Governor worships to Khairathabad Ganesha | ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ దంపతుల తొలి పూజ
Governor worships to Khairathabad Ganesha | వినాయక చవితిని పురస్కరించుకొని ఖైరతాబాద్ మహాగణపతిని గవర్నర్ శివ ప్రతాప్‌శుక్లా దంపతులు సోమవారం దర్శించుకున్నారు. 69 అడుగుల ఎత్తులో కొలువుదీరిన ఖైరతాబాద్ 'పంచముఖ సంకటహర మహాగణపతికి తొలి పూజ చేశారు.
త్రినేత్ర.న్యూస్: వినాయక చవితిని పురస్కరించుకొని ఖైరతాబాద్ మహాగణపతిని గవర్నర్ శివ ప్రతాప్‌శుక్లా దంపతులు సోమవారం దర్శించుకున్నారు. 69 అడుగుల ఎత్తులో కొలువుదీరిన ఖైరతాబాద్ 'పంచముఖ సంకటహర మహాగణపతికి తొలి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ నిర్వాహకులు గవర్నర్‌కు ఘన స్వాగతం పలికారు. తొలి పూజలో మంత్రి పొన్నం, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడారు. ఖైరతాబాద్ వినాయకుడికి తొలి పూజలు చేయడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మహాగణపతిని ప్రార్థించానని తెలిపారు. అనంతరం గవర్నర్ దంపతులు లోక్ భవన్ స్టాఫ్ క్వార్టర్స్ లో లోక్ భవన్ యూత్ అసోసియేషన్ నిర్వహించే గణేశుడి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతకుముందు గవర్నర్ దంపతులు వినాయక చవితి పర్వదినం సందర్భంగా లోక్ భవన్ ప్రధాన హౌజ్ లో, దర్బార్ హాల్ లో గణేశుడికి తొలి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి కొమండూరు శశి కిరణాచారి, లోక్ భవన్ అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Revanth Reddy Vinayaka Chaviti | కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
- ●Mahesh Kumar Goud | కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి అసలు కారణం అదే
- ●మక్కా డిఫెన్స్ డీల్‌లో అసలు ట్విస్ట్ ఇదే.. హుతీల దెబ్బకు పాక్ ఎందుకు జాగ్రత్తపడుతోంది?
- ●IPO | ఐపీవోలో పెట్టుబడి పెట్టేముందు గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే.. లేదంటే భారీ నష్టమే..
- ●Rajendra Prasad | జెన్‌జీకి నచ్చే మసాలాలు ఉన్న సినిమా - "పిఠాపురంలో అలా జరిగింది" మూవీపై రాజేంద్రప్రసాద్ కామెంట్స్
- ●AI | ఏఐతో మానవాళికి ముప్పే.. ఆంథ్రోపిక్ సీఈవో సంచలన వ్యాఖ్యలు..

Revanth Reddy Vinayaka Chaviti | కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar Goud | కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి అసలు కారణం అదే

మక్కా డిఫెన్స్ డీల్‌లో అసలు ట్విస్ట్ ఇదే.. హుతీల దెబ్బకు పాక్ ఎందుకు జాగ్రత్తపడుతోంది?

IPO | ఐపీవోలో పెట్టుబడి పెట్టేముందు గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే.. లేదంటే భారీ నష్టమే..










