Thummala Nageshwar Rao | కేటీఆర్ ఖమ్మం పర్యటన వేళ.. చక్రం తిప్పిన మంత్రి తుమ్మల..!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఖమ్మం జిల్లా పర్యటన వేళ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చక్రం తిప్పారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో దాదాపు గులాబీ పార్టీ ప్రాతినిథ్యం లేకుండా చేశారు.
trinethra.news | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఖమ్మం జిల్లా పర్యటన వేళ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చక్రం తిప్పారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో దాదాపు గులాబీ పార్టీ ప్రాతినిథ్యం లేకుండా చేశారు. ఇప్పటికే నగర మేయర్, డిప్యూటీ మేయర్ సహా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టలో చేరగా, సోమవారం ఐదుగురు కారు పార్టీ కార్పొరేటర్లు పీసీసీ అధ్యక్షుడి సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. తాజాగా మరో ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. మొత్తం 40 మంది కార్పొరేటర్లతో హైదరబాద్ బయల్దేరారు. ఈ సందర్భంగా ఖమ్మం మున్సిపాలిటీ పాలవర్గాన్ని రద్దు చేయాలని, ఫిబ్రవరిలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని కోరనున్నట్లు తెలుస్తున్నది.
60 డివిజన్లు కలిగిన ఖమ్మం కార్పొరేషన్‌కు 2021లో ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అయితే తదనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వలసలు ప్రారంభమయ్యాయి. మేయర్, డిప్యూటీ మేయర్ సహా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు హస్తం పార్టీలోకి జంప్ అవడంతో ఖమ్మం కార్పొరేషన్ కాంగ్రెస్ వశమైంది. ఈ నెల 5న గాంధీభవన్‌లో ఐదుగురు గులాబీ కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఆ పార్టీ బలం 37కు చేరింది. అయితే పాత కొత్త నేతలతో ఖమ్మం కాంగ్రెస్‌లో గందరగోళం నెలకొన్నది. ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన తమకు.. వలసతో రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లను అభినందిస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల వారీగా సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ సర్పంచులతో సమావేశం కానున్నారు. అయితే కేటీఆర్ ఖమ్మం జిల్లాలో ఉండగానే.. ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం గమనార్హం.
తాజావార్తలు
- ●WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..
- ●Supreme Court | విద్యార్థులపై చర్యలు వద్దు.. వారిని వెంటనే వదిలిపెట్టండి.. పోలీసుల లాఠీఛార్జ్‌పై సుప్రీం కీలక ఆదేశాలు
- ●Jurala Project | జూరాలకు పోటెత్తిన వరద.. దిగువకు 30 వేల క్యూసెక్కులు విడుదల
- ●CP Sumathi | దివ్యాంగుడి కలను నిజం చేసిన సీపీ సుమతి
- ●Attack with Knife | జనగామలో కత్తిపోట్ల కలకలం.. నలుగురు యువకులపై దాడి
- ●Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బదులు శాఖ మార్పు ప్రతిపాదన చేసిన మోదీ సర్కార్.. కానీ..

WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..

Supreme Court | విద్యార్థులపై చర్యలు వద్దు.. వారిని వెంటనే వదిలిపెట్టండి.. పోలీసుల లాఠీఛార్జ్‌పై సుప్రీం కీలక ఆదేశాలు

Jurala Project | జూరాలకు పోటెత్తిన వరద.. దిగువకు 30 వేల క్యూసెక్కులు విడుదల

CP Sumathi | దివ్యాంగుడి కలను నిజం చేసిన సీపీ సుమతి






