త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

బస్‌స్టేషన్లకు ‘మోడల్‌’ హంగులు!

TGS RTC | ప్రయాణికులకు మెరుగైన, సురక్షితమైన సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 86 ప్రధాన బస్‌ స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో మోడల్‌ బస్‌ స్టేషన్లుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రారంభించింది. రోజుకు 5 వేల మందికి పైగా ప్రయాణికుల రద్దీ ఉండే బస్‌ స్టేషన్లను ఇందుకోసం గుర్తించింది.

P

Telangana | Published On Nov 10, 2026, 4.59 pm IST

బస్‌స్టేషన్లకు ‘మోడల్‌’ హంగులు!
Advertisement
  • 86 స్టేష‌న్ల ఆధునికీక‌ర‌ణ‌
  • ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా ఏర్పాట్లు
  • ప్రధాన బస్‌ స్టేషన్ల ఆధునికీకరణకు టీజీఎస్‌ఆర్టీసీ శ్రీకారం
  • రోజూ 5వేల మందికి పైగా రాకపోకలు సాగించే స్టేషన్ల గుర్తింపు
  • సమాచార వ్యవస్థ పటిష్టం.. సీసీటీవీల ఏర్పాటుకు చర్యలు

TGS RTC | ప్రయాణికులకు మెరుగైన, సురక్షితమైన సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 86 ప్రధాన బస్‌ స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో మోడల్‌ బస్‌ స్టేషన్లుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రారంభించింది. రోజుకు 5 వేల మందికి పైగా ప్రయాణికుల రద్దీ ఉండే బస్‌ స్టేషన్లను ఇందుకోసం గుర్తించింది. గుర్తించిన 86 బస్‌ స్టేషన్లలో ప్రయాణికుల సమాచార వ్యవస్థను ఇప్పటికే బలోపేతం చేసింది. ప్రతి స్టేషన్‌లో ప్రత్యేక కంట్రోలర్‌ను నియమించడంతోపాటు విచారణ, సంప్రదింపు నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ప్రయాణికులు బస్సుల రాకపోకలు, సర్వీసుల సమయాలు, ఇతర వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం కలిగింది. బస్సుల రాకపోకలకు సంబంధించిన తాజా వివరాలను అందించేందుకు కొత్త టైమ్‌టేబుల్‌ బోర్డులను త్వరలో ఏర్పాటు చేయనుంది.

బస్సుల సమయాలపై ప్రకటనలు

ప్రయాణికులకు ముఖ్యంగా మొదటి, చివరి బస్సుల సమయాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు బస్‌ స్టేషన్లలో పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ (పీఏఎస్‌)ను ఏర్పాటు చేసింది. దీనివల్ల ప్రయాణికులకు బస్సుల వివరాలు సులభంగా తెలిసే అవకాశం ఉంటుంది. ప్రయాణికుల భద్రత, రద్దీ నియంత్రణ, బస్‌ స్టేషన్ల కార్యకలాపాల పర్యవేక్షణను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని బస్‌ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని టీజీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ఈ కెమెరాలను సంబంధిత ప్రాంతీయ కార్యాలయాలు, సంస్థ ప్రధాన కార్యాలయానికి అనుసంధానించనున్నారు. దీంతో ప్రయాణికుల రాకపోకలు, రద్దీ పరిస్థితులు, స్టేషన్ల నిర్వహణను కేంద్రీకృత విధానంలో నిరంతరం పర్యవేక్షించేందుకు వీలవుతుంది. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే సంస్థ లక్ష్యమని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్‌ స్టేషన్లలో సదుపాయాలను నిరంతరం మెరుగుపరుస్తామని వెల్లడించారు.

Advertisement
Advertisement