త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | మేడిగ‌డ్డ విష‌యంలో కేసు నమోదు చేయకపోవడం కూడా నేరమే: ఆర్ఎస్ ప్ర‌వీణ్‌

RS Praveen Kumar | బాంబు పేలుడు వ‌ల్ల‌నే మేడిగ‌డ్డ పిల్ల‌ర్ కుంగింద‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ఆరోపించారు.

S

Telangana | Published On Oct 16, 2026, 12.57 pm IST

RS Praveen Kumar | మేడిగ‌డ్డ విష‌యంలో కేసు నమోదు చేయకపోవడం కూడా నేరమే: ఆర్ఎస్ ప్ర‌వీణ్‌
Advertisement

RS Praveen Kumar | త్రినేత్ర న్యూస్: బాంబు పేలుడు వ‌ల్ల‌నే మేడిగ‌డ్డ పిల్ల‌ర్ కుంగింద‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ఆరోపించారు. 99% బాంబు పేలుడే (controlled explosion) కార‌ణ‌మ‌ని తాను సంవత్సరం క్రితమే చాలా మంది ఇంజినీర్లతో మాట్లాడిన తరువాతనే చెప్పానన్నారు. దాని తర్వాత ఇసుక దందా కోసం కొన్ని చెక్ డ్యామ్ లను కాంగ్రెస్ నాయకులు పేల్చి వేశారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై పూర్తిగా దర్యాప్తు చేయకపోవడం కూడా నేరమేన‌ని మండిపడ్డారు. ఈమేర‌కు ఈఎన్‌సీ ముర‌ళీధ‌ర్‌రావు మాట్లాడిన, కుంగిన ప్రాంతంతో ఉన్న వీడియోను శుక్ర‌వారం ఆయ‌న త‌న‌ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

అక్టోబ‌ర్ 1న పెద్ద శ‌బ్దం వ‌చ్చింది. బాంబు పేలి ఉండొచ్చ‌నే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఫ‌స్ట్ టైమ్ బాంబ్ మోత స‌ప్పుడు విన్నాం. దానిపై విచార‌ణ చేయాలని కోరాం. అక్టోబ‌ర్ 1న 7వ నంబ‌ర్ బ్లాక్‌లో శ‌బ్దం వ‌చ్చింది. దీనిపై పోలీసులు ప్రాథ‌మిక విచార‌ణ కూడా చేశారు. 20వ నంబ‌ర్ పీఆర్‌లో కూడా స‌మ‌స్య వ‌చ్చింది అని ఈఎన్‌సీ ముర‌ళీధ‌ర్‌రావు ఆ వీడియోలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement