Ammonia Gas Leak | తమిళనాడులో అమోనియం గ్యాస్ లీక్.. ఏడుగురు మృతి..!
Ammonia Gas Leak | తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఫ్యాక్టరీలో అమోనియా గ్యాస్ లీక్ ఘన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పెరియపాళయం సమీపంలోని కనిగైపేర్ గ్రామంలో ఉన్న సెయింట్ పీటర్స్ పాల్ సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ కావడంతో ఏడుగురు మృతి చెందగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు.
Ammonia Gas Leak | తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఫ్యాక్టరీలో అమోనియా గ్యాస్ లీక్ ఘన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పెరియపాళయం సమీపంలోని కనిగైపేర్ గ్రామంలో ఉన్న సెయింట్ పీటర్స్ పాల్ సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ కావడంతో ఏడుగురు మృతి చెందగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఘటన జరిగిన వెంటనే అరక్కోణంలోని జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) నాలుగో బెటాలియన్‌ను అప్రమత్తం చేశారు. చెన్నై నుంచి 30 మంది ప్రత్యేక సిబ్బందితో కూడిన బృందాన్ని హుటాహుటిన ఘటనాస్థలికి పంపించారు. అత్యాధునిక భద్రతా పరికరాలు, గ్యాస్ డిటెక్షన్ యంత్రాలు, పీపీఈ కిట్లతో అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. కలెక్టర్ ఎస్ కవిత తెలిపిన వివరాల ప్రకారం.. అస్వస్థతకు గురైన 67 మంది కార్మికులను వెంటనే సమీప ఆసుపత్రుల్లోకి తరలించారు. ఇందులో 46 మంది వెల్స్ ఆస్పత్రిలో, 21 మంది వెంకటేశ్వర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పరిస్థితి విషమంగా ఉన్న తొమ్మిది మందిని అంబులెన్సుల ద్వారా చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ స్పందించి ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమల భద్రత, ఆరోగ్య శాఖ డైరెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ అదనపు డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. 24 గంటల్లో ప్రాథమిక నివేదిక, మూడు రోజుల్లో తుది నివేదిక సమర్పించాలని ఆదేశించారు. బాధితులకు అవసరమైన వైద్య సహాయం, సహాయక చర్యలు అందేలా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పర్యవేక్షణ అధికారులతో కలిసి సహాయక చర్యలను సమన్వయం చేయాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ అర్లేకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
" I am deeply saddened by the tragic ammonia gas leak incident at a shrimp processing factory in Kannigaipair Village , near Periyapalayam, Thiruvallur district, which has resulted in the loss of precious lives and caused injuries to several workers.
My heartfelt condolences to…— LOK BHAVAN, TAMIL NADU (@lokbhavan_tn) June 21, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Gutta Sukhendar Reddy | ఏసీబీకి పట్టుబడితే కఠిన శిక్షలు ఉండాలే
- ●Mahesh Babu Sister | బాలకృష్ణ హీరో - మహేష్‌బాబు అక్క హీరోయిన్ - ఫ్యాన్స్ గొడవలతో ఆగిపోయిన మూవీ ఏదో తెలుసా?
- ●Covid-19 | ముంబయిలో కరోనా కలకలం.. మళ్లీ విజృంబిస్తున్న వైరస్లు..!
- ●US Tech Layoffs | కోట్లు సంపాదించినా.. అమెరికాలో లేఆఫ్ టెన్షన్! 'ఇండియాకు తిరిగొచ్చేయమంటారా?' అని అడుగుతున్న టెకీ
- ●NEET Re-Exam 2026 | "మా మానసిక క్షోభకు బాధ్యులెవరు?".. నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్ల వద్ద విద్యార్థులు, పేరెంట్స్ కన్నీటి కష్టాలు!
- ●Yoga Day 2026 | ఇంటర్నేషనల్ యోగా డే - ఆసనాలతో అదరగొట్టిన టాలీవుడ్ హీరోయిన్లు

Gutta Sukhendar Reddy | ఏసీబీకి పట్టుబడితే కఠిన శిక్షలు ఉండాలే

Mahesh Babu Sister | బాలకృష్ణ హీరో - మహేష్‌బాబు అక్క హీరోయిన్ - ఫ్యాన్స్ గొడవలతో ఆగిపోయిన మూవీ ఏదో తెలుసా?

Covid-19 | ముంబయిలో కరోనా కలకలం.. మళ్లీ విజృంబిస్తున్న వైరస్లు..!

US Tech Layoffs | కోట్లు సంపాదించినా.. అమెరికాలో లేఆఫ్ టెన్షన్! 'ఇండియాకు తిరిగొచ్చేయమంటారా?' అని అడుగుతున్న టెకీ





