త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Theenmar Mallanna | బ‌హుజ‌న్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్‌ను గెలిపిస్తే.. ఆరు నెల‌ల్లో ప్ర‌భుత్వంలో ఆర్టీసీ విలీనం: ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌

Theenmar Mallanna | ఆర్టీసీ యూనియ‌న్ ఎన్నిక‌ల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనుబంధ బ‌హుజ‌న్ వ‌ర్కర్స్ యూనియ‌న్‌ను (Bahujan Workers Union) గెలిపిస్తే ప్ర‌భుత్వంలో సంస్థ విలీన ప్ర‌క్రియ‌ను ఆరు నెల‌ల్లో పూర్తిచేయిస్తామ‌ని ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న(Theenmar Mallanna)  అన్నారు.

G

Telangana | Published On Oct 4, 2026, 10.54 am IST

Theenmar Mallanna | బ‌హుజ‌న్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్‌ను గెలిపిస్తే.. ఆరు నెల‌ల్లో ప్ర‌భుత్వంలో ఆర్టీసీ విలీనం: ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌
Advertisement

Theenmar Mallanna | త్రినేత్ర న్యూస్‌: ఆర్టీసీ యూనియ‌న్ ఎన్నిక‌ల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనుబంధ బ‌హుజ‌న్ వ‌ర్కర్స్ యూనియ‌న్‌ను (Bahujan Workers Union) గెలిపిస్తే ప్ర‌భుత్వంలో సంస్థ విలీన ప్ర‌క్రియ‌ను ఆరు నెల‌ల్లో పూర్తిచేయిస్తామ‌ని ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న(Theenmar Mallanna)  అన్నారు. ఆర్టీసీలో రిమూవ‌ల్ అనే ప‌ద‌మే లేకుండా చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ నెల 9న ఆర్టీసీ యూనియ‌న్ ఎన్నిక‌లు (RTC Union Elections) జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. ఇందులో భాగంగా క‌త్తెర గుర్తుకు ఓటువేసి గెలిపించాలంటూ ఆర్టీసీ కార్మికుల‌ను కోరుతున్నారు. ఆదివారం ఉద‌యం గ‌ద్వాల డిపోలో బ‌హుజ‌న్ వ‌ర్కర్స్ యూనియ‌న్ త‌ర‌ఫున ప్రచారం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. బహుజన్ వర్కర్స్ యూనియన్ గెలిచిన ఆరు నెలల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం (RTC Merger) చేసే ప్రక్రియ పూర్తి చేయిస్తామన్నారు. అది సాధించలేకపోతే యూనియన్‌నే పూర్తిగా రద్దు చేస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. సంస్థ‌లో ‘రిమూవల్’ అనే పదమే లేకుండా చేస్తామని వెల్ల‌డించారు. ఈ ఎన్నికల్లో బహుజన్ వర్కర్స్ యూనియన్‌కు మద్దతు ఇవ్వాలని, కత్తెర గుర్తుపై ఓటు వేయాలని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement