త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | ఓటీటీలోకి త‌మిళ రొమాంటిక్ కామెడీ – ఫ‌స్ట్ నైట్ రోజే ప్రియుడితో పెళ్లికూతురు జంప్‌

టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన త‌మిళ మూవీ మోద‌రాత్రి చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద విజ‌యాన్ని అందుకుంది. తాజాగా ఈ త‌మిళ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. సెప్టెంబ‌ర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో త‌మిళంతో పాటు తెలుగులో రిలీజ్ అవుతోంది.

N

Entertainment | Published On Sep 14, 2026, 4.22 pm IST

OTT | ఓటీటీలోకి త‌మిళ రొమాంటిక్ కామెడీ – ఫ‌స్ట్ నైట్ రోజే ప్రియుడితో పెళ్లికూతురు జంప్‌
Advertisement

OTT |  టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ త‌మిళంలో నిర్మించిన చిన్న సినిమా మోద రాత్రి సూప‌ర్ హిట్‌గా నిలిచింది. కేవ‌లం మూడు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప‌ది కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. శింబు, శివ‌కార్తికేయ‌న్‌తో పాటు ప‌లువురు స్టార్ హీరోలు ఈ చిన్న సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించారు.

నెట్‌ఫ్లిక్స్‌లో...

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో రిషికాంత్‌, అనిష్మా అనిల్ కుమార్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. రాజా క‌రుప్పుసామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తాజాగా ఈ హిట్టు మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. సెప్టెంబ‌ర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. త‌మిళంతో పాటు తెలుగులో రిలీజ్ అవుతోంది.

క‌మెడియ‌న్‌...

త‌మిళంలో ప‌లు సినిమాల్లో క‌మెడియ‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా క‌నిపించిన రిషికాంత్ ఈ సినిమాతోనే హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. కాన్సెప్ట్‌, కామెడీతో పాటు రిషికాంత్‌, అనిష్మా న‌ట‌న అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. కామెడీతో పాటు కుల వివ‌క్షను ఈ సినిమాలో చ‌ర్చించారు. ఈ సినిమాలో డైరెక్ట‌ర్ క‌రుప్పుసామి ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించారు.

మ‌రుదు పెళ్లి క‌థ‌....

మ‌రుదు ల‌వ్‌లో ఫెయిల‌వుతాడు. అదే టైమ్‌లో దుబాయ్‌లో జాబ్ రావ‌డంతో వెళ్లిపోతాడు. పెళ్లికి దూరంగా ఉండాల‌ని అనుకుంటాడు. కానీ మ‌రుదుకు తెలియ‌కుండా కుటుంబ‌స‌భ్యులు ముత్తెసెల్వితో అత‌డి పెళ్లిని ఫిక్స్ చేశారు. దుబాయ్ నుంచి రాగానే పెళ్లిజ‌రిపిస్తారు.
ముత్తుసెల్వికి ల‌వ‌ర్ ఉంటాడు. అత‌డినే పెళ్లిచేసుకోవాల‌ని అనుకుంటుంది. కానీ కుటుంస‌భ్యులు బ‌ల‌వంతంగా మ‌రుదుతో పెళ్లిజ‌రిపిస్తారు. దాంతో ఫ‌స్ట్ నైట్ రోజు భ‌ర్త‌కు తెలియ‌కుండా ల‌వ‌ర్‌తో పారిపోవాల‌ని ప్లాన్ చేస్తుంది. కానీ ప్లాన్ ఫెయిల‌వడంతో మ‌రుదు సాయం కోరుతుంది. భార్య ల‌వ్‌స్టోరీ విన్న మరుదు ప్రియుడితో ఆమెను క‌ల‌పాల‌ని అనుకుంటాడు. ఆ త‌ర్వాత ఏమైంది? ప్రియుడిని ముత్తు సెల్వి క‌ల‌సుకుందా? మ‌రుదు చేసిన ప‌ని ఇంట్లో వాళ్ల‌కు తెలిసిందా? అనే అంశాల‌తో ఈ మూవీ రూపొందింది.

 

.

Advertisement
Advertisement