Niranjan Reddy | ఎల్‌నినో ప్రభావం ఉంటే ఏపీలో ఎందుకు వరి వేస్తున్నారు..? : నిరంజన్ రెడ్డి
Niranjan Reddy | ఎల్ నినో ప్రభావం ఉంటే ఏపీలో ఎందుకు వరి( Paddy ) వేస్తున్నారు? అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి( Niranjan Reddy ) నిలదీశారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అండతోనే ఏపీ రైతులు సాగుకు సన్నద్ధమయ్యారని తెలిపారు.
Niranjan Reddy | త్రినేత్ర.న్యూస్ : ఎల్ నినో ప్రభావం ఉంటే ఏపీలో ఎందుకు వరి( Paddy ) వేస్తున్నారు? అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి( Niranjan Reddy ) నిలదీశారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అండతోనే ఏపీ రైతులు సాగుకు సన్నద్ధమయ్యారని తెలిపారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే లు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి జూరాల ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం ఆత్మకూరులో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో ఎందుకు వరి వేయడం లేదు..? ఏపీలో ఎందుకు వరి వేస్తున్నారు..? అంటే పైనుండే కదా కిందికి నీళ్లు పోయేది. ఆంధ్ర వాళ్లకు ఎలాగైనా నీళ్లు వస్తాయని నమ్మకం ఉంది. అందుకే వరి వేసుకున్నారు. తెలంగాణ ప్రజల కంటే ఆంధ్ర ప్రజలకు రేవంత్ రెడ్డిపై ఎక్కువ నమ్మకం ఉంది.. ఎందుకంటే నీళ్లు ఎలాగైనా కిందికి వదిలిపెడతాడని తెలుసు కాబట్టి. రేవంత్ రెడ్డికి ఆంధ్రా ప్రజల మీద ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేదా? అని నిరంజన్ రెడ్డి నిలదీశారు. జూరాల ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటి విడుదల చేయకపోవడంపై మండిపడ్డారు.
4 టీఎంసీలతో 40 వేల ఎకరాలు పండించవచ్చు
నాలుగు రోజులు లేట్ అయినా 4 టీఎంసీల నీళ్లు కిందికి పోతాయి.. 4 టీఎంసీలతో 40 వేల ఎకరాలు పండించవచ్చు. ఈ సంవత్సరం వర్షాలు పడకపోయినా వచ్చే సంవత్సరం వరకు మన రిజర్వాయర్లలోని నీటితో మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వొచ్చని సంబంధిత ఇంజినీర్లు చెప్పారు. కానీ వర్షాలు పడలేదు, మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వలేకపోతున్నామని రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అంటున్నారు.. వీళ్లకు అవగాహన ఉండి మాట్లాడుతారో, లేక అవగాహన లేక మాట్లాడుతారో అర్థం కాదు. మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా ఇచ్చేందుకు చేతకాక, అవగాహన లేక వర్షాలు పడలేదని ప్రజలను గందరగోళ పరుస్తున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

Thummala Nageswara Rao | బంగాళాఖాతంలో మునిగిపోయిన వాళ్లే.. హైడ్రాను బంగాళాఖాతంలో వేస్తామంటే ఎలా?: మంత్రి తుమ్మల
జులై 29, 2026

Srinivas Goud | జూరాల ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువలకు తక్షణమే నీటిని విడుదల చేయాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
జులై 29, 2026

Gutha Sukender Reddy | రాష్ట్రాభివృద్ధికి ప్రవాసులు ముందుకు రావాలి.. ఎక్కడ స్థిరపడినా మాతృభూమిని మరవొద్దు: గుత్తా సుఖేందర్ రెడ్డి
జులై 29, 2026
తాజావార్తలు
- ●Kangana Ranaut | నువ్వో పనికిరానివాడివి.. కాక్రోచ్ పార్టీ ప్రతినిధిపై కంగన వివాదాస్పద వ్యాఖ్యలు
- ●Thummala Nageswara Rao | బంగాళాఖాతంలో మునిగిపోయిన వాళ్లే.. హైడ్రాను బంగాళాఖాతంలో వేస్తామంటే ఎలా?: మంత్రి తుమ్మల
- ●Rajya Sabha | నడ్డా Vs ఖర్గే.. సీజేపీ ఆందోళనల్లో పోలీసుల బలప్రయోగంపై భగ్గుమన్న రాజ్యసభ
- ●Banking | మినిమం బ్యాలెన్స్ పెనాల్టీల పేరిట బ్యాంకుల భారీ వసూళ్లు.. హెచ్డీఎఫ్సీ టాప్..
- ●Srinivas Goud | జూరాల ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువలకు తక్షణమే నీటిని విడుదల చేయాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●Delhi Police | ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టులు.. సోషల్ మీడియా ఖాతాలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు

Kangana Ranaut | నువ్వో పనికిరానివాడివి.. కాక్రోచ్ పార్టీ ప్రతినిధిపై కంగన వివాదాస్పద వ్యాఖ్యలు

Thummala Nageswara Rao | బంగాళాఖాతంలో మునిగిపోయిన వాళ్లే.. హైడ్రాను బంగాళాఖాతంలో వేస్తామంటే ఎలా?: మంత్రి తుమ్మల

Rajya Sabha | నడ్డా Vs ఖర్గే.. సీజేపీ ఆందోళనల్లో పోలీసుల బలప్రయోగంపై భగ్గుమన్న రాజ్యసభ

Banking | మినిమం బ్యాలెన్స్ పెనాల్టీల పేరిట బ్యాంకుల భారీ వసూళ్లు.. హెచ్డీఎఫ్సీ టాప్..



