త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్‌..!

KTR | త్రినేత్ర న్యూస్ : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు మ‌రో ముగ్గురి పాస్‌పోర్టు తాత్కాలిక జ‌ప్టు చేయాలంటూ ఏసీబీ అధికారులు ఇటీవ‌ల న్యాయ‌స్థానాన్ని కోరారు.

S

Telangana | Published On Sep 29, 2026, 6.35 am IST

KTR | కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్‌..!
Advertisement

KTR | త్రినేత్ర న్యూస్ : త్రినేత్ర న్యూస్ : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు మ‌రో ముగ్గురి పాస్‌పోర్టు తాత్కాలిక జ‌ప్టు చేయాలంటూ ఏసీబీ అధికారులు ఇటీవ‌ల న్యాయ‌స్థానాన్ని కోరారు. ఈ మేర‌కు ఏసీబీ కోర్టు హైద‌రాబాద్ రీజిన‌ల్ పాస్‌పోర్టు ఆఫీస‌ర్‌కు లేఖ రాసింది. కేటీఆర్ పాస్‌పోర్టు జ‌ప్తు వ్య‌వ‌హారం చ‌ర్చానీయంశంగా మారింది.

ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌తో పాటు నాటి మున్సిప‌ల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన అర్వింద్‌కుమార్, అప్పటి హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి, స్పోర్ట్స్‌ కన్సల్టెంట్‌ కిరణ్‌ మల్లేశ్వరరావు, ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌(ఎఫ్‌ఈవో) ప్రతినిధి అల్బెర్టో లోంగోతోలపై 2024 డిసెంబరులో కేసు నమోదైన సంగ‌తి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కోర్టులో చార్జీషీటు కూడా దాఖ‌లైంది. న్యాయ‌స్థానంలో విచార‌ణ ఎదుర్కొంటున్నారు.

Advertisement
Advertisement