త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aadhar PVC Cards | ఆధార్ పీవీసీ కార్డుల‌ను ఆర్డ‌ర్ చేస్తున్నారా..?  చార్జిలు పెరిగాయి, గుర్తించండి..!

Aadhar PVC Cards | యూనిక్ ఐడెంటిఫికేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) దేశంలోని పౌరుల‌కు ఆధార్ ప‌రంగా అనేక సేవ‌ల‌ను అందిస్తున్న విష‌యం విదిత‌మే. ఆధార్ వెబ్‌సైట్‌తోపాటు యాప్‌లోనూ ఈ సేవ‌ల‌ను అందుబాటులో ఉంచారు.

S

Business | Published On Jan 7, 2026, 7.02 am IST

Aadhar PVC Cards | ఆధార్ పీవీసీ కార్డుల‌ను ఆర్డ‌ర్ చేస్తున్నారా..?  చార్జిలు పెరిగాయి, గుర్తించండి..!
Advertisement

Aadhar PVC Cards | యూనిక్ ఐడెంటిఫికేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) దేశంలోని పౌరుల‌కు ఆధార్ ప‌రంగా అనేక సేవ‌ల‌ను అందిస్తున్న విష‌యం విదిత‌మే. ఆధార్ వెబ్‌సైట్‌తోపాటు యాప్‌లోనూ ఈ సేవ‌ల‌ను అందుబాటులో ఉంచారు. వీటి ద్వారా పౌరులు ఆధార్‌కు సంబంధించిన ప‌లు ముఖ్య‌మైన సేవ‌ల‌ను పొంద‌వచ్చు. ఆధార్ చిరునామాలో మార్పుల‌ను, ఇత‌ర వివ‌రాల‌ను మార్చుకునేందుకు ఆయా మాధ్య‌మాలు ప‌నిచేస్తాయి. అయితే వాటి ద్వారా పీవీసీ రూపంలో ఉండే ఆధార్ కార్డును కూడా ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు. దీన్ని ప్ర‌స్తుతం చాలా మంది ఉప‌యోగించుకుంటున్నారు. అయితే ఆధార్ సైట్ లేదా యాప్ ద్వారా పీవీసీ కార్డుల‌ను ఆర్డ‌ర్ చేస్తే ఇక‌పై పెరిగిన చార్జిల‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేర‌కు UIDAI ఇది వ‌ర‌కే ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది.

పెంచిన చార్జిలు ఇప్ప‌టికే అమ‌లు..

చాలా మంది ఆధార్‌ను పీవీసీ కార్డు రూపంలో ప్ర‌స్తుతం పొందుతున్నారు. ఈ కార్డు చాలా దృఢంగా, నాణ్యంగా ఉంటుంది. అంత సుల‌భంగా డ్యామేజ్ అవ‌దు. కనుక ఆధార్ పీవీసీ కార్డుల‌ను చాలా మంది తీసుకుంటున్నారు. అయితే ఈ కార్డుల‌ను పొందేందుకు రూ.50 చార్జిల‌ను వ‌సూలు చేసే వారు. కానీ ఇప్పుడా చార్జిల‌ను పెంచారు. రూ.50కి బ‌దులుగా ప్ర‌స్తుతం రూ.75 చార్జిల‌ను వ‌సూలు చేస్తున్న‌ట్లు తెలిపారు. అందువ‌ల్ల ఈ సేవ‌కు గాను రూ.25 పెంచిన‌ట్లు అర్థం చేసుకోవ‌చ్చు. ఇక పెంచిన చార్జిల‌ను ఇప్ప‌టికే అమ‌లు చేస్తున్నారు. జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచే ఆధార్ పీవీసీ కార్డుల చార్జిల‌ను పెంచి వ‌సూలు చేస్తున్నారు.

చార్జిల‌ను అందుక‌నే పెంచారు..

కాగా 2020లో తొలిసారిగా ఆధార్ పీవీసీ కార్డు సేవ‌ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌గా ఎంతో మందికి ఈ సేవ ద్వారా పీవీసీ రూపంలో ఆధార్ కార్డులు ల‌భిస్తున్నాయి. లేదంటే పాత త‌రం పేప‌ర్ ఆధార్ కార్డులు త్వ‌ర‌గా డ్యామేజ్ అయ్యేవి. మ‌ళ్లీ కార్డును త్వ‌రగా తీసుకోవాల్సి వ‌చ్చేది. దాంతో చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఆధార్ పీవీసీ కార్డుల రాక‌తో ప్ర‌జ‌ల‌కు ఎంతో సౌక‌ర్యం ల‌భించింది. ఈ కార్డులు ఎంతో మ‌న్నిక‌గా ఉంటాయి. ఎక్కువ కాలం పాటు వినియోగించినా డ్యామేజ్ కావు. పైగా క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డుల సైజులోనే ఉంటాయి. క‌నుక సుల‌భంగా వీటిని ఎక్క‌డికంటే అక్క‌డికి తీసుకెళ్ల‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఆధార్ పీవీసీ కార్డుల‌కు ఆద‌ర‌ణ పెరుగుతోంది. అయితే కార్డు త‌యారీకి అవ‌స‌రం అయ్యే ముడి ప‌దార్థాల ధ‌ర‌లు పెర‌గ‌డం, ప్రింటింగ్‌, డెలివ‌రీ చార్జిలు పెర‌గ‌డం వ‌ల్లే ఈ చార్జిల‌ను పెంచాల్సి వ‌చ్చింద‌ని UIDAI తెలియ‌జేసింది. ఇక పీవీసీ ఆధార్ కార్డును ఆర్డ‌ర్ చేస్తే ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం దాన్ని 5 నుంచి 15 రోజుల్లోగా డెలివ‌రీ తీసుకుంటున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement