Ai Plus | పండుగ సీజన్‌కు ఏఐ ప్లస్ కొత్త గ్యాడ్జెట్లు.. రూ.9,999 నుంచి ధరలు..
Ai Plus | భారత్‌లో పండుగ సీజన్‌కు ముందు ఏఐ ప్లస్ స్మార్ట్‌ఫోన్ తన హార్డ్‌వేర్ ఉత్పత్తుల విభాగాన్ని విస్తరించింది. ఇందులో భాగంగా పల్స్ 2 సిరీస్‌లో కొత్త పల్స్ 2 ఎఫ్‌ఈ స్మార్ట్‌ఫోన్‌తోపాటు నోవాట్యాబ్, నోవా ల్యాప్‌ట్యాబ్ ట్యాబ్లెట్లను కంపెనీ విడుదల చేసింది.
Technology | Published On Sep 29, 2026, 12.58 pm IST
Ai Plus | భారత్‌లో పండుగ సీజన్‌కు ముందు ఏఐ ప్లస్ స్మార్ట్‌ఫోన్ తన హార్డ్‌వేర్ ఉత్పత్తుల విభాగాన్ని విస్తరించింది. ఇందులో భాగంగా పల్స్ 2 సిరీస్‌లో కొత్త పల్స్ 2 ఎఫ్‌ఈ స్మార్ట్‌ఫోన్‌తోపాటు నోవాట్యాబ్, నోవా ల్యాప్‌ట్యాబ్ ట్యాబ్లెట్లను కంపెనీ విడుదల చేసింది. కమ్యూనికేషన్, డిజిటల్ లెర్నింగ్, మొబైల్ ఉత్పాదకత అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎంట్రీ లెవల్ నుంచి మిడ్ రేంజ్ వినియోగదారుల కోసం వీటిని తీసుకొచ్చింది. ముఖ్యంగా 5జి ట్యాబ్లెట్ విభాగంలోకి ఏఐ ప్లస్ అధికారికంగా ప్రవేశించింది. మూడు పరికరాలు ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై కంపెనీకి చెందిన నెక్ట్స్‌క్యూ ఓఎస్ ఇంటర్‌ఫేస్‌తో పనిచేస్తాయి. అక్టోబర్ 7 రాత్రి 11:59 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
ఏఐ ప్లస్ పల్స్ 2 ఎఫ్ఈ..
ఏఐ ప్లస్ పల్స్ 2 ఎఫ్‌ఈ విషయానికి వస్తే.. ఇది కంపెనీ తాజా ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి81 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ అంతర్గత స్టోరేజ్ ఉన్నాయి. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. 6.67 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లేను 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో అందించారు. ఇందులో 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా కోసం పంచ్ హోల్ కటౌట్ ఉంది. వెనుక భాగంలో హెచ్‌డీఆర్ సపోర్ట్‌తో 50 మెగాపిక్సల్ ఏఐ ఆధారిత ప్రధాన కెమెరాను అందించారు. ఫోన్‌కు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, సైడ్ మౌంటెడ్ కెపాసిటివ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ మైక్రోఫోన్ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్లాక్, బ్లూ, గ్రీన్, పర్పుల్ రంగుల్లో ఇది లభిస్తుంది.

ఏఐ ప్లస్ నోవాట్యాబ్..
ఏఐ ప్లస్ నోవాట్యాబ్‌ను ప్రధానంగా విద్యార్థులు, రిమోట్ ఎడ్యుకేషన్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇందులో 5జి, వైఫై కనెక్టివిటీ ఉన్నాయి. ఆక్టాకోర్ టి760 ప్రాసెసర్ 2.2 గిగాహెడ్జ్ వరకు క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. 6 జీబీ లేదా 8 జీబీ ర్యామ్ వేరియంట్లలో, 128 జీబీ అంతర్గత స్టోరేజ్‌తో ఇది వస్తుంది. నోవాట్యాబ్‌లో 11.97 ఇంచుల డిస్‌ప్లేను 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో అందించారు. డ్యుయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. 8,000 ఎంఏహెచ్ బ్యాటరీకి 18 వాట్ల ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వెనుక 13 మెగాపిక్సల్ కెమెరా, ముందు 8 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి. డార్క్ బ్లూ, సినమన్ బ్రౌన్ రంగుల్లో ఇది లభిస్తుంది. ఇక ఏఐ ప్లస్ నోవా ల్యాప్‌ట్యాబ్‌ను ఉత్పాదకత, మీడియా వినియోగం కోసం రూపొందించిన హైబ్రిడ్ 2 ఇన్ 1 పరికరంగా కంపెనీ పరిచయం చేసింది. ఇందులో 13.2 ఇంచుల 2.4కె డిస్‌ప్లే, 2400 *1600 పిక్సల్స్ రిజల్యూషన్, 3:2 ఉత్పాదకత ఆధారిత యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి. గరిష్ఠంగా 450 నిట్స్ బ్రైట్‌నెస్, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తాయి. స్టైలస్ ఇన్‌పుట్‌తోపాటు జతచేసుకునే ఫిజికల్ కీబోర్డ్‌కు కూడా సపోర్ట్ ఉంది.
ధర వివరాలు..
నోవా ల్యాప్‌ట్యాబ్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ8755 ప్రాసెసర్ 2.5 గిగాహెడ్జ్ వరకు క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ అంతర్గత స్టోరేజ్ ఉన్నాయి. మైక్రోఎస్‌డీ ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. క్వాడ్ స్పీకర్ ఆడియో సెటప్, 5జి సెల్యులార్ కనెక్టివిటీ, 16 మెగాపిక్సల్ వెనుక కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. నోవా ల్యాప్‌ట్యాబ్‌లో 10,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇది 33 వాట్ల ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. టీల్ గ్రీన్, డార్క్ బ్లూ రంగుల్లో ఈ పరికరం అందుబాటులో ఉంటుంది. ధరల విషయానికి వస్తే.. ఏఐ ప్లస్ పల్స్ 2 ఎఫ్‌ఈ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.9,999గా నిర్ణయించారు. ఏఐ ప్లస్ నోవాట్యాబ్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ.17,999గా ఉంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర బ్యాంక్ ఆఫర్లతో రూ.20,999గా ఉంది. ఏఐ ప్లస్ నోవా ల్యాప్‌ట్యాబ్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర బ్యాంక్ ఆఫర్లతో రూ.24,999గా నిర్ణయించారు. ఈ మూడు కొత్త డివైస్‌లు అక్టోబర్ 7 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సాధారణ విక్రయాలకు అందుబాటులోకి రానున్నాయి.
తాజావార్తలు
- ●Nifty 50 | ఆందోళనలో ఇన్వెస్టర్లు.. నిఫ్టీ50 ఆరు నెలల కనిష్టానికి..
- ●Mallikarjun Kharge | ప్రధాని మోదీ చేతిలో సీఈసీ కీలుబొమ్మగా మారారు.. సర్‌పై కాంగ్రెస్ వీధి పోరాటం : ఖర్గే
- ●Kavitha | ఏమున్నా నేన్ ఆధారాలతోనే మాట్లాడ్తా.. నాతో పెట్టుకోకు: కేటీఆర్‌కు కవిత వార్నింగ్
- ●Stocks | భారత్‌లోనే కాదు, విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడి పెట్టాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
- ●POCSO Case | బాలుడిపై లైంగిక దాడి.. పోక్సో కేసులో టీచర్‌కు యావజ్జీవ శిక్ష
- ●Hyderabad | ద్విచక్ర వాహనాల చోరీ.. ఇద్దరు టీనేజర్లు అరెస్ట్.. 8 స్కూటర్లు స్వాధీనం

Nifty 50 | ఆందోళనలో ఇన్వెస్టర్లు.. నిఫ్టీ50 ఆరు నెలల కనిష్టానికి..

Mallikarjun Kharge | ప్రధాని మోదీ చేతిలో సీఈసీ కీలుబొమ్మగా మారారు.. సర్‌పై కాంగ్రెస్ వీధి పోరాటం : ఖర్గే

Kavitha | ఏమున్నా నేన్ ఆధారాలతోనే మాట్లాడ్తా.. నాతో పెట్టుకోకు: కేటీఆర్‌కు కవిత వార్నింగ్

Stocks | భారత్‌లోనే కాదు, విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడి పెట్టాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..



