Anaswara Rajan | చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. ‘కాకా’ ఫస్ట్ లుక్ విడుదల
Anaswara Rajan | మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో బిజీ అవుతోంది. ఇప్పటికే మూడు తెలుగు చిత్రాలకు సైన్ చేసిన ఆమె.. తాజాగా నాలుగో సినిమా చేస్తోంది. ‘అంతా రాములొరు చూసుకుంటారు’లోనూ ఆమె కీలక పాత్రలో కనిపించనుంది.
Entertainment | Published On Sep 8, 2026, 1.02 pm IST
Anaswara Rajan | మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో బిజీ అవుతోంది. ఇప్పటికే మూడు తెలుగు చిత్రాలకు సైన్ చేసిన ఆమె.. తాజాగా నాలుగో సినిమా చేస్తోంది. ‘అంతా రాములొరు చూసుకుంటారు’లోనూ ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. అనస్వర ఇప్పటివరకు ఒప్పుకున్న తెలుగు సినిమాల్లో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ మాత్రం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ కావడం విశేషం. అనస్వర పుట్టినరోజు సందర్భంగా ‘కాకా’ చిత్రబృందం ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఇందులో ఆమెను ఎంబీబీఎస్ విద్యార్థిని అమ్ములుగా పరిచయం చేశారు.
సాధారణమైన విద్యార్థిని లుక్‌లో అనస్వర కనిపిస్తుండగా.. పోస్టర్ ఆమె పాత్ర స్వభావంపై ఆసక్తిని పెంచేలా ఉంది. ముఖ్యంగా ఆమె వెనుక నీడలో చిరంజీవిని చూపించడం ద్వారా సినిమాలో ఆయన పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని హైలైట్ చేశారు. ‘కాకా’లో అనస్వర రాజన్ అమ్ములు అనే పాత్రలో నటిస్తోంది. ఆమె చిరంజీవి కుమార్తెగా కనిపించనుంది. తండ్రి, కుమార్తె మధ్య అనుబంధం సినిమాలో కీలకంగా ఉండబోతున్నట్లు ఫస్ట్ లుక్ ద్వారా తెలుస్తోంది. అమ్ములు పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్రబృందం వెల్లడించకపోయినా.. ఎంబీబీఎస్ విద్యార్థినిగా ఆమెను చూపించడం కథలో ఈ పాత్రకు ప్రత్యేకమైన నేపథ్యం ఉన్నట్లు సూచిస్తోంది. ఇక ప్రస్తుతం ‘కాకా’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.
హైదరాబాద్‌లో సినిమా కీలక షెడ్యూల్‌ను చిత్రబృందం ప్రారంభించింది. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అనస్వర కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటోంది. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా అనస్వర ఫస్ట్ లుక్ విడుదల కావడంతో ఆమె పాత్రపై కూడా ఆసక్తి పెరిగింది. సంక్రాంతి బరిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 2027 జనవరి 13న ‘కాకా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
To the BEAUTIFUL PRESENCE that makes his world even more special ❤️🔥
Wishing the 'HEART OF KAAKA', Ammulu Paapa, #AnaswaraRajan a very Happy Birthday 🤍#KAAKA Shoot in progress..
Worldwide Grand Release on January 13th, 2027 🔥A @dirbobby Film 🪓
Produced by @TheKVNofficial… pic.twitter.com/AsJgEOHy9I— KVN Productions (@KvnProductions) September 8, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Maheshkumar Goud | బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలి: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
- ●Kangana Ranaut | టార్గెట్ ఎప్పుడూ మహిళే.. ఆ ధోరణి ఎప్పుడు మారుతుందో..? : త్రిష వివాదంపై కంగన రనౌత్
- ●Kanohar Electricals IPO | కనోహర్ ఎలక్ట్రికల్స్ ఐపీవోకు విశేష స్పందన.. 31 శాతం లాభం అంచనా..
- ●MLA Veerlapalli Shankar | కేసీఆర్ చనిపోవాలి: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు
- ●Leopard | గాయపడిన చిరుతను కాపాడేందుకు వెళ్లగా.. అధికారులపై దాడి.. షాకింగ్ వీడియో
- ●Vakiti Srihari | ఇప్పటికీ పెత్తందార్ల పోకడలు కొనసాగడం దురదృష్టకరం: మంత్రి వాకిటి శ్రీహరి

Maheshkumar Goud | బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలి: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్

Kangana Ranaut | టార్గెట్ ఎప్పుడూ మహిళే.. ఆ ధోరణి ఎప్పుడు మారుతుందో..? : త్రిష వివాదంపై కంగన రనౌత్

Kanohar Electricals IPO | కనోహర్ ఎలక్ట్రికల్స్ ఐపీవోకు విశేష స్పందన.. 31 శాతం లాభం అంచనా..

MLA Veerlapalli Shankar | కేసీఆర్ చనిపోవాలి: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు






