Couples suicide in Lalaguda | ఇంట్లో ఉరేసుకున్న భార్య.. భయపడిన భర్త ఏం చేశాడంటే..
Couples suicide in Lalaguda | వారిద్దరిదీ కర్ణాటక రాష్ట్రం. ఏడాదిన్నర క్రితమే కలిసి ఏడడుగులు వేశారు. నూరేళ్ల దాంపత్య జీవనం సాఫీగా సాగిపోవాలని కలలు కన్నారు. అందుకోసం హైదరాబాద్ వచ్చ కాపురం పెట్టారు. ఇంతలో ఏమైందో ఏమో ఉన్నట్టుండి భార్య ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
Couples suicide in Lalaguda | త్రినేత్ర.న్యూస్: వారిద్దరిదీ కర్ణాటక రాష్ట్రం. ఏడాదిన్నర క్రితమే కలిసి ఏడడుగులు వేశారు. నూరేళ్ల దాంపత్య జీవనం సాఫీగా సాగిపోవాలని కలలు కన్నారు. అందుకోసం హైదరాబాద్ వచ్చ కాపురం పెట్టారు. ఇంతలో ఏమైందో ఏమో ఉన్నట్టుండి భార్య ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నిద్రలేచిన భర్త తన భార్య వేలాడుతుండటాన్ని చూసి భయపడిపోయాడు. ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే..
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని రాయ్‌చూర్‌కు చెందిన శరణప్ప (30), లక్ష్మి (25) దంపతులు నగరంలోని లాలాగూడ పరిధి విజయపురి కాలనీలో ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి సమయంలో లక్ష్మి ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం నిద్రలేచిన శరణప్ప తన భార్య ఆత్మహత్య దృశ్యాన్ని చూసి భయపడిపోయాడు. ఏంచేయాలో తోచక ఇంటి నుంచి బయటకు పరుగులు పెట్టాడు. అనంతరం లాలాగూడ రైల్వే బ్రిడ్జి వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని.. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలపై ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు.
కాగా గంటల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలతో లాలాగూడలో తీవ్ర విషాద ఛాయలు చోటుచేసుకున్నాయి. కలకాలం చిలకాగోరింకల్లా కలిసి ఉండాల్సిన నవ జంట అర్ధాంతరంగా విగతజీవులుగా మారడంతో స్థానికులు, వారి ఆత్మీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. క్షణికావేశాన్ని పక్కన పెట్టి ఒక్క క్షణం ఆలోచిస్తే ప్రాణాలు దక్కేవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Tummala Nageshwar Rao | కూరగాయల సాగుకు రూ. 125 కోట్లకు పైగా రాయితీలు
సెప్టెంబర్ 10, 2026

Talasani Srinivas Yadav | దళితులపై అంత ప్రేమ ఉంటే.. స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను సీఎం చేయ్
సెప్టెంబర్ 10, 2026

Harish Rao | అసెంబ్లీ నుంచి మమ్మల్ని ఎత్తేయడం కాదు.. మోటార్లు ఆన్ చేసి కృష్ణా నీళ్లు ఎత్తు
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●Talasani Srinivas Yadav | దళితులపై అంత ప్రేమ ఉంటే.. స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను సీఎం చేయ్
- ●Pooja Hegde | తొలి సినిమా హీరోతో బుట్టబొమ్మ బాక్సాఫీస్ ఫైట్ - పూజా హెగ్డే శ్రీశ్రీ రిలీజ్ డేట్ ఇదేనా?
- ●Harish Rao | అసెంబ్లీ నుంచి మమ్మల్ని ఎత్తేయడం కాదు.. మోటార్లు ఆన్ చేసి కృష్ణా నీళ్లు ఎత్తు
- ●Vemula Prashanth Reddy | సాగు నీళ్లు లేక.. తల్లడిల్లుతున్న నిజామాబాద్ రైతులు
- ●Talasani Srinivas Yadav | అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసులా..?
- ●Adilabad Khichdi Sellers Sons | ఉదయం కిచిడీ బండి.. రాత్రిళ్లు పుస్తకాలతో కుస్తీ : నీట్ క్రాక్ చేసి ఎంబీబీఎస్ సీట్లు సాధించిన యువకులు

Talasani Srinivas Yadav | దళితులపై అంత ప్రేమ ఉంటే.. స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను సీఎం చేయ్

Pooja Hegde | తొలి సినిమా హీరోతో బుట్టబొమ్మ బాక్సాఫీస్ ఫైట్ - పూజా హెగ్డే శ్రీశ్రీ రిలీజ్ డేట్ ఇదేనా?

Harish Rao | అసెంబ్లీ నుంచి మమ్మల్ని ఎత్తేయడం కాదు.. మోటార్లు ఆన్ చేసి కృష్ణా నీళ్లు ఎత్తు

Vemula Prashanth Reddy | సాగు నీళ్లు లేక.. తల్లడిల్లుతున్న నిజామాబాద్ రైతులు



