త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maheshkumar Goud | గొట్టిముక్క‌ల పోరాట స్ఫూర్తి ఎంద‌రికో ఆద‌ర్శం: మ‌హేశ్‌కుమార్‌గౌడ్

Maheshkumar Goud | తెలంగాణ ఉద్య‌మ కాలంలో గొట్టిముక్క‌ల ప‌ద్మారావు ప్ర‌ద‌ర్శించిన నిబ‌ద్ధ‌త‌, పోరాట స్ఫూర్తి ఎంతో మందికి ఆద‌ర్శ‌మ‌ని టీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షుడు మ‌హేశ్‌కుమార్‌గౌడ్ కొనియాడారు. ఆయ‌న మృతిపై మ‌హేశ్‌కుమార్‌గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి సంతాపం ప్ర‌క‌టించారు.

S

Telangana | Published On Jun 21, 2026, 3.38 pm IST

Maheshkumar Goud | గొట్టిముక్క‌ల పోరాట స్ఫూర్తి ఎంద‌రికో ఆద‌ర్శం: మ‌హేశ్‌కుమార్‌గౌడ్
Advertisement

Maheshkumar Goud | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ ఉద్య‌మ కాలంలో గొట్టిముక్క‌ల ప‌ద్మారావు ప్ర‌ద‌ర్శించిన నిబ‌ద్ధ‌త‌, పోరాట స్ఫూర్తి ఎంతో మందికి ఆద‌ర్శ‌మ‌ని టీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షుడు మ‌హేశ్‌కుమార్‌గౌడ్ కొనియాడారు. అనారోగ్య సమస్యలతో బాధ‌ప‌డుతూ కూక‌ట్‌ప‌ల్లి వివేకానంద‌న‌గ‌ర్‌లోని నివాసంలో ఆదివారం తెల్లవారుజామున గొట్టిముక్క‌ల మృతి చెందారు. ఆయ‌న మృతిపై మ‌హేశ్‌కుమార్‌గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి సంతాపం ప్ర‌క‌టించారు. బాధిత కుటుంబ స‌భ్య‌లకు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సేవ‌ల‌ను గ‌ర్తు చేసుకున్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఆయ‌న‌ విశిష్ట పాత్ర పోషించారు. సినీ నిర్మాతగా పేరు గ‌ఢించారు. రాష్ట్ర సాధన కోసం పద్మారావు చేసిన సేవలు చిరస్మరణీయం. రాజకీయ రంగంలోనే కాకుండా సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేశారు అని మ‌హేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

రాజకీయ ప్రస్థానం..

సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ గొట్టిముక్క‌ల చురుకుగా వ్య‌వ‌హ‌రించారు. 1970ల్లో తెలంగాణ తొలి ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. మలి దశ ఉద్యమంలోపై త‌న వంతు పాత్ర నిర్వ‌హించారు. 1996లో టీడీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్‌లో చేరారు. 2014లో కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంత‌రం 2018లో కాంగ్రెస్‌లో చేరారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున కూడా కూకట్‌పల్లి నుంచి పోటీ చేశారు.

గొట్టిముక్కల పద్మారావు 1954 నవంబర్ 8వ తేదీన జన్మించారు. చిన్నతనం నుంచి సినిమాలపై ఆసక్తితో ఆయన పద్మప్రియ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి పలు తెలుగు సినిమాలను నిర్మించారు. వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా వ‌చ్చిన 'ఏప్రిల్ 1 విడుదల' సినిమాను ప‌ద్మారావు నిర్మించారు. రాజేంద్రప్రసాద్‌తోనే 'జోకర్' చిత్రాన్ని, 1985లో సుమన్ హీరోగా ‘కంచు కవచం‘ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో పద్మారావు పోలీసు పాత్రలో కనిపించారు. 1986లో సీఎస్ రావు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ వేమన చరిత్ర‘ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు.

Advertisement
Advertisement