All Party Meeting | నేడు జరగాల్సిన అఖిలపక్ష సమావేశం వాయిదా
All Party Meeting | ఎల్ నినో (El Nino) ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్ని పరిస్థితులపై నిర్వహించాల్సిన అఖిలపక్ష సమావేశం (All Party Meeting) వాయిదా పడింది. ఉదయం 11.30 గంటలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధ్యక్షతన సచివాలయంలో భేటీ జరగాల్సి ఉంది.
All Party Meeting | త్రినేత్ర న్యూస్: ఎల్ నినో (El Nino) ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్ని పరిస్థితులపై నిర్వహించాల్సిన అఖిలపక్ష సమావేశం (All Party Meeting) వాయిదా పడింది. ఉదయం 11.30 గంటలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధ్యక్షతన సచివాలయంలో భేటీ జరగాల్సి ఉంది. అయితే సమావేశాన్ని వాయిదా (Postponed) వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
సమావేశంలో ఎల్ నినో ప్రభావం వల్ల తలెత్తే పరిస్థితులు, వ్యవసాయం, తాగునీరు, సాగునీటి నిర్వహిణపై ప్రధానంగా చర్చించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, కార్యాచరణపై అఖిలపక్షంలో నాయకుల సలహాలు, సూచనలను తీసుకోవాలని భావించింది. దీనికోసం ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, బీజేపీతోపాటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పటికే ఆహ్వానం పలికింది. అయితే సమావేశాన్ని అర్ధంతరంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. దసరా పండుగ (Dasara Festival) తర్వాత సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది.
తాజావార్తలు
- ●Basara Temple | బాసరలో మూల నక్షత్ర వేడుకలు.. భారీగా తరలివచ్చిన భక్తులు
- ●Abhijeet Dipke | నాపై ఐబీ నిఘా.. నన్ను ఏదైనా చేయొచ్చు: అభిజీత్ దీప్కే
- ●Oregon School Shooting | స్కూల్లో టీనేజర్ కాల్పులు.. ముగ్గురు చిన్నారులు సహా నలుగురు మృతి
- ●UCO Bank | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు
- ●Horoscope | అక్టోబర్ 16 రాశిఫలాలు.. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది!
- ●ప్రజలారా..పెద్ద మనసు చేసుకోండి.. సీఎం రేవంత్ రెడ్డి

Basara Temple | బాసరలో మూల నక్షత్ర వేడుకలు.. భారీగా తరలివచ్చిన భక్తులు

Abhijeet Dipke | నాపై ఐబీ నిఘా.. నన్ను ఏదైనా చేయొచ్చు: అభిజీత్ దీప్కే

Oregon School Shooting | స్కూల్లో టీనేజర్ కాల్పులు.. ముగ్గురు చిన్నారులు సహా నలుగురు మృతి

UCO Bank | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు





