త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSRTC | ప‌దేండ్ల‌ త‌ర్వాత లాభాల బాట‌లో ప్ర‌గ‌తిచ‌క్రం..

TGSRTC | రోజు ల‌క్షల‌ కిలోమీట‌ర్ల ప్ర‌యాణం.. ల‌క్షాలాది మందిని త‌మ గ‌మ్య స్థానాల‌కు చేర‌వేస్తున్న‌ప్ప‌టికీ తెలంగాణ రోడ్డు ర‌వాణా సంస్థకు (TGSRTC) న‌ష్టాలే మిగులుతున్నాయి. ప్ర‌తీ స‌వంత్స‌రం ఖ‌ర్చులు పెర‌గ‌డం, ఆదాయం (Profit) త‌గ్గుతుండ‌టంతో వేల కోట్ల‌లో న‌ష్టాలే మిగిలేవి.

G

Telangana | Published On Jun 28, 2026, 6.54 am IST

TGSRTC | ప‌దేండ్ల‌ త‌ర్వాత లాభాల బాట‌లో ప్ర‌గ‌తిచ‌క్రం..
Advertisement

TGSRTC | త్రినేత్ర‌.న్యూస్‌: రోజు ల‌క్షల‌ కిలోమీట‌ర్ల ప్ర‌యాణం.. ల‌క్షాలాది మందిని త‌మ గ‌మ్య స్థానాల‌కు చేర‌వేస్తున్న‌ప్ప‌టికీ తెలంగాణ రోడ్డు ర‌వాణా సంస్థకు (TGSRTC) న‌ష్టాలే మిగులుతున్నాయి. ప్ర‌తీ స‌వంత్స‌రం ఖ‌ర్చులు పెర‌గ‌డం, ఆదాయం (Profit) త‌గ్గుతుండ‌టంతో వేల కోట్ల‌లో న‌ష్టాలే మిగిలేవి. డొక్కు బ‌స్సులు, డీజిల్ భారం, నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు త‌డి మోప‌డ‌వుతుండ‌టంతో ఇక సంస్థ‌ లాభాల బాట ప‌ట్ట‌డం క‌ష్ట‌మేన‌ని పాల‌కులు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. అయితే మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం (Mahalakshmi) ఆర్టీసీ ఆదాయంలో ఒక్క‌సారిగా మార్పు తీసుకొచ్చింది. దీనికి ప్ర‌భుత్వ ఆర్థిక స‌హాయం తోడ‌వ్వ‌డంతో ద‌శాబ్దం త‌ర్వాత లాభాల బాట‌ప‌ట్టింది. 2025-26 ఒక్క ఏడాదిలోనే రూ.1,059.27 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఇది ఆర్టీసీ చరిత్రలోనే అత్యధికం. దీంతో 2026-27లో ఆదాయంలో ఖర్చులు పోను రూ.1,118.86 కోట్ల మిగులు సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

ప‌దేండ్ల త‌ర్వాత..

2014 నుంచి 2023 వ‌ర‌కు ఆర్టీసీకి న‌ష్టాలే మిగిలాయి. కార్మికుల స‌మ్మె, క‌రోనా ప్ర‌భావంతో ఆదాయం గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయింది. దీంతో 2020-21లో రూ.2,455 కోట్ల ఆదాయం మాత్రమే స‌మ‌కూరింది. దీంతో ఆ ఏడాది ఏకంగా రూ.2,329 కోట్ల నష్టాల‌ను చ‌విచూసింది. అయితే క‌రోనా త‌ర్వాత బ‌స్సుల్లో ప్ర‌యాణించే వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతుండ‌తంలో ఆదాయంలో కొంత మార్పు వ‌చ్చింది. 2023 డిసెంబ‌ర్‌లో ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం మ‌రింత ఊత‌మిచ్చింది.

ఉచితంగా ప్ర‌యాణించే మ‌హిళ‌ల‌కు (Fress Bus For Woman) ఇచ్చే జీరో టికెట్ల చార్జీల‌ను (Zero Ticktes) రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ చేస్తుండటంతో ఆదాయం బాగా పెరుగుతున్న‌ది. టికెట్లపై టోల్, సేఫ్టీ, రౌండప్‌.. ఇలా వివిధ రూపాల్లో ఆర్టీసీ చార్జీల‌ను పెంచింది. దీనికితోడు రిటైర్ అయ్యే ఉద్యోగులు, అద్దె బ‌స్సులు పెర‌గ‌డం, డొక్కు బ‌స్సుల‌ను వ‌దిలించుకోవ‌డంతో ఖ‌ర్చులు త‌గ్గిపోవ‌డంతో దాదాపు ద‌శాబ్దం త‌ర్వాత 2023-24లో లాభాల బాట ప‌ట్టింది. 2014-15లో రూ.3,294 కోట్లుగా ఉన్న ఆదాయం.. 2025-26లో రూ.9,374.18 కోట్లకు చేరింది. అంటే సుమారు 3 రెట్లు పెరిగింద‌న్న‌మాట‌.

న‌ష్టాలు ఏ ఏడాదిలో ఎంతంటే..

2014-15లో- రూ.299.64 కోట్లు
2015-16లో రూ.1150.48 కోట్లు
2016-17లో రూ.749.28 కోట్లు
2017-18లో రూ.748.90 కోట్లు
2018-19లో రూ.928.67 కోట్లు

Advertisement
Advertisement