబ్లీకి రమ్మని చెప్పాలని సవాల్ విసిరారు.

Advertisement
Advertisement