Vakiti Srihari | రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోంది: మంత్రి వాకిటి శ్రీహరి
Vakiti Srihari | రాష్ట్రంలో అన్ని క్రీడలను (Sports) ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. యువత పెడదోవ పట్టకుండా క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
Vakiti Srihari | రాష్ట్రంలో అన్ని క్రీడలను (Sports) ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. యువత పెడదోవ పట్టకుండా క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. పుణె (Pune) వేదికగా జరగబోతున్న గ్లోబల్ సైక్లింగ్ ఈవెంట్ ట్రోఫీ టూర్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ టూర్ కు సంబంధించిన ట్రోఫీ , జెర్సీలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇలాంటి గ్లోబల్ ఈవెంట్ ఇండియాలో జరగడం గర్వకారణమన్నారు. బజాజ్ పుణే గ్రాండ్ టూర్ భారత్ లో తొలి UCI క్లాస్ 2.2 అంతర్జాతీయ స్టేజ్ సైక్లింగ్ రేస్ రూపకల్పన చేసిన నిర్వాహకులను అభినందించారు. పూణే నుండి ప్రారంభం అయిన ఈ పోటీలో UCIలో నమోదు అయిన జాతీయ, అంతర్జాతీయ జట్లు పాల్గొంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా భారత్ ప్రొఫెషనల్ గ్లోబల్ రోడ్ సైక్లింగ్ వ్యవస్థలో అధికారికంగా అడుగుపెట్టడం సంతోషదాయకన్నారు. మున్ముందు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఈ పోటీలను నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ప్రభుత్వాలు ఏవైనా క్రీడలను ప్రోత్సహిస్తున్నందుకు అభినందనలు తెలపాల్సిందేనన్నారు. భవిష్యత్తులో భారత్.. ప్రపంచ స్థాయి UCI ఆమోదిత స్టేజ్ రేస్‌లను నిర్వహించగల సామర్థ్యాన్ని సాధించేందుకు ఇది తోడ్పాటును అందిస్తుందని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో క్రీడలకు , క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో ఎలాంటి క్రీడా ఈవెంట్ నిర్వహించినా ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి, రేస్ టెక్నికల్ డైరెక్టర్ పినాకి బైసాక్, అథ్లెట్స్ కమిషన్ ఆఫ్ సీఎఫ్ఐ మ్యాక్స్‌వెల్ ట్రెవర్ పాల్గొన్నారు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






