Gajjela Kantham | జనవరి 5న ఉద్యమకారులతో సభ నిర్వహిస్తం
Gajjela Kantham | హైదరాబాద్ (Hyderabad)లోని ఇందిరాపార్క్ వద్ద వచ్చే జనవరి 5న ఉద్యమకారులతో సభ (Telangana Movement Activists Meeting) నిర్వహిస్తామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం (Gajjela Kantham) తెలిపారు.
- లక్ష్మణ్ గౌడ్ చనిపోతే కేసీఆర్, కేటీఆర్ పరామర్శించలే
- కేసీఆర్‌తో కలిసే ఆయన ఉద్యమంలో పాల్గొన్నడు
- లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి 5 లక్షలు, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తానని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు
- సమస్యలన్నీ పరిష్కారమయ్యేలా చూస్తా
- మీడియా సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం
Gajjela Kantham | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్ (Hyderabad)లోని ఇందిరాపార్క్ వద్ద వచ్చే జనవరి 5న ఉద్యమకారులతో సభ (Telangana Movement Activists Meeting) నిర్వహిస్తామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం (Gajjela Kantham) తెలిపారు. ఉద్యమకారుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్‌తో కలిసి ఉద్యమంలో పాల్గొన్న లక్ష్మణ్‌గౌడ్ చనిపోతే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పరామర్శించలేదని విమర్శించారు. లక్ష్మణ్‌గౌడ్ కుటుంబానికి రూ.5 లక్షలు, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు.
తెలంగాణ కోసం అప్పుల పాలై లక్ష్మణ్ గౌడ్ చనిపోతే కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ పరమర్శించలేదు. లక్ష్మణ్ గౌడ్ కేసీఆర్ పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమంలో పని చేశారు. తెలంగాణ ఉద్యమకారులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటాడు. ప్రజా సంఘాల జేఏసీ చైర్మైన్‌గా అన్ని సమస్యలను సీఎం రేవంత్, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళతా.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్.. మీకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. ఉద్యమకారుల అన్ని సమస్యలు పరిస్కారం అవుతాయి. జనవరి 5 తరవాత ఉద్యమకారులను జేఏసీ చైర్మైన్ గా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకెళతా. ఉద్యమకారుల అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేందుకు నేను కృషి చేస్తా.
2001లో కేసీఆర్ పార్టీ పెట్టుకుండు. 2001 నుండి 2009 వరకు దొర కేసీఆర్ ను ఎవరు నమ్మలేదు. మళ్ళీ దొరల రాజ్యం వస్తే మాకు కష్టం అవుతుందని కేసీఆర్ ను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు నమ్మలేదు. విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాల జేఏసీని నమ్మి ప్రజలు బయటకు వచ్చారు. తెలంగాణ రావడంలో నాలుగు కోట్ల మంది త్యాగాలు ఉన్నాయి.
ఉస్మానియా స్టూడెంట్స్ పునాది వేశారు
ఉస్మానియా విద్యార్థులు తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేశారు. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ కేసీఆర్ అనే దొర చేతుల్లోకి పోయింది. ఇప్పటివరకు బలిదానం అయిన వారి ఆత్మకు శాంతి చేకూరలేదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేం ఉద్యమం చేశాం. తెలంగాణ కోసం నాలాంటి వారు ఎంతో మంది కోట్ల ఆస్తులు పోగొట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనివారు లక్షల కోట్లు సంపాదించుకున్నారు అని గజ్జెల కాంతం ఆరోపించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | కరువు కాలంలో రైతులకు భరోసా ఇవ్వండి
- ●Priyank Kharge | టిప్పు సుల్తాన్ నాలుగు ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు చేశారు.. RSS కనీసం స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొనలేదు : ప్రియాంక్ ఖర్గే
- ●Maheshkumar Godu | భారత్ సమ్మిట్‌కు రాహుల్ వస్తున్నారు
- ●Sreeleela | డీప్‌ఫేక్ బారిన పడిన శ్రీలీల - మరో నటి వీడియోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి...
- ●Wipro | ఇన్వెస్టర్లకు అలర్ట్.. ఐటీ షేర్లను కొని పెట్టుకోవాలన్న సిటీ గ్రూప్..
- ●Khelo India Youth Games 2026 | దేశం గర్వించేలా ఖేలో ఇండియా గేమ్స్

Bhatti Vikramarka | కరువు కాలంలో రైతులకు భరోసా ఇవ్వండి

Priyank Kharge | టిప్పు సుల్తాన్ నాలుగు ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు చేశారు.. RSS కనీసం స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొనలేదు : ప్రియాంక్ ఖర్గే

Maheshkumar Godu | భారత్ సమ్మిట్‌కు రాహుల్ వస్తున్నారు

Sreeleela | డీప్‌ఫేక్ బారిన పడిన శ్రీలీల - మరో నటి వీడియోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి...





