Etala Rajendar | దూరమవుతున్న స్నేహ, బంధుత్వాలను ఈ ఉత్సవాలు దగ్గర చేస్తాయి: ఈటల రాజేందర్
Etala Rajendar | మానవ సంబంధాల పరిపుష్టిని గుర్తు చేసే గొప్ప పండగ వినాయక చవితి అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బ్రిటిష్ పాలకులను ఎదిరించేందుకు బాలగంగాధర్ తిలక్ ఈ మండపాలను వేదికగా మార్చుకున్నారని గర్తుచేశారు.
Etala Rajendar | త్రినేత్ర.న్యూస్: మానవ సంబంధాల పరిపుష్టిని గుర్తు చేసే గొప్ప పండగ వినాయక చవితి అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. భారత జాతిని, హిందూ సమాజాన్ని ఒక్కటి చేయడమే వినాయక ఉత్సవాల ఉద్దేశమన్నారు. బ్రిటిష్ పాలకులను ఎదిరించేందుకు బాలగంగాధర్ తిలక్ ఈ మండపాలను వేదికగా మార్చుకున్నారని గర్తుచేశారు. గల్లీ గల్లీలో గణనాథుడిని ప్రతిష్టించి, అందరూ కలిసికట్టుగా ఉత్సవాలు నిర్వహించడం వల్ల ప్రజల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయన్నారు. ఈమేరకు సోమవారం వినాయక చవితి సందర్భంగా పార్టీ ఆఫీసులో వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రపంచంలోనే ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు కలిగిన దేశం భారతదేశం. ఈ దేశాన్ని పరాయి పాలకులు కబళించిన్నాడు భారత జాతిని, హిందూ సమాజాన్నిఒక్కటి చేయాలన్నా ఆలోచనతో మన విశ్వాసాలను, నమ్మకాలను స్వతంత్ర సంగ్రామంలో మలుచుకున్నదానికి సజీవ సాక్ష్యమే ఈరోజు జరుపుతున్న గణేశుని ఉత్సవాల పండగ. ఆనాడు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో బాలగంగాధర్ తిలక్ గారు జాతి ఐక్యం చేయడానికి మండపాలను వేదికగా చేసుకున్నడు.
ఓవైపు మన సంప్రదాయం, మరోవైపు సంఘటిత శక్తితోనే బ్రిటిష్ పాలకులపై యుద్ధం చేసి స్వాతంత్య్రం సాధించుకున్నాం. మహారాష్ట్రలో బాలగంగాధర్‌తో మొదలైన ఆ పరంపర నేడు ప్రతి ఇంటిలో పూజలు నిర్వహించుకుంటున్నాం. ప్రతి గల్లీ నుంచి పట్టణం వరకు ఈరోజు లక్షల మండపాలు ఏర్పాటు చేస్తున్నరు. కోట్లాది మంది యువత, మహిళలు ప్రతి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు అన్నదానం, భజనలు నిర్వహిస్తూ వచ్చే తరాలకు కూడా మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పదనం చెబుతున్నారు. మానవ సంబంధాల పరిపుష్టి ఏందో గుర్తు చేసే గొప్ప ఉత్సవంగా ఈ పండగను చూస్తున్నం.
మళ్లీ దగ్గర చేస్తాయి..
ఈరోజు హైదరాబాద్ ఉత్సవ గణేశ్ సమితి ఈ పండగను గొప్పగా నిర్వహిస్తుంది. రోజువారీ బిజీ జీవితంలో దూరమవుతున్న బంధుత్వాలు, స్నేహాలను ఈ నవరాత్రి ఉత్సవాలు మళ్లీ దగ్గర చేస్తాయి. లంబోదరుడి పూజల్లో సమాజ శ్రేయస్సు, అందరి సంతోషం దాగి ఉంది. యువతకు, మహిళలకు, పండగలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని ఈటల పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Eesha Rebba | హీరోయిన్‌తో రిలేషన్ …. వినాయకచవితి రోజు ఫొటోతో కన్ఫామ్ చేసిన తెలుగు డైరెక్టర్
సెప్టెంబర్ 14, 2026

Governor worships to Khairathabad Ganesha | ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ దంపతుల తొలి పూజ
సెప్టెంబర్ 14, 2026

Vinayaka chavithi 2026 | వినాయకుడి వైభవం చూడాల్సిందే.. ఏపీ, తెలంగాణలోని ప్రముఖ క్షేత్రాలు ఇవే..!
సెప్టెంబర్ 14, 2026
తాజావార్తలు
- ●iOS 27 | ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. నేటి నుంచే ఈ ఫోన్లకు ఐఓఎస్ 27 అప్డేట్..
- ●Eesha Rebba | హీరోయిన్‌తో రిలేషన్ .... వినాయకచవితి రోజు ఫొటోతో కన్ఫామ్ చేసిన తెలుగు డైరెక్టర్
- ●E-commerce Rules | ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్.. తప్పుదోవ పట్టించే డిస్కౌంట్లకు చెక్..
- ●OTT | ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ - ఫస్ట్ నైట్ రోజే ప్రియుడితో పెళ్లికూతురు జంప్
- ●అపారమైన సిరిసంపదలు ఉన్నా.. పోరాడే సైనిక బలం లేదా? సౌదీ రక్షణ వ్యవస్థలో అసలు లోపమేంటి?
- ●Apple | ఐఫోన్లను అమ్మేందుకు యాపిల్ పాట్లు.. పెరిగిన ధరలకు కౌంటర్‌గా ఆఫర్లు..

iOS 27 | ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. నేటి నుంచే ఈ ఫోన్లకు ఐఓఎస్ 27 అప్డేట్..

Eesha Rebba | హీరోయిన్‌తో రిలేషన్ .... వినాయకచవితి రోజు ఫొటోతో కన్ఫామ్ చేసిన తెలుగు డైరెక్టర్

E-commerce Rules | ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్.. తప్పుదోవ పట్టించే డిస్కౌంట్లకు చెక్..

OTT | ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ - ఫస్ట్ నైట్ రోజే ప్రియుడితో పెళ్లికూతురు జంప్



