త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tiger | సిద్దిపేట‌లో పెద్ద పులి అల‌జ‌డి.. ఒకే రోజు ఏడు మూగ జీవాలు బ‌లి

Tiger | సిద్దిపేట‌లో ఓ పెద్ద పులి అల‌జ‌డి సృష్టిస్తోంది. ఒకే రోజు ఏడు ప‌శువుల‌ను పొట్ట‌న పెట్టుకుంది. దీంతో సిద్దిపేట జిల్లా ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. పెద్ద పులి సంచారంపై అట‌వీశాఖ అధికారులు ప్ర‌త్యేక దృష్టి సారించారు.

S

Telangana | Published On Feb 8, 2026, 8.28 pm IST

Tiger | సిద్దిపేట‌లో పెద్ద పులి అల‌జ‌డి.. ఒకే రోజు ఏడు మూగ జీవాలు బ‌లి
Advertisement

Tiger | త్రినేత్ర‌.న్యూస్ : సిద్దిపేట‌లో ఓ పెద్ద పులి అల‌జ‌డి సృష్టిస్తోంది. ఒకే రోజు ఏడు ప‌శువుల‌ను పొట్ట‌న పెట్టుకుంది. దీంతో సిద్దిపేట జిల్లా ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. పెద్ద పులి సంచారంపై అట‌వీశాఖ అధికారులు ప్ర‌త్యేక దృష్టి సారించారు.

నంగునూరు మండలంలోని ఘ‌న్‌పూర్ గ్రామం, కోహెడ మండ‌ల ప‌రిధిలోని ఆరేప‌ల్లి గ్రామాల్లో పులి సంచ‌రిస్తూ.. ఇద్ద‌రు రైతుల‌కు చెందిన ప‌శువుల‌పై దాడి చేసి చంపింది. ఘ‌న్‌పూర్ గ్రామంలో రెండు, ఆరేప‌ల్లి గ్రామంలో మ‌రో ఐదు ప‌శువుల‌ను పులి హ‌త‌మార్చింది.

అయితే పెద్ద పులి ఆదివారం తెల్ల‌వారుజామున ప‌శువుల‌పై దాడి చేసిన‌ట్లు అట‌వీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఆదివారం ఉద‌యం రైతులు త‌మ వ్య‌వ‌సాయ పొలాల వ‌ద్ద‌కు వెళ్లి చూడ‌గా ప‌శువులు చ‌నిపోయి ఉండ‌డాన్ని చూషి షాక‌య్యారు. ఆరేప‌ల్లి, ఘ‌న్‌పూర్ గ్రామ శివార్ల‌లో అట‌వీశాఖ అధికారులు నిఘా పెట్టారు. పెద్ద పులి క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నించేందుకు ట్రాక్ కెమెరాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు.

ఈ పెద్ద పులి సింగ‌రాయ ప్రాజెక్టు స‌మీపంలోని అడ‌వుల్లోకి వెళ్లి ఉండొచ్చ‌ని అధికారులు భావిస్తున్నారు. అధికారులు డ్రోన్ల‌ను ఉప‌యోగించి స్థానిక అడ‌వులను జల్లెడ ప‌డుతున్నారు. ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతం కావ‌డంతో పులి క‌ద‌లిక‌ల‌ను అధికారులు గ‌మ‌నించ‌లేక‌పోయారు.

ఇక స‌మీప గ్రామాల్లోని ప‌శువుల‌ను త‌మ నివాసాల వ‌ద్దే రైతులు క‌ట్టేసుకుంటున్నారు. పొలాల వ‌ద్ద ప‌శువుల‌ను ఉంచ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. రైతులు, ప్ర‌జ‌లు గుంపులు గుంపులుగా వ్య‌వ‌సాయ పొలాల‌కు వ‌ద్ద‌కు వెళ్లాల‌ని, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు.

ఆడ తోడు కోసం మ‌హారాష్ట్ర నుంచి తెలంగాణ‌లోకి ప్ర‌వేశించిన పెద్ద పులి తిరిగి త‌న స్థానానికి వెళ్తున్న‌ట్లు అధికారులు అంచ‌నా వేస్తున్నారు. గ‌త 20 రోజులుగా యాదాద్రి భువ‌న‌గిరి, జ‌న‌గామ‌, సిద్దిపేట జిల్లాల్లో అల‌జ‌డి సృష్టిస్తున్న పెద్ద పులి 12 ప్రాంతాల్లో ప‌శువుల‌పై దాడుల‌కు పాల్ప‌డి ర‌క్తాన్ని క‌ళ్లారా చూసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement