త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ఊహించ‌ని ధ‌న‌లాభం..!

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి రోజు, ప్ర‌తి వారం త‌మ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా వ్య‌క్తులు త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తుంటారు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

S

Horoscope | Published On Jun 28, 2026, 7.51 am IST

Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ఊహించ‌ని ధ‌న‌లాభం..!
Advertisement

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ఈ వారం కొంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఉద్యోగులు తమ విధులు జాగ్రత్తగా, ఏకాగ్రతతో నిర్వహించాలి. అధికారులతో, సహోద్యోగులతో సత్సంబంధాలు కలిగి ఉండడం మంచిది. వ్యాపారంలో ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్లడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఈ వారం కొంత క్షీణించవచ్చు. రుణాలు తీసుకునే ముందు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. జీవిత భాగస్వామితో వివాదాలు రాకుండా ఓపికతో వ్యవహరించాలి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు తమ అధికారులతో విభేదాలు వచ్చే అవకాశం ఉన్నందున పని ప్రదేశంలో అప్రమత్తంగా ఉండాలి. ఎవరితోనూ ఘర్షణలకు దిగవద్దు. వ్యాపారంలో విజయం సాధించాలంటే గణనీయమైన కృషి చేయాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి నూతన మార్గాలు లభించడం సంతృప్తినిస్తుంది. అయితే అనవసర ఖర్చులు అదుపు చేయడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసుకోవచ్చు. వైవాహిక జీవితం సామరస్యపూర్వకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో పరస్పర అవగాహనతో బంధం బలపడుతుంది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ఈ వారం వృత్తి పరంగా, ఆరోగ్య పరంగా కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఉద్యోగులు తమ పై అధికారులతో గొడవలకు దూరంగా ఉండాలి. వ్యాపారులు నూతన పరిచయాల ద్వారా లబ్ది పొందుతారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. అత్యవసర పనులకు నిధుల కొరత ఉండదు. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రేమ వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు పొందగలరు.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం మధ్యస్థంగా ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు మరికొంత కాలం వేచి చూడడం మంచిది. వ్యాపారులు నూతన ప్రాజెక్టులు అందుకుంటారు. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవచ్చు. లాభాలు మాత్రం ఆశించిన స్థాయిలోనే ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. గృహాలంకరణ నిమిత్తం అధికంగా ధనవ్యయం చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అవగాహనతో మెలగడం అవసరం. కుటుంబంలో సామరస్యత కోసం కోపావేశాలు అదుపులో ఉంచుకోండి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం కొంత ప్రతికూలత పరిస్థితి ఉండే అవకాశాలున్నాయి. ఉద్యోగంలో నిర్లక్ష్యం తగదు. ఆత్మవిశ్వాసానికి భంగం కలిగించే ఘటనలకు దూరంగా ఉండండి. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి, ఆశించిన లాభాలు పొందడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఖర్చులు మితిమీరి ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో ఒత్తిడి ఏర్పడవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగేయాలి. కుటుంబ వ్యవహారాల్లో ఓపికతో ఉండడం వలన సమస్యలు ఉండవు. కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే సూచన ఉంది.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆశించిన ఫలితాల కోసం కొంత ఓపికతో ప్రయత్నించాలి. అధికారులతో వాగ్వివాదాలకు దిగవద్దు. వ్యాపారంలో మార్పులు చేర్పులకు సమయం అనువుగా లేదు. హఠాత్తుగా తీసుకునే నిర్ణయాల వల్ల నష్టాలు రావచ్చు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ప్రేమ వ్యవహారాల్లో సవాళ్లు ఎదురుకావచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవగాహనతో మెలగడం అవసరం. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగులకు ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. మీ ప్రతిభను అధికారులు గుర్తించి పదