త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maheshkumar Goud | బీఆర్ఎస్ పార్టీని ర‌ద్దు చేయాలి: టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్‌గౌడ్

Maheshkumar Goud | ద‌ళితుల‌ను, మ‌హిళ‌ల‌ను అవ‌మాన‌ప‌రుస్తున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉండ‌డానికి వీల్లేద‌ని.. త‌క్ష‌ణ‌మే ఆ పార్టీని ర‌ద్దు చేయాల‌ని టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మ‌హేశ్ కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. తాతా మ‌ధు చేసిన వ్యాఖ్య‌లు కేసీఆర్ ప‌లికించిన‌వేన‌ని ఆరోపించారు.

S

Telangana | Published On Sep 8, 2026, 1.10 pm IST

Maheshkumar Goud | బీఆర్ఎస్ పార్టీని ర‌ద్దు చేయాలి: టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్‌గౌడ్
Advertisement
  • తాతా మ‌ధు వ్యాఖ్య‌లు కేసీఆర్ ప‌లికించిన‌వే
  • ద‌ళితుడిని అధ్య‌క్షా అనాల్సి వ‌స్తుంద‌నే స‌భ‌కు వ‌స్త‌లేడు
  • శాస‌న‌మండ‌లిలో ఎమ్మెల్సీ మ‌హేశ్ కుమార్ వ్యాఖ్య‌లు

Maheshkumar Goud | త్రినేత్ర‌.న్యూస్: ద‌ళితుల‌ను, మ‌హిళ‌ల‌ను అవ‌మాన‌ప‌రుస్తున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉండ‌డానికి వీల్లేద‌ని.. త‌క్ష‌ణ‌మే ఆ పార్టీని ర‌ద్దు చేయాల‌ని టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మ‌హేశ్ కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. తాతా మ‌ధు చేసిన వ్యాఖ్య‌లు కేసీఆర్ ప‌లికించిన‌వేన‌ని ఆరోపించారు. ద‌ళితుడిని అధ్య‌క్షా అనాల్సి వ‌స్తుంద‌నే స‌భ‌కు రాకుండా కేసీఆర్ ముఖం చాటేస్తున్నార‌ని మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం ఆయ‌న శాస‌న మండ‌లిలో మాట్లాడుతూ కేసీఆర్‌, బీఆర్ఎస్ తీరుపై తీవ్ర స్థాయిలో ఫైర‌య్యారు.

స్పీక‌ర్ అంద‌రివాడు..

నిన్న జ‌రిగిన సంఘ‌ట‌న బాధాక‌రం. ఇది పెద్ద‌ల స‌భ‌. తాతా మ‌ధుగారు స్పీక‌ర్‌పై మాట్లాడ‌డం ఆక్షేప‌ణీయం. స్పీక‌ర్‌ను వ్య‌క్తిగా, పార్టీకి చెందిన వ్య‌క్తిగా చూడ‌లేం. స్పీక‌ర్ అంద‌రివాడు. త‌ల్లి లేక అక్క ద‌గ్గ‌ర పెరిగాడు. ఎప్పుడో చ‌నిపోయిన ఆయ‌న‌ తల్లి గురించి తాతా మ‌ధు మాట్లాడ‌డం ఈ స‌భ గౌర‌వాన్ని కించ‌ప‌రిచేలా ఉంది. ప్ర‌జ‌ల్లో స‌భ ప‌ట్ల ఉన్న గౌర‌వం స‌న్న‌గిల్లే అవ‌కాశం ఉంది.

ఇలాంటి పార్టీలు దేశానికి మంచిది కాదు..

ద‌ళితుల‌ను ముఖ్య‌మంత్రుల‌ను, రాష్ట్రప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తులుగా చేసిన ఘ‌నత కాంగ్రెస్ పార్టీది. తాతా మ‌ధు అంశమే కాదు.. బీఆర్ఎస్‌కు ద‌ళితుల ప‌ట్ల వేరే వైఖ‌రి ఉంది. భ‌ట్టి గారి హోదాను తగ్గించిన చ‌రిత్ర కేసీఆర్‌ది. ఒక ద‌ళితుడు స్పీక‌ర్‌గా ఉన్నాడు కాబ‌ట్టే కేసీఆర్ అసెంబ్లీకి వ‌స్త‌లేడు. ద‌ళితుడిని అధ్యక్షా అనాల్సి వ‌స్త‌ద‌ని ముఖం చాటేస్తున్న‌డు. ఇలాంటి పార్టీలుంటే దేశానికి మంచిది కాదు. మ‌హిళ‌ల‌ను అవ‌మాన‌ప‌రుస్తున్న‌రు.

బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండ‌డానికి వీల్లేదు. ఆ పార్టీని ర‌ద్దు చేయాలి. తాతా మ‌ధు మాట్లాడిన మాట‌లు కేసీఆర్ ప‌లికించిన‌వే. అందుకే స‌మూలంగా బీఆర్ఎస్ పార్టీని స‌మూలంగా ర‌ద్దు చేయాలని కోరుతున్నా అని మ‌హేశ్‌కుమార్‌గౌడ్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement