Ramchandar Rao | కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారు.. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టండి
Ramchandar Rao | జనగామ జిల్లాకు సర్ధార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. దాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు.
- పోయినసారి గొడవ చేస్తే ఇప్పుడు విగ్రహం పెట్టే ప్రయత్నం చేస్తున్నరు
- మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్
Ramchandar Rao | త్రినేత్ర.న్యూస్: జనగామ జిల్లాకు సర్ధార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. దాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. పోయినసారి గొడవ చేస్తే ఇప్పుడు విగ్రహం పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచారని కొనియాడారు. పాపన్నగౌడ్ 376వ జయంతిని పురస్కరించుకొని నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు.
17వ శతాబ్దం చివరి దశలో, 18వ శతాబ్దం ప్రారంభంలో దక్కన్‌లోని సామంత వ్యవస్థను సవాలు చేసిన మహోన్నత పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దాదాపు మూడు సంవత్సరాలు గడిచినా, ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదు.
రాజుగా వెలిగాడు..
జనగామ జిల్లా కిషన్‌పురలో పాపన్న పుట్టారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడారు. ఆరోజు గోల్కొండ కోట మీద తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. 1200 మంది సైనికులను సమకూర్చుకున్నాడు. మన ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాడు. ఒక రాజుగా, ఒక యోధగా, పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు పరితపించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు. మొఘల్ సైనికులతో పోరాడారు. అందరి గుండెల్లో దేవుడిగా వెలిగారు. ఒక బీసీ నాయకుడు ఆరోజుల్లోనే రాజుగా వెలుగొందాడు.
కాంగ్రెస్ డిక్లరేషన్‌లో జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతామన్నారు. మరి ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్య లేదు. ఇప్పటికైనా పాపన్న పేరు పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. డిక్లరేషన్‌లో ఉన్న విషయాలను మీరు పట్టించుకోలేదు. కనీసం పేరైనా పెట్టండి. పోయినసారి గొడవ చేస్తే ఇప్పుడు విగ్రహం పెట్టే ప్రయత్నం చేస్తున్నరు. వెంటనే సర్వాయి పాపన్న జనగామ జిల్లాగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వందేమాతర గేయాన్ని అవమానపరిచారు. నిన్న గోవాలో మల్లికార్జున ఖర్గే గారు కేవలం రెండు చరణాలే పాడారు. వందేమాతరంలో ఉన్న చరణాలన్నీ పాడాలి. కేవలం మూడు నిమిషాల్లో పాడొచ్చు. దాంట్లో మత అంశాలు లేవు. అయినా ఆరోజు ముస్లింలీగ్ వ్యతిరేకించింది. అలా వ్యతిరేకించినందుకు చరణాలన్నీ తీసేసి కేవలం రెండు చరణాలే పాడుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం ముస్లింలీగ్ కింద మారింది. ఇప్పటికైనా జాతీయ గీతాన్ని, సింబల్స్‌ను గౌరవించడం నేర్చుకోవాలి అని రాంచందర్‌రావు హితవు పలికారు.
తాజావార్తలు
- ●Harsh Goenka | దాబేలీ.. బర్గర్ కంటే చాలా రుచికరంగా ఉంటుంది
- ●Harish Rao | లైసెన్స్డ్ సర్వేయర్లకు జీతాలేవీ..? అడిగితే అరెస్టులు చేస్తారా..?
- ●National Sports Awards 2025 | తెలంగాణ బిడ్డలకు అర్జున అవార్డులు
- ●RS Praveen Kumar | ఉద్దేశపూర్వకంగానే కళ్యాణలక్ష్మి పథకం రద్దుకు కుట్ర : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●Mohan Lal | శబరిమలలో షూటింగ్‌లకు "నో" పర్మిషన్ - మోహన్‌లాల్ సినిమాకు అనుమతి నిరాకరణ
- ●Bengaluru Double Murder | భర్త, కొడుకు టీవీలో బిగ్‌బాస్ చూసి నిద్రపోయాక.. గ్లౌజులు వేసుకుని మరీ హత్య చేసిన భార్య

Harsh Goenka | దాబేలీ.. బర్గర్ కంటే చాలా రుచికరంగా ఉంటుంది

Harish Rao | లైసెన్స్డ్ సర్వేయర్లకు జీతాలేవీ..? అడిగితే అరెస్టులు చేస్తారా..?

National Sports Awards 2025 | తెలంగాణ బిడ్డలకు అర్జున అవార్డులు

RS Praveen Kumar | ఉద్దేశపూర్వకంగానే కళ్యాణలక్ష్మి పథకం రద్దుకు కుట్ర : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్






