త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchander rao | బొగ్గు కుంభ‌కోణంపై సీబీఐ విచార‌ణ జ‌ర‌గాల్సిందే.. బీజేపీ చీఫ్ రాంచంద‌ర్ రావు డిమాండ్

Ramchander rao | తెలంగాణ రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టిస్తున్న బొగ్గు కుంభ‌కోణంపై సీబీఐ విచార‌ణ జ‌ర‌గాల్సిందే అని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు రాంచంద‌ర్ రావు డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Jan 21, 2026, 4.56 pm IST

Ramchander rao | బొగ్గు కుంభ‌కోణంపై సీబీఐ విచార‌ణ జ‌ర‌గాల్సిందే.. బీజేపీ చీఫ్ రాంచంద‌ర్ రావు డిమాండ్
Advertisement

సింగ‌రేణి పాపం బీఆర్ఎస్, కాంగ్రెస్‌దే..
కావాల్సిన వారికే బొగ్గు గ‌నుల టెండ‌ర్లు..
నైనీ బ్లాక్‌లోనే కాదు.. రాష్ట్ర‌మంతా కుంభ‌కోణాలే..
స‌మ‌గ్ర విచార‌ణ‌కు బీజేపీ డిమాండ్
ఢిల్లీలో మీడియాతో రాంచంద‌ర్ రావు

Ramchander rao | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టిస్తున్న బొగ్గు కుంభ‌కోణంపై సీబీఐ విచార‌ణ జ‌ర‌గాల్సిందే అని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు రాంచంద‌ర్ రావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఉద్యమ సమయంలో సింగరేణి పేరు చెప్పుకొని, కార్మికులకు ఇళ్లు, భూములు, వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ హామీలిచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆ మాటలన్నీ తుంగలో తొక్కారు. 75 వేల మంది ఉన్న సింగరేణి ఉద్యోగుల సంఖ్య‌.. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక 42 వేల‌కు చేరింది. ఇక కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌ 38 వేలకు తగ్గించి, కార్మికుల పొట్టకొట్టారు అని రాంచంద‌ర్ రావు మండిప‌డ్డారు.

సింగ‌రేణి పేరు మీద వ్యాపారాలు స‌రికాదు

సింగరేణి కార్మికులు వారి ర‌క్తాన్ని ధార‌పోసి సింగ‌రేణిని లాభాల్లోకి తీసుకొచ్చారు. వారి చెమ‌ట చుక్క‌ల‌ను మ‌రిచిపోయి ఇవాళ అదే సింగ‌రేణి పేరు మీద వ్యాపారాలు చేయ‌డం స‌రికాదు. దేశంలోనే అత్యధిక లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లోకి నెట్టింది చాలక, మెస్సీకి స్పాన్సర్‌షిప్‌ల పేరుతో రూ. 10 కోట్లు ఖర్చు పెట్టి సంస్థను ఆర్థికంగా దెబ్బతీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పరిపాలన గాలికొదిలేసి, కేవలం 'కమీషన్ల' కోసమే పాకులాడుతోంది. సైట్ విజిట్ పేరు మీద కావాల్సిన వారికే టెండ‌ర్లు కేటాయిస్తున్నారు అని బీజేపీ అధ్య‌క్షుడు ధ్వ‌జ‌మెత్తారు.

నైనీ బ్లాక్‌లో ఏం జ‌రిగింది..

సింగ‌రేణి పాపం స‌గం బీఆర్ఎస్‌ది, స‌గం కాంగ్రెస్‌ది. హ‌రీశ్‌రావు సుద్ద‌పూసేం కాదు.. కిష‌న్ రెడ్డికి లేఖ రాసినా అని అంటున్నాడు. అధికారంలోకి ఉన్న‌ప్పుడు సింగ‌రేణి కోసం ఏం చేశారో చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నా. నైనీ బ్లాక్‌లో ఏం జ‌రిగింది.. ఎవ‌రెవ‌రికి ఎంత ముట్టాయో కాంగ్రెస్ ప్ర‌భుత్వం బ‌య‌ట పెట్టాలి. ఇవ‌న్నీ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిన అవ‌సరం ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

మంత్రుల మ‌ధ్య త‌గాదాలు

తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ భ్రష్టుపట్టించింది.. దానిని కాంగ్రెస్ కొనసాగిస్తోంది. కాంగ్రెస్ మంత్రులు పరిపాలనను పక్కన పెట్టి కమీషన్ల కోసం బంధుమిత్రుల కాంట్రాక్టుల కోసం పని చేస్తున్నారు. ఒక్క నైనీ బ్లాక్‌లోనే కాదు.. అన్ని విష‌యాల్లోనూ అవినీతికి పాల్ప‌డుతున్నారు.. మంత్రుల మ‌ధ్య త‌గాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. బీఆర్ఎస్ హయాం నుంచి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు సింగరేణి వ్యవహారాల్లో దర్యాప్తు జరగాల్సిందే. సీబీఐ, సిట్, విజిలెన్స్ కమిషన్ ఏ సంస్థ అయినా దర్యాప్తు చేస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు సమగ్ర దర్యాప్తు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది అని రాంచంద‌ర్ రావు స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement