Srinivas Goud | జూరాల ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువలకు తక్షణమే నీటిని విడుదల చేయాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Srinivas Goud | జూరాల ప్రాజెక్టు (Jurala project) కుడి, ఎడమ ప్రధాన కాలువలకు తక్షణమే నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) డిమాండ్ చేశారు.
Srinivas Goud | త్రినేత్ర.న్యూస్: జూరాల ప్రాజెక్టు (Jurala project) కుడి, ఎడమ ప్రధాన కాలువలకు తక్షణమే నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) డిమాండ్ చేశారు. గత నాలుగు రోజులుగా ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) పాలమూరు రైతుల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించి కర్కశంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 7.12 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, సుమారు 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. అయినా వచ్చిన నీటిని జూరాల కుడి, ఎడమ ప్రధాన కాలువలకు (Jurala Canals) విడుదల చేయకుండా విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగువకు విడుదల చేయడం వల్ల పాలమూరు రైతులు సాగునీటికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రైతుల అవసరాలను పక్కనపెట్టి శ్రీశైలానికి Srisailam) నీటిని విడుదల చేస్తుందని, తద్వారా ఆ నీరు పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే మార్గాన్ని రేవంత్ రెడ్డి ( Revanth Reddy) సుగమం చేశాడని విమర్శించారు. తక్షణమే జూరాల కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేసి పాలమూరు రైతుల సాగు అవసరాలను తీర్చాలని బీఆర్ఎస్ (BRS) పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మంచి మాటతో కాలువలకు నీటిని విడుదల చేయాలని, లేనట్లయితే గురువారం (జూలై 30న) వేలాది మంది రైతులతో కలిసి జూరాల ప్రాజెక్టును ముట్టడించి, కాలువలకు నీటిని విడుదల చేసే ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Gutha Sukender Reddy | రాష్ట్రాభివృద్ధికి ప్రవాసులు ముందుకు రావాలి.. ఎక్కడ స్థిరపడినా మాతృభూమిని మరవొద్దు: గుత్తా సుఖేందర్ రెడ్డి
జులై 29, 2026

CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి
జులై 28, 2026

CM Revanth Reddy | హైడ్రాపై వెనక్కి తగ్గం.. మరింత బలోపేతం చేస్తాం
జులై 28, 2026
తాజావార్తలు
- ●Delhi Police | ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టులు.. సోషల్ మీడియా ఖాతాలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు
- ●Giri Pradakshina | కొండగట్టు అంజన్న ఆలయంలో గిరి ప్రదక్షిణ.. పాల్గొన్న మంత్రులు.. ఫొటోలు
- ●Gutha Sukender Reddy | రాష్ట్రాభివృద్ధికి ప్రవాసులు ముందుకు రావాలి.. ఎక్కడ స్థిరపడినా మాతృభూమిని మరవొద్దు: గుత్తా సుఖేందర్ రెడ్డి
- ●Apple Upgrade | అప్‌గ్రేడ్ లీజ్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసిన యాపిల్.. ఇక ఐఫోన్ సహా అన్ని రకాల డివైస్‌లు అద్దెకు..
- ●Russia-Ukraine War | బ్లాక్‌సీలో ఉద్రిక్తత.. కార్గో నౌకలో చిక్కుకుపోయిన 13 మంది భారతీయ నావికులు
- ●Paper Leak | ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్ లీక్.. 30 మంది అభ్యర్థుల నుంచి 1.2 కోట్లు వసూలు చేసిన డాక్టర్..

Delhi Police | ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టులు.. సోషల్ మీడియా ఖాతాలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు

Giri Pradakshina | కొండగట్టు అంజన్న ఆలయంలో గిరి ప్రదక్షిణ.. పాల్గొన్న మంత్రులు.. ఫొటోలు

Gutha Sukender Reddy | రాష్ట్రాభివృద్ధికి ప్రవాసులు ముందుకు రావాలి.. ఎక్కడ స్థిరపడినా మాతృభూమిని మరవొద్దు: గుత్తా సుఖేందర్ రెడ్డి

Apple Upgrade | అప్‌గ్రేడ్ లీజ్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసిన యాపిల్.. ఇక ఐఫోన్ సహా అన్ని రకాల డివైస్‌లు అద్దెకు..



