త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thummala Nageswara Rao | బంగాళాఖాతంలో మునిగిపోయిన వాళ్లే.. హైడ్రాను బంగాళాఖాతంలో వేస్తామంటే ఎలా?: మంత్రి తుమ్మ‌ల‌

Thummala Nageswara Rao | బంగాళాఖాతంలో మునిగిపోయిన వాళ్లే హైడ్రాను (HYDRAA) బంగాళాఖాతంలో వేస్తామంటే అర్థం లేద‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రరావు (Thummala Nageswara Rao) విమ‌ర్శించారు. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత హైడ్రాను బంగాళాఖాతంలో ప‌డేస్తామంటూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్య‌ల‌కు ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చారు.

G

Telangana | Published On Jul 29, 2026, 1.23 pm IST

Thummala Nageswara Rao | బంగాళాఖాతంలో మునిగిపోయిన వాళ్లే.. హైడ్రాను బంగాళాఖాతంలో వేస్తామంటే ఎలా?: మంత్రి తుమ్మ‌ల‌
Advertisement

Thummala Nageswara Rao | త్రినేత్ర‌.న్యూస్‌: బంగాళాఖాతంలో మునిగిపోయిన వాళ్లే హైడ్రాను (HYDRAA) బంగాళాఖాతంలో వేస్తామంటే అర్థం లేద‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రరావు (Thummala Nageswara Rao) విమ‌ర్శించారు. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత హైడ్రాను బంగాళాఖాతంలో ప‌డేస్తామంటూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్య‌ల‌కు ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చారు. వర్షాకాలం వచ్చినా ఇప్పటికీ 30 శాతం లోటు వర్ష పాతం నమోదైందని మంత్రి తెలిపారు. 150 ఏండ్ల‌ నుంచి చూడని ప్రకృతి వైపరీత్యం వచ్చిందని చెప్పారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో కూడా తీవ్ర ఎలినినో ప్రభావం ఉంటుందని వెల్ల‌డించారు. దీనిగురించి ప్రజలకు తెలియజేస్తున్నామని, అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తున్నామని తెలిపారు. ప్ర‌భుత్వ సూచ‌న మేర‌కు రైతులు మెట్ట పంటలు వేస్తున్నారని చెప్పారు. రైతులు ఆయిల్ పామ్ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారన్నారు.

హ్రైడ్రా ఒక బ్లాక్‌మెయిల్ టూల్‌: కేటీఆర్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (Revanth Reddy) హైడ్రా ఒక వేట కుక్కలా మారిందంటూ ఢిల్లీ వేదిక‌గా కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తిన విష‌యం తెలిసిందే. ఆ వేట కుక్కను పంపించి, దానిని అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని విమ‌ర్శించారు. హైడ్రా ద్వారా బడా బాబులను బెదిరించి డబ్బులు దండుకుంటున్నారని, ఆ డబ్బులో కొంత వాటా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీకి, మరికొంత వాటా బీజేపీకి ఇస్తున్నారని ఆరోపించారు. హైడ్రా అనేది తొమ్మిది తలల విషసర్పం అని హైకోర్టే చెప్పింద‌న్నారు. హైడ్రా ఒక సంస్క‌ర‌ణ అయితే, మీ అన్న తిరుపతిరెడ్డి ఇల్లు, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత కేవీపీ రామచంద్రరావుల ఇండ్లు ఎందుకు కూల్చడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని ప్ర‌శ్నించారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జూలై 28న కేటీఆర్ రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఎంపీ వద్దిరాజు నివాసంలో మీడియాతో మాట్లాడుతూ హైడ్రా అరాచ‌క సంస్థ‌, తాము అధికారంలోకి వ‌స్తే బంగాళాఖాతంలో వేస్తామ‌న్నారు. రేవంత్ రెడ్డి తెచ్చే ప్ర‌తి స్కీమ్‌ వెనుక ఒక స్కామ్ ఇంటుంద‌ని విమ‌ర్శించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement