త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

B. Narsing Rao | తెలంగాణ ద‌ర్శ‌కుడు బీ న‌ర్సింగ‌రావుకు గౌర‌వ డాక్ట‌రేట్‌

తెలంగాణ సంస్కృతి, యాస‌, భాష‌ల‌తో ద‌ర్శ‌కుడు బీ న‌ర్సింగ‌రావు తెర‌కెక్కించిన మా భూమి, రంగుల క‌ల‌, దాసి సినిమాలు అనేక అవార్డుల‌ను అందుకున్నాయి. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ సార్వ‌త్రిక విశ్వ‌విద్యాల‌యం గౌర‌వ డాక్ట‌రేట్‌తో స‌త్క‌రించ‌బోతుంది. బి న‌ర్సింగ‌రావుకు డాక్ట‌రేట్‌ను అక్టోబ‌ర్ 7న తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ శివ‌ప్ర‌తాప్ శుక్లా ప్ర‌దానం చేయ‌బోతున్నారు.

N

Entertainment | Published On Oct 2, 2026, 7.07 pm IST

B. Narsing Rao | తెలంగాణ ద‌ర్శ‌కుడు బీ న‌ర్సింగ‌రావుకు గౌర‌వ డాక్ట‌రేట్‌
Advertisement

B. Narsing Rao |  మా భూమి, రంగుల క‌ల, దాసి సినిమాల‌తో తెలంగాణ సినిమాకు ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకొచ్చారు ద‌ర్శ‌కుడు బి న‌ర్సింగ‌రావు. తెలంగాణ సంస్కృతి, యాస, భాష‌ల‌తో ఆయ‌న తెర‌కెక్కించిన ఈ సినిమాలు అనేక జాతీయ‌, అంత‌ర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో ప్ర‌ద‌ర్శిత‌మ‌య్యాయి. అవార్డుల‌ను అందుకున్నాయి. ఈ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడిని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ సార్వ‌త్రిక విశ్వ‌విద్యాల‌యం గౌర‌వ డాక్ట‌రేట్‌తో స‌త్క‌రించ‌బోతుంది. బి న‌ర్సింగ‌రావుకు డాక్ట‌రేట్‌ను అక్టోబ‌ర్ 7న తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ శివ‌ప్ర‌తాప్ శుక్లా ప్ర‌దానం చేయ‌బోతున్నారు.

సేవ‌కు గుర్తింపుగా...

డైరెక్ట‌ర్‌గానే కాకుండా ర‌చ‌యిత‌గా, సినిమాటోగ్రాఫ‌ర్‌గా, రంగ‌స్థ‌ల క‌ళాకారుడిగా న‌ర్సింగ‌రావు చేసిన సేవ‌కు గుర్తింపుగా ఈ డాక్ట‌రేట్‌ను అందించ‌బోతున్న‌ట్లు యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స్‌ల‌ర్ ఘంటా చ‌క్ర‌పాణి తెలిపారు.
న‌ర్సింగ‌రావు ద‌ర్శ‌క‌త్వం దాసి, రంగుల క‌ల‌, మ‌ట్టి మ‌నుషులు సినిమాలు నేష‌న‌ల్ అవార్డుల‌ను ద‌క్కించుకున్నాయి. తెలంగాణ స‌మాజంలోని అణ‌గారిన వ‌ర్గాల పోరాటాన్ని, వ్య‌థ‌లు, క‌న్నీళ్ల‌ను ఆవిష్క‌రిస్తూ ఈ సినిమాల‌ను తెర‌కెక్కించిన తీరుకు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. 2003లో వ‌చ్చిన హ‌రివిల్లు త‌ర్వాత సినిమా రంగానికి దూర‌మ‌య్యారు న‌ర్సింగ‌రావు.

 

Advertisement
Advertisement