Netherlands Vs Sweden | దుమ్మురేపిన నెదర్లాండ్స్
Netherlands Vs Sweden | ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా హ్యుస్టన్ వేదికగా జరిగిన 35వ మ్యాచ్‌లో స్వీడన్‌ను 5-1 తేడాతో నెదర్లాండ్స్ చిత్తు చేసింది. ఆరంభం నుంచే మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన డచ్ టీమ్.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష విజయాన్ని నమోదు చేసుకుంది. బ్రియాన్ బ్రాబ్బే, కోడి గాక్పో చెరో రెండు గోల్స్ చేయగా.. క్రిసెన్సియో సమ్మర్‌విల్ మరో గోల్ వేశాడు.
- డచ్ టీమ్ దూకుడుతో స్వీడన్‌కు చుక్కలు
- 5-1 తేడాతో జయకేతనం
- బ్రియాన్ బ్రాబ్బే, కోడి గాక్పో డబుల్ గోల్
Netherlands Vs Sweden | ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా హ్యుస్టన్ వేదికగా జరిగిన 35వ మ్యాచ్‌లో స్వీడన్‌ను 5-1 తేడాతో నెదర్లాండ్స్ చిత్తు చేసింది. ఆరంభం నుంచే మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన డచ్ టీమ్.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష విజయాన్ని నమోదు చేసుకుంది. బ్రియాన్ బ్రాబ్బే, కోడి గాక్పో చెరో రెండు గోల్స్ చేయగా.. క్రిసెన్సియో సమ్మర్‌విల్ మరో గోల్ వేశాడు.
మ్యాచ్ ప్రారంభమైన ఐదు నిమిషాలకే బ్రియాన్ బ్రాబ్బే అద్భుత ఫినిషింగ్‌తో గోల్ వేయడంతో నెదర్లాండ్స్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తొలి గోల్‌తో ఉత్సాహంగా ఆడిన డచ్ జట్టు స్వీడన్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 17వ నిమిషంలో మరోసారి బ్రాబ్బే తన రెండో గోల్ వేయగా.. స్కోరు 2-0కి చేరింది. రెండు గోల్స్ వెనుకబడిన స్వీడన్ మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు ప్రయత్నించినా నెదర్లాండ్స్ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. ఫలితంగా తొలి అర్ధభాగం ముగిసే సమయానికి డచ్ జట్టు 2-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది.
సెకండ్ ఆఫ్ టైమ్ మొదలు కాగానే.. నెదర్లాండ్స్ మరింత దూకుడుగా ఆడింది. 47వ నిమిషంలో కోడి గాక్పో గోల్ చేసి జట్టు ఆధిక్యాన్ని 3-0కు పెంచాడు. 54వ నిమిషంలో మరోసారి గోల్ సాధించి స్కోరును 4-0కి పెంచాడు. డచ్ ఆటగాళ్లను స్వీడన్ ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. 59వ నిమిషంలో ఆంథోనీ ఎలాంగా అద్భుత గోల్‌తో స్వీడన్‌కు కాస్త ఓదార్పునిచ్చాడు. దాంతో స్కోరు 4-1కి మారింది. అదే ఊపును చివరి వరకు స్వీడన్ కొనసాగించలేకపోయింది. మ్యాచ్ ముగియడానికి కొద్ది నిమిషాల ముందు అనగా.. 89వ నిమిషంలో క్రిసెన్సియో సమ్మర్‌విల్ మరో గోల్ వేసి నెదర్ల్సాండ్స్ విక్టరీని ఖరారు చేశాడు. చివరికి 5-1 తేడాతో డచ్ జట్టు విజయాన్ని సాధించింది. ఈ విజయంతో గ్రూప్ ఎఫ్‌లో నెదర్లాండ్స్ తన స్థాన్ని పదిలం చేసుకుంది. తర్వాతి మ్యాచ్‌ను ఈ నెల 26న జపాన్‌తో ఆడనున్నది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ammonia Gas Leak | తమిళనాడులో అమోనియం గ్యాస్ లీక్.. ఏడుగురు మృతి..!
- ●Venky Anil Ravipudi Movie | రాయలసీమ బ్యాక్‌డ్రాప్ ... కానీ నో వయలెన్స్ - వెంకీ అనిల్ రావిపూడి మూవీ రిలీజ్ డేట్ రివీల్
- ●NEET Re-Exam 2026 | రూ.30 వేలు కడితే 'నీట్' పేపర్ మీదే! వీడియో కాల్‌తో సైబర్ కేటుగాళ్ల వల.. దర్యాప్తులో పోలీసులు
- ●Suicide attempt | భార్యాభర్తల గొడవ.. పిల్లలకు ఎలుకల మందు తినిపించిన తల్లి
- ●Shiv Sena UBT Split | ఉద్ధవ్ సేనలో మరో భారీ చీలిక: నేడు ఏకగ్రీవంగా పార్టీని వీడనున్న ఆరుగురు రెబల్ ఎంపీలు
- ●Maheshkumar Goud | గొట్టిముక్కల పోరాట స్ఫూర్తి ఎందరికో ఆదర్శం: మహేశ్‌కుమార్‌గౌడ్

Ammonia Gas Leak | తమిళనాడులో అమోనియం గ్యాస్ లీక్.. ఏడుగురు మృతి..!

Venky Anil Ravipudi Movie | రాయలసీమ బ్యాక్‌డ్రాప్ ... కానీ నో వయలెన్స్ - వెంకీ అనిల్ రావిపూడి మూవీ రిలీజ్ డేట్ రివీల్

NEET Re-Exam 2026 | రూ.30 వేలు కడితే 'నీట్' పేపర్ మీదే! వీడియో కాల్‌తో సైబర్ కేటుగాళ్ల వల.. దర్యాప్తులో పోలీసులు

Suicide attempt | భార్యాభర్తల గొడవ.. పిల్లలకు ఎలుకల మందు తినిపించిన తల్లి





