త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mana Shankara Vara Prasad Garu | మన శంకరవరప్రసాద్‌ గారు.. రూ.1.11 లక్ష‌లు ప‌లికిన‌ ప్రీమియ‌ర్ షో టికెట్ ధ‌ర‌

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) న‌టించిన మోస్ట్ అవైటెడ్ మూవీ మన శంకరవరప్రసాద్‌ గారు (Mana Shankara Vara Prasad Garu) జ‌న‌వ‌రి 12న సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఫ్యామిలీ యాక్ష‌న్ డ్రామాగా రూపొందింన ఈ చిత్రంలో మ‌రో సీనియ‌ర్ హీరో వెంక‌టేశ్ కీల‌క పాత్ర‌లో న‌టించారు.

G

Entertainment | Published On Jan 7, 2026, 6.57 am IST

Mana Shankara Vara Prasad Garu | మన శంకరవరప్రసాద్‌ గారు.. రూ.1.11 లక్ష‌లు ప‌లికిన‌ ప్రీమియ‌ర్ షో టికెట్ ధ‌ర‌
Advertisement

Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) న‌టించిన మోస్ట్ అవైటెడ్ మూవీ మన శంకరవరప్రసాద్‌ గారు (Mana Shankara Vara Prasad Garu) జ‌న‌వ‌రి 12న సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఫ్యామిలీ యాక్ష‌న్ డ్రామాగా రూపొందింన ఈ చిత్రంలో మ‌రో సీనియ‌ర్ హీరో వెంక‌టేశ్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. అస‌లే మెగాస్టార్ మూవీ.. అందులో వెంకీ మామ కీరోల్‌లో న‌టిస్తుండ‌టంతో అభిమానుల్లో ఎక్క‌డ‌లేని సంతోషం నెల‌కొన్న‌ది. బొమ్మ ఎప్పుఎప్పుడు టాకీసుల్లోకి వ‌స్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రీమియ‌ర్ షోకి సంబంధించిన టికెట్ ధ‌ర ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వేలంగా ఓ అభిమాని టికెట్ కోసం రూ.1.11 ల‌క్ష‌లు వెచ్చించ‌డ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కోన‌సీమ‌ జిల్లా అమలాపురంలోని (Amalapuram) శ్రీవెంకటరమణ థియేటర్‌ వద్ద చిరంజీవి యువత ఆధ్వర్యంలో ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ చిత్రం ప్రీమియర్‌ షో మొదటి టికెట్ల‌కు వేలం నిర్వహించారు. ఇందులో మోకా సుబ్బారావు అనే అభిమాని అత్య‌ధిక ధ‌ర‌కు పాడుకున్నారు. టికెట్‌ను రూ.1.11 లక్షలకు దక్కించుకున్నారు. ఈ నగదును చిరంజీవి చారిటబుల్‌ ట్రస్టుకు అందజేస్తామని అభిమాన సంఘం నాయకులు వెల్ల‌డించారు.

కాగా, సంక్రాంతి బ‌రిలో ప్ర‌భాస్ రాజాసాబ్‌తో (Raja Saab) పాటు చిరంజీవి మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు సినిమాలు ఉన్న విష‌యం తెల‌సిందే. ఇప్ప‌టికే ఈ సినిమాల‌ టికెట్ల‌ ధ‌ర‌లు పెర‌గ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజాసాబ్ మూవీ రూ.400 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందింది. చిరంజీవి మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్‌గారు కోసం రూ.200 కోట్ల వ‌ర‌కు మేక‌ర్స్ వెచ్చించిన‌ట్లు స‌మాచారం. బ‌డ్జెట్ దృష్ట్యా టికెట్ ధ‌ర‌ల పెంపుతో పాటు బెనిఫిట్ షో అనుమ‌తుల కోసం మేక‌ర్స్ తెలంగాణ‌, ఏపీ ప్ర‌భుత్వాల‌ను సంప్ర‌దించిన‌ట్లు తెలిసింది. ఏపీలో టికెట్ ధ‌రల‌తో పాటు బెనిఫిట్ షోల‌కు అనుమ‌తులు రావ‌డం దాదాపు ఖాయ‌మైంది. తెలంగాణ‌లో మాత్రం ఇంకా టికెట్ ధ‌ర‌ల పెంపుపై క్లారిటీ రాలేదు. ధ‌ర‌ల పెంపు తో పాటు బెనిఫిట్ షోల‌కోసం ప్ర‌భుత్వాన్ని రాజాసాబ్‌తో పాటు మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు మేక‌ర్స్ సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం.

వెయ్యి రూపాయ‌లు..

రాజాసాబ్ మూవీ ప్రీమియ‌ర్ షోస్‌కు సింగిల్ స్క్రీన్స్‌లో 900, మ‌ల్టీప్లెక్స్‌ల‌లో వెయ్యి రూపాయ‌ల వ‌ర‌కు ధ‌ర‌లు ఉండేలా త‌మ ధ‌ర‌ఖాస్తులో పేర్కొన్న‌ట్లు స‌మాచారం. జీఎస్టీతో క‌లిపి సింగిల్ స్క్రీన్స్‌లో 944, మ‌ల్టీప్లెక్స్‌ల‌లో 1180 వ‌ర‌కు టికెట్ ధ‌ర‌లు ఉంటాయి. జ‌న‌వ‌రి 8 రోజు ప్రీమియ‌ర్‌తో పాటు జ‌న‌వ‌రి 9న ఉద‌యం 6 గంట‌ల స్పెష‌ల్‌కు ప్ర‌ద‌ర్శించేందుకు అనుమ‌తులు ఇవ్వాల‌ని రాజాసాబ్ మేక‌ర్స్ కోరారు.
టికెట్ ధ‌ర‌ల‌ను జ‌న‌వ‌రి 9 నుంచి జ‌న‌వ‌రి 18 వ‌ర‌కు సింగిల్ స్క్రీన్స్‌లో 105, మ‌ల్టీప్లెక్స్‌లో 132 రూపాయ‌లు పెంచాల‌ని అడిగిన‌ట్లు స‌మాచారం.

ఆరు వంద‌లు..

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ మేక‌ర్స్ జ‌న‌వ‌రి 11న ప్రీమియ‌ర్ షోకు 600 టికెట్ ధ‌ర‌లు ఉండేలా చూడ‌మ‌ని రిక్వెస్ట్ చేసిన‌ట్లు తెలిసింది. జ‌న‌వ‌రి 11 నుంచి 18 వ‌ర‌కు సింగిల్ స్క్రీన్స్‌లో యాభై, మ‌ల్టీప్లెక్స్‌లో వంద రూపాయ‌ల ధ‌ర‌లు పెంచుకునేలా అనుమ‌తులు ఇవ్వాల‌ని కోరిన‌ట్లు తెలిసింది. ఈ టికెట్ ధ‌ర‌లు, బెనిఫిట్ షోల‌కు సంబంధించిన అనుమ‌తులు మ‌రో ఒక‌టి రెండు రోజుల్లో రానున్న‌ట్లు స‌మాచారం.

 

Advertisement

తాజావార్తలు

Advertisement