PM Modi | గిరిజనులపై గత పాలకులకు చిత్తశుద్ధి లేదు
PM Modi | గత ప్రభుత్వాలు గిరిజనుల సమస్యలను అర్థం చేసుకోలేదని, వారి సంక్షేమంపై శ్రద్ధ చూపలేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. బ్రిటిష్ పాలకులు వెదురును చెట్టుగా పరిగణిస్తూ దానిని నరికితే జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చారని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వాలు ఆ నిబంధనలను తొలగించలేదని అన్నారు.
- స్వాతంత్య్రం తర్వాత సైతం సమస్యలను పట్టించుకోలేదు
- వెదురుపై ఆంక్షలు తొలగించి హక్కులు కల్పించాం
- గిరిజన గౌరవ దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ
PM Modi | గత ప్రభుత్వాలు గిరిజనుల సమస్యలను అర్థం చేసుకోలేదని, వారి సంక్షేమంపై శ్రద్ధ చూపలేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. బ్రిటిష్ పాలకులు వెదురును చెట్టుగా పరిగణిస్తూ దానిని నరికితే జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చారని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వాలు ఆ నిబంధనలను తొలగించలేదని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ చట్టాన్ని రద్దు చేసి గిరిజనులకు వెదురుపై పూర్తి హక్కులు కల్పించిందని పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆదివారం నిర్వహించిన గిరిజన గౌరవ దినోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మోదీ.. దేశవ్యాప్తంగా గిరిజనులతో మాట్లాడారు. బిర్సాముండా జయంతి వార్షికోత్సవం సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుజరాత్‌లోని భరూచ్ జిల్లా నేత్రంగ్ మండలం హతకుండి గ్రామానికి చెందిన వజీర్‌తో మాట్లాడారు. గుజరాత్ ప్రభుత్వ న్యూ గుజరాత్ ప్యాటర్న్ పథకం ద్వారా వెదురుతో వస్తువుల తయారీలో శిక్షణ పొందినట్లు వజీర్ వివరించారు. పీఎం-జన్మన్ పథకం ద్వారా కూడా ప్రయోజనం పొందినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన మోదీ.. గత ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ప్రస్తావించారు. మహారాష్ట్రలోని యవత్మాల్‌కు చెందిన కృష్ణ నాగోరావు టేకా మాట్లాడుతూ.. పీఎం-జన్మన్ పథకం ద్వారా పక్కా ఇల్లు, మరుగుదొడ్డి వంటి సదుపాయాలు అందాయని చెప్పారు. గతంలో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారమని, ఇప్పుడు ఆ సమస్యలు తీరాయని తెలిపారు. లబ్ధిదారుల జీవితాల్లో వస్తున్న మార్పులు తనకు ఎంతో సంతృప్తినిస్తున్నాయని మోదీ అన్నారు.
గిరిజన గౌరవ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సుమారు రూ.3 వేల కోట్ల విలువైన 246 అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించి, మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. వీటిలో 38 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, పీఎం-జన్మన్ కింద నిర్మించిన 100 బహుళ ప్రయోజన కేంద్రాలు ఉన్నాయి. గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం 12 కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. పీఎం-జన్మన్, ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద మరో 42 ప్రాజెక్టులకు పునాది వేశారు.
తాజావార్తలు
- ●Viral Video | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తృటిలో తప్పిన ప్రాణాపాయం
- ●KCR | హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణరావుకు కేసీఆర్ నివాళి
- ●Sai Pallavi | ధనుష్ పొలిటికల్ ఎంట్రీ - కన్ఫామ్ చేసిన సాయిపల్లవి - కామెంట్లు వైరల్
- ●Pre Budget | ప్రీ-బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం.. ఈసారి ఇన్వెస్టర్లకు పన్ను ఊరట దక్కేనా?
- ●Road Accident | మూడు రోజుల్లో పెళ్లి.. కాబోయే వరుడిని మింగేసిన యాక్సిడెంట్.. ఈ ఘోరం ఎక్కడ జరిగిందంటే!
- ●Horror OTT | ఓటీటీలోకి ప్రశాంత్ నీల్ హారర్ మూవీ - మెడికల్ కాలేజీలో దయ్యం - అమ్మాయిలు అడుగుపెడితే అంతే!

Viral Video | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తృటిలో తప్పిన ప్రాణాపాయం

KCR | హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణరావుకు కేసీఆర్ నివాళి

Sai Pallavi | ధనుష్ పొలిటికల్ ఎంట్రీ - కన్ఫామ్ చేసిన సాయిపల్లవి - కామెంట్లు వైరల్

Pre Budget | ప్రీ-బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం.. ఈసారి ఇన్వెస్టర్లకు పన్ను ఊరట దక్కేనా?



