Rajya Sabha Elections 2026 | జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే!
దేశవ్యాప్తంగా 26 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా, బీజేపీ తమ అభ్యర్థుల అధికారిక జాబితాను ప్రకటించింది.
- 12 రాష్ట్రాల పరిధిలోని 26 రాజ్యసభ స్థానాలకు జూన్ 18, 2026న ఎన్నికలు
- తాజా ఎన్నికల కోసం బీజేపీ అధిష్ఠానం తమ అభ్యర్థుల తొలి జాబితాను అధికారికంగా విడుదల చేసింది.
- గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల పేర్లను బీజేపీ ఈ జాబితాలో ఖరారు
Rajya Sabha Elections 2026 | త్రినేత్ర.న్యూస్ : దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం (EC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పన్నెండు రాష్ట్రాల నుంచి మొత్తం 26 రాజ్యసభ స్థానాలకు జూన్ 18, 2026న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. శుక్రవారం విడుదల చేసిన ఈ షెడ్యూల్ ప్రకారం.. ఏపీ సహా పది రాష్ట్రాల్లో 24 స్థానాలకు ద్వైవార్షిక (Biennial) ఎన్నికలు, అలాగే మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు (By-elections) జరగనున్నాయి.
జూన్ నెలాఖరుకు ఖాళీ అవుతున్న 24 స్థానాల్లో పార్టీల వారీగా బలాబలాలు చూస్తే.. బీజేపీ-12, కాంగ్రెస్-4, వైసీపీ-3, ఎన్‌పీపీ, జేడీఎస్, ఎంఎన్‌ఎఫ్, ఎన్‌సీపీ, ఏఐఏడీఎంకే, జేఎంఎం, టీడీపీల నుంచి ఒక్కొక్క ఎంపీ ఉన్నారు.
ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయి?
అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం వల్ల ఇద్దరు ఎంపీలు తమ స్థానాలకు రాజీనామా చేయాల్సి వచ్చింది. మహారాష్ట్రలో అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్, తమిళనాడులో ఏఐఏడీఎంకే నేత సీవే షణ్ముగం ఇటీవల ఎమ్మెల్యేలుగా ఎన్నికై రాజ్యసభకు రాజీనామా చేశారు. దీంతో ఆ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
రాజ్యసభ బరిలో బీజేపీ అభ్యర్థులు వీరే
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే భారతీయ జనతా పార్టీ (BJP) తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ జాబితా విడుదల చేశారు.
పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) ఆమోదించిన అధికారిక జాబితా వివరాలు:
ద్వైవార్షిక ఎన్నికల అభ్యర్థులు (Biennial Elections 2026):
అరుణాచల్ ప్రదేశ్: తాయ్ తగాక్ (Tai Tagak)
గుజరాత్:
రాజుభాయ్ శుక్లా
ముకేశ్ భాయ్ రథ్వా
మాన్‌సింగ్ పర్మార్
జితేంద్ర మేఘ్ జీభాయ్ కంజారియా
మధ్యప్రదేశ్:
తరుణ్ చుగ్
రజనీష్ అగర్వాల్
మణిపూర్: ఏ. శారదా దేవి
రాజస్థాన్:
డా. అల్కా గుర్జార్
డా. సతీష్ పూనియా
ఉప ఎన్నిక అభ్యర్థి (By-election 2026):
ఒడిశా: దేబాశిష్ సామంతరాయ్
అభ్యర్థుల ప్రకటనతో రాజ్యసభ ఎన్నికల వేడి మరింత రాజుకుంది. జూన్ 18న జరిగే పోలింగ్, ఓట్ల లెక్కింపులో ఆయా పార్టీల బలాబలాలు స్పష్టంగా తేలనున్నాయి.
తాజావార్తలు
- ●Telugu OTT | గత వారం థియేటర్లలో....ఈ వారం ఓటీటీలో - అవికా గోర్ తెలుగు రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్ఫామ్ ఇవే!
- ●Ponguleti Srinivas Reddy | అక్రమాలకు తావివ్వకూడదనే.. సబ్ రిజిస్ట్రార్ల అధికారాల్లో కోత: మంత్రి పొంగులేటి
- ●Sathyaraj Daughter | కట్టప్ప కూతురి సీక్రెట్ మ్యారేజ్ - మార్ఫింగ్ ఫొటోలపై బాహుబలి యాక్టర్ ఫైర్
- ●Revanth Reddy | ఉమ్మడి పాలమూరులో సీఎం రేవంత్ పర్యటన.. కాట్రేవులపల్లి ఎత్తిపోతల పనుల పరిశీలన
- ●Delhi Hotel Fire | ఢిల్లీ అగ్నిప్రమాదం: ప్రాణాలు కాపాడేందుకు పరుపులనే 'సేఫ్టీ నెట్'గా మార్చి.. 2 లక్షలు నష్టపోయిన వ్యాపారి
- ●Dasoju Sravan | పాఠ్యపుస్తకాల్లో ఉద్యమకారుల చరిత్ర ఉండాలి: ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రావణ్

Telugu OTT | గత వారం థియేటర్లలో....ఈ వారం ఓటీటీలో - అవికా గోర్ తెలుగు రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్ఫామ్ ఇవే!

Ponguleti Srinivas Reddy | అక్రమాలకు తావివ్వకూడదనే.. సబ్ రిజిస్ట్రార్ల అధికారాల్లో కోత: మంత్రి పొంగులేటి

Sathyaraj Daughter | కట్టప్ప కూతురి సీక్రెట్ మ్యారేజ్ - మార్ఫింగ్ ఫొటోలపై బాహుబలి యాక్టర్ ఫైర్

Revanth Reddy | ఉమ్మడి పాలమూరులో సీఎం రేవంత్ పర్యటన.. కాట్రేవులపల్లి ఎత్తిపోతల పనుల పరిశీలన



