త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Murdered | క‌ళ్ల‌లో కారం చ‌ల్లి త‌ల్లీకూతుళ్ల దారుణ హ‌త్య‌.. న‌ల్లొండ జిల్లాలో ఘ‌ట‌న‌

Murdered | నల్గొండ (Nalgonda) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పొలం ప‌నులు చేస్తున్న స‌మ‌యంలో త‌ల్లీకుమార్తెలు హ‌త్య‌కు గుర‌య్యారు. గుర్తు తెలియ‌ని దుండ‌గులు వారి క‌ళ్ల‌లో కారం చ‌ల్లి హ‌త‌మార్చారు. భూ త‌గాదాల‌తోనే ఈ హత్య జ‌రిగిన‌ట్లు భావిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

S

Telangana | Published On May 17, 2026, 4.46 pm IST

Murdered | క‌ళ్ల‌లో కారం చ‌ల్లి త‌ల్లీకూతుళ్ల దారుణ హ‌త్య‌.. న‌ల్లొండ జిల్లాలో ఘ‌ట‌న‌
Advertisement
  • ఆడ‌ప‌డుచులతో ఉన్న భూ త‌గాదాల‌తోనే హ‌త్య
  • విచార‌ణ అనంత‌రం పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌న్న మిర్యాల‌గూడ డీఎస్పీ

Murdered | త్రినేత్ర‌.న్యూస్‌: నల్గొండ (Nalgonda) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పొలం ప‌నులు చేస్తున్న స‌మ‌యంలో త‌ల్లీకుమార్తెలు హ‌త్య‌కు గుర‌య్యారు. గుర్తు తెలియ‌ని దుండ‌గులు వారి క‌ళ్ల‌లో కారం చ‌ల్లి హ‌త‌మార్చారు. ఈ దారుణ ఘ‌ట‌న‌ అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామంలో ఆదివారం ఉద‌యం చోటుచేసుకుంది. భూ త‌గాదాల‌తోనే ఈ హత్య జ‌రిగిన‌ట్లు భావిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

మిర్యాల‌గూడ డీఎస్పీ రాజ‌శేఖ‌ర రాజు ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి. ఇబ్రహీంపేటకు చెందిన‌ రుద్రాక్ష సుమలత (Sumalatha) త‌న కుమార్తె రుద్రాక్ష లావణ్య (Lavanya) తో క‌లిసి ఆదివారం ఉద‌యం ఆయిల్‌ పామ్‌ తోటలో ప‌నికి వెళ్లారు. సుమలత భర్త కొన్నేళ్ల క్రితం చనిపోగా పొలం ప‌నులు చేస్తూ జీవ‌నం సాగిస్తున్నారు. ఈరోజు ఉద‌యం ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు మాకు ఫోన్ వచ్చింది. వారి మెడకు క్లాత్​తో చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. మృతులు రుద్రాక్ష సుమలత, ఆమె కుమార్తె లావణ్యలుగా గుర్తించాం. సుమలతకు ఆడపడుచులతో ఉన్న భూ తగాదాల కారణంగానే హత్య జరిగినట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. విచార‌ణ అనంత‌రం మీడియాకు పూర్తి వివ‌రాల‌ను వెల్లడిస్తాం అని డీఎస్పీ తెలిపారు.

Advertisement
Advertisement