Bhatti Vikramarka | కరువు కాలంలో రైతులకు భరోసా ఇవ్వండి
Bhatti Vikramarka | ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితుల నేపథ్యంలో రైతులకు బ్యాంకులకు రైతులకు అండగా నిలిచి భరోసా ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. అర్హులైన రైతుల పంట రుణాలను ఆర్బీఐ నిబంధనల ప్రకారం రీషెడ్యూలింగ్, రీస్ట్రక్చరింగ్ చేయడంతోపాటు రబీ సీజన్‌కు కొత్త రుణాలను సకాలంలో మంజూరు చేయాలని కోరారు.
- పంట రుణాల రీషెడ్యూలింగ్ చేయాలి
- రబీకి కొత్త రుణాలు ఇవ్వాలి
- ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ప్రత్యేక చొరవ చూపాలి
- విద్యా, గృహ, ఎంఎస్‌ఎంఈ రుణాల పెంపునకు ప్రాధాన్యం ఇవ్వండి
- బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితుల నేపథ్యంలో రైతులకు బ్యాంకులకు రైతులకు అండగా నిలిచి భరోసా ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. అర్హులైన రైతుల పంట రుణాలను ఆర్బీఐ నిబంధనల ప్రకారం రీషెడ్యూలింగ్, రీస్ట్రక్చరింగ్ చేయడంతోపాటు రబీ సీజన్‌కు కొత్త రుణాలను సకాలంలో మంజూరు చేయాలని కోరారు. రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా బ్యాంకర్లే క్షేత్రస్థాయిలో చొరవ చూపాలని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా రుణాల మంజూరులో సానుకూలంగా వ్యవహరించి అర్హులైన విద్యార్థులకు గరిష్ఠ స్థాయిలో రుణాలు అందించాలని సూచించారు. వ్యక్తిగత గృహ రుణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎంఎస్‌ఎంఈ, మౌలిక సదుపాయాల రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. పెద్ద పరిశ్రమలతో పోలిస్తే ఎంఎస్‌ఎంఈలు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయని, ఈ రంగానికి రుణాలు పెంచితే ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు.
365 మండలాల్లో కరవు పరిస్థితులు
ఎల్‌నినో ప్రభావం దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంపై పడుతోందని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలో 365 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించామని, వీటిలో 111 మండలాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని వెల్లడించారు. వర్షాభావంతో రైతుల పెట్టుబడులు, ఆదాయాలు దెబ్బతిన్నాయని, ఈ పరిస్థితుల్లో బ్యాంకింగ్ వ్యవస్థ తక్షణ సహకారం అందించాలన్నారు. చిన్న, సన్నకారు, కౌలు రైతులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలు, పంటల మార్పిడి, సూక్ష్మ సేద్యం, నిల్వ, ప్రాసెసింగ్, రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ఆర్థిక సహకారం అందించాలని కోరారు. రైతులకు రుణ ఉపశమన చర్యలపై అవగాహన కల్పించేందుకు కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు.
10-15 శాతం కుటుంబాలకు అదనపు ఉపాధి
కరవు పరిస్థితుల్లో వ్యవసాయంపై మాత్రమే ఆధారపడకుండా రైతు కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కల్పించాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఈ సీజన్‌లో కనీసం 10-15 శాతం కుటుంబాలకు అదనపు ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని పరిశీలించాలన్నారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడంతోపాటు ఒక్కో సంఘానికి అదనంగా రూ.2 లక్షల వరకు రుణాలు అందించే అవకాశాలను పరిశీలించాలని కోరారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ఉదారంగా రుణాలు మంజూరు చేయాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం కార్యక్రమం అమలులో ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. అక్టోబర్ 16న రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 20,818 మెగావాట్లకు చేరడం చరిత్రలోనే అత్యధికమని భట్టి విక్రమార్క తెలిపారు. వర్షాభావం భూగర్భ జలాలు, విద్యుత్ వ్యవస్థ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటు రైతుల రుణ చెల్లింపు సామర్థ్యంపైనా ప్రభావం చూపుతోందన్నారు. ఈ సంక్షోభాన్ని ప్రభుత్వం, బ్యాంకులు సమష్టిగా ఎదుర్కోవాలని పేర్కొన్నారు.
