TGSRTC | ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రోడ్డెక్కుతున్న జేబీఎం ఎలక్ట్రికల్ బస్సులు
TGSRTC | రాష్ట్రంలోని ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. పూర్తి ఫిట్‌నెస్‌తో దశలవారీగా జేబీఎం ఎలక్ట్రికల్ బస్సులు రోడ్డెక్కుతున్నాయి. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ అదనపు సర్వీసులు నడపాలని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి ఆదేశించారు.
TGSRTC | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. పూర్తి ఫిట్‌నెస్‌తో దశలవారీగా జేబీఎం ఎలక్ట్రికల్ బస్సులు రోడ్డెక్కుతున్నాయి. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ అదనపు సర్వీసులు నడపాలని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్ బస్ భవన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ టెక్నికల్ టీమ్, జేబీఎం సాంకేతిక సిబ్బందితో పాటు చైనా నుంచి వచ్చిన ప్రత్యేక బ్యాటరీ నిపుణులు సంయుక్తంగా ఈ బస్సులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వారిచ్చిన 100 శాతం ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఆధారంగానే బస్సులను రోడ్డుపైకి అనుమతిస్తున్నారు. మొత్తం 500 జేబీఎం బస్సుల పునరుద్ధరణ ప్రక్రియ అత్యంత వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 150 బస్సులు రోడ్డెక్కగా, మరో 118 బస్సులు ఫిట్‌నెస్ సాధించాయి. మరో రెండు, మూడు రోజుల్లో మిగిలిన బస్సులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.
జేబీఎం బస్సులు ఇంకా అందుబాటులోకి రాని ప్రాంతాల్లో ప్రయాణికులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ యాజమాన్యం ముందస్తు చర్యలు చేపట్టిందని ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఆయా రూట్లలో అదనపు బస్సు సర్వీసులను నడపాలని అన్ని రీజియన్ల రీజినల్ మేనేజర్లను ఆదేశించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో అత్యంత సురక్షితమైన ప్రమాణాలతో జేబీఎం బస్సులు మళ్లీ సేవలందించేందుకు సిద్ధమవుతున్నాయని, ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని నాగిరెడ్డి సూచించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..






