త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BCCI | ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. విరాట్‌కు చోటు, బుమ్రా రీఎంట్రీ..!

BCCI | ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదివారం ప్రకటించింది. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి జట్టులో స్థానం క‌ల్పించింది. ఫిట్‌నెస్ క్లియ‌రెన్స్‌కు లోబ‌డి మాత్ర‌మే ఎంపిక ఉంటుంద‌ని బీసీసీఐ స్ప‌ష్టం చేసింది.

P

Sports | Published On Jun 21, 2026, 5.00 pm IST

BCCI | ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. విరాట్‌కు చోటు, బుమ్రా రీఎంట్రీ..!
Advertisement

BCCI | ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదివారం ప్రకటించింది. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి జట్టులో స్థానం క‌ల్పించింది. ఫిట్‌నెస్ క్లియ‌రెన్స్‌కు లోబ‌డి మాత్ర‌మే ఎంపిక ఉంటుంద‌ని బీసీసీఐ స్ప‌ష్టం చేసింది. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. అఫ్గానిస్థాన్‌పై చివరి వన్డేలో శతకం బాదిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు మ‌ళ్లీ అవ‌కాశం ద‌క్క‌లేదు. అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు తొలుత ఎంపికైన కోహ్లీ, ఐపీఎల్ 2026 ఫైనల్ సందర్భంగా హామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. దీంతో ఆ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో వైద్య పరీక్షలు పూర్తి చేసి ఫిట్‌నెస్ క్లియరెన్స్ స‌ర్టిఫికెట్ పొందాల్సి ఉంది. కోహ్లీ స్థానంలో అఫ్గానిస్థాన్ సిరీస్‌కు ఎంపికైన యశస్వి జైస్వాల్, చెన్నైలో జరిగిన చివరి వన్డేలో అజేయ శతకంతో ఆకట్టుకున్నాడు. 86 బంతుల్లో 110 పరుగులు చేసిన జైస్వాల్ 14 ఫోర్లు, మూడు సిక్సర్లతో మెరిశాడు. అయినప్పటికీ ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది జట్టులో చోటు దక్కలేదు.

మూడేళ్ల త‌ర్వాత బుమ్రా రీఎంట్రీ

స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దాదాపు మూడేళ్ల తర్వాత వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. 2023 ప్రపంచకప్ ఫైనల్ అనంతరం వన్డే మ్యాచ్ ఆడలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం ఎంపికైనప్పటికీ వెన్నునొప్పి కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని బుమ్రా ప‌నిభారాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో బీసీసీఐ అఫ్గానిస్థాన్ సిరీస్‌తో పాటు ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20ల‌కు ఎంపిక చేయ‌లేదు. తాజాగా మ‌ళ్లీ వ‌న్డే జ‌ట్టులోకి పున‌రాగ‌మ‌నం చేయ‌నున్నాడు. మరోవైపు స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐర్లాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్ 2026 సందర్భంగా ఎడమ పాదానికి గాయమైన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స తీసుకుంటున్న‌ట్లుగా బోర్డు తెలిపింది. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసిన టీ20 జట్టులో మాత్రం చోటు కల్పించింది.

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ*, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.

ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు భారత జట్టు : శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.

Advertisement
Advertisement