రబీకి రూ.38,268 కోట్ల రుణాలు ఇవ్వాలి : తుమ్మల
సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. కరవు ప్రభావిత మండలాల్లో పంట రుణాలను ఆర్బీఐ నిబంధనల ప్రకారం వెంటనే రీషెడ్యూలింగ్, రీస్ట్రక్చరింగ్ చేయాలన్నారు. రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా బ్యాంకర్లే ముందుకు రావాలని సూచించారు. కృష్ణా, గోదావరి నదులకు ఈ ఏడాది వరదలు రాకపోవడంతో రిజర్వాయర్లలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. భూగర్భ జలాలు రీచార్జి కాకపోవడంతో సుమారు 10-15 లక్షల బోరుబావుల్లో నీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. దీని ప్రభావం ఖరీఫ్‌తోపాటు రబీ పంటలపైనా పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. గత రెండున్నరేళ్లలో ప్రభుత్వం బ్యాంకుల ద్వారా సుమారు రూ.21 వేల కోట్ల పంట రుణమాఫీ అమలు చేసిందని, రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు అందించిందని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ, సాగునీరు, విద్యుత్, సబ్సిడీ తదితర రంగాలకు కలిపి రూ.1.78 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
రుణాలు వెంటనే మంజూరు చేయాలి
రబీ సీజన్‌కు బ్యాంకులు నిర్దేశించుకున్న రూ.38,268 కోట్ల పంట రుణాలను వెంటనే మంజూరు చేయాలని కోరారు. 2026 సెప్టెంబర్ నాటికి రూ.96,943 కోట్ల రుణ పంపిణీ లక్ష్యంలో 53 శాతం మాత్రమే సాధించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మాన్‌సూన్ ఫార్మింగ్ రుణాల పంపిణీ కూడా లక్ష్యంలో 17 శాతానికే పరిమితమైందని, రుణాల మంజూరులో వేగం పెంచాలని సూచించారు. పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు పెట్టుబడి రుణాలు అందించాలన్నారు. డ్రిప్, స్ప్రింక్లర్ సాగుకు రుణాలు పెంచాలని, ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు సహకరించాలని కోరారు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, పశుపోషణ, తేనెటీగల పెంపకం వంటి అనుబంధ రంగాలకు రుణాలిచ్చి రైతులకు అదనపు ఆదాయ మార్గాలు కల్పించాలన్నారు. ఎఫ్‌పీఓలు, మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరులో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, రాహుల్ బొజ్జా, డాక్టర్ గౌరవ్ ఉప్పల్,కే సురేంద్ర మోహన్, ఎస్‌ఎల్‌బీసీ ప్రతినిధులు మానస గంగోత్రి, చిన్మయ్ కుమార్, ఉదయ్ భాస్కర్, నలేష్ నీలేష్ ద్వివేది, సురేష్ కుమార్ పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Priyank Kharge | టిప్పు సుల్తాన్ నాలుగు ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు చేశారు.. RSS కనీసం స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొనలేదు : ప్రియాంక్ ఖర్గే
- ●Maheshkumar Godu | భారత్ సమ్మిట్‌కు రాహుల్ వస్తున్నారు
- ●Sreeleela | డీప్‌ఫేక్ బారిన పడిన శ్రీలీల - మరో నటి వీడియోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి...
- ●Wipro | ఇన్వెస్టర్లకు అలర్ట్.. ఐటీ షేర్లను కొని పెట్టుకోవాలన్న సిటీ గ్రూప్..
- ●Khelo India Youth Games 2026 | దేశం గర్వించేలా ఖేలో ఇండియా గేమ్స్
- ●TG Invest Summit | ఆటోమొబైల్, ఈవీ రంగాల్లో భారీ పెట్టుబడులే లక్ష్యం

Priyank Kharge | టిప్పు సుల్తాన్ నాలుగు ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు చేశారు.. RSS కనీసం స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొనలేదు : ప్రియాంక్ ఖర్గే

Maheshkumar Godu | భారత్ సమ్మిట్‌కు రాహుల్ వస్తున్నారు

Sreeleela | డీప్‌ఫేక్ బారిన పడిన శ్రీలీల - మరో నటి వీడియోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి...

Wipro | ఇన్వెస్టర్లకు అలర్ట్.. ఐటీ షేర్లను కొని పెట్టుకోవాలన్న సిటీ గ్రూప్..




