Hairsh Rao | మోసమే కాంగ్రెస్ పార్టీ నైజం: హరీశ్ రావు
Hairsh Rao | మోసమే కాంగ్రెస్ పార్టీ నైజమని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Hairsh Rao) విమర్శించారు. ఆశాలు, అంగన్‌వాడీలు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మోసం చేసిందని ధ్వజమెత్తారు.
Hairsh Rao | త్రినేత్ర.న్యూస్: మోసమే కాంగ్రెస్ పార్టీ నైజమని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Hairsh Rao) విమర్శించారు. ఆశాలు, అంగన్‌వాడీలు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మోసం చేసిందని ధ్వజమెత్తారు. ప్రజా పాలన అని ఊదర గొట్టడం తప్ప చేస్తున్నదేం లేదని మండిపడ్డారు. ఖైరతాబాద్‌లోని జలమండలి గేట్ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజలను వంచించిన పాలన అని విమర్శించారు. పీఆర్సీ, పెండింగ్ డీఏలు ఇస్తం అన్నరు. రెండున్నరేండ్లు అయినా దిక్కులేదు. వస్తదా రాదా చెప్పని పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. భారత దేశంలో ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే, ఈ కాంగ్రెస్ సర్కారేనని విమర్శించారు.
`జూన్ 2నాడు పీఆర్సీ కోసం ఉద్యోగులు ఆశగా ఎదురు చూశారు. కానీ రేవంత్ రెడ్డి నిరాశ మిగిల్చిండు. ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ మాత్రమే. ఆశాలు, అంగన్ వాడీలు, ఆర్టీసీ కార్మికులకు, జిహెచ్ఎంసీ కార్మికులు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మోసమే కాంగ్రెస్ నైజం, అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది. ఆ పార్టీకి బుద్ది చెప్పాలంటే రాంబాబును గెలిపించాలి. ప్రశ్నించే గొంతు రాంబాబు. రాంబాబు ఉన్నడంటే బిఆర్ఎస్ పార్టీ మొత్తం మీ వెనుక ఉన్నట్లే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జలమండలిలో ఎలాంటి లంచాలు లేకుండా 650 మందిని రెగ్యులరైజ్ చేశాం, వందల మందికి ప్రమోషన్లు ఇచ్చాం పదోన్నతులు (Promotions) కల్పించాం. సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ప్రశ్నించే గొంతుక అవసరం. రాంబాబును గెలిపిస్తే, మీ సమస్యలకు మేం అండగా ఉంటాం.
పటాన్ చెరులో సిగాచి పరిశ్రమలో 60,70 మంది చనిపోతే రేవంత్, మంత్రి వివేక్ వెళ్లి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇస్తం అన్నరు. ఏడాది గడిచింది రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి వచ్చి కోటి ఇస్తానని మాట తప్పాడు. రుణమాఫీ చేస్తమని మాట తప్పిండు. 45 రోజుల్లో రైతు బంధు అకౌంట్లలో వేస్తం అన్నడు.
రేవంతు రెడ్డికి శాపం ఉన్నట్లు ఉంది, చెప్పింది చేయడు. మొన్న మంత్రులందరు వచ్చి సినిమా షో చేసి వెళ్లారు.
కార్మికులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తం. జలమండలి ఏరియా పెరిగింది కానీ, ఉద్యోగుల భర్తీ లేదు. కనీసం ఔట్ సోర్సింగ్ లో కూడా తీసుకోవడం లేదు. పని భారంతో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నరు. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం మార్మోగుతున్నది. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మోసం చేసినోడు కార్మికులను కూడా మోసం చేస్తడు. కార్మికులు ఆలోచించి ఓటు వేయాలి, రాంబాబును గెలిపించాలని కోరుతున్నాం. ఎల్లుండి జరిగే ఎన్నికల్లో గెలిచేది మన యూనియనే. గెలిచే ధైర్యమే ఉంటే కిరికిరి పెట్టరు. బాణం గుర్తు మార్చే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు. గుర్తు ఏదైనా ఓటు వేయాల్సింది కార్మికుడే కదా. బాణమైనా, చక్రమైనా ఎగిరేది గులాబీ జెండానే.` అని హరీశ్ రావు అన్నారు.
Live: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) గేట్ మీటింగ్ లో మాట్లాడుతున్న మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు https://t.co/akdy8zpuC7
— Office of Harish Rao (@HarishRaoOffice) June 4, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sathyaraj Daughter | కట్టప్ప కూతురి సీక్రెట్ మ్యారేజ్ - మార్ఫింట్ ఫొటోలపై బాహుబలి యాక్టర్ ఫైర్
- ●Revanth Reddy | ఉమ్మడి పాలమూరులో సీఎం రేవంత్ పర్యటన.. కాట్రేవులపల్లి ఎత్తిపోతల పనుల పరిశీలన
- ●Delhi Hotel Fire | ఢిల్లీ అగ్నిప్రమాదం: ప్రాణాలు కాపాడేందుకు పరుపులనే 'సేఫ్టీ నెట్'గా మార్చి.. 2 లక్షలు నష్టపోయిన వ్యాపారి
- ●Dasoju Sravan | పాఠ్యపుస్తకాల్లో ఉద్యమకారుల చరిత్ర ఉండాలి: ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రావణ్
- ●Rain | జనగామలో దంచికొట్టిన వాన.. కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు
- ●Rajesh Exports Scam | హర్షద్ మెహతా కంటే పెద్ద స్కామ్: రూ.15 లక్షల కోట్ల బోగస్ లెక్కలతో దొరికిపోయిన 'రాజేష్ ఎక్స్‌పోర్ట్స్'

Sathyaraj Daughter | కట్టప్ప కూతురి సీక్రెట్ మ్యారేజ్ - మార్ఫింట్ ఫొటోలపై బాహుబలి యాక్టర్ ఫైర్

Revanth Reddy | ఉమ్మడి పాలమూరులో సీఎం రేవంత్ పర్యటన.. కాట్రేవులపల్లి ఎత్తిపోతల పనుల పరిశీలన

Delhi Hotel Fire | ఢిల్లీ అగ్నిప్రమాదం: ప్రాణాలు కాపాడేందుకు పరుపులనే 'సేఫ్టీ నెట్'గా మార్చి.. 2 లక్షలు నష్టపోయిన వ్యాపారి

Dasoju Sravan | పాఠ్యపుస్తకాల్లో ఉద్యమకారుల చరిత్ర ఉండాలి: ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రావణ్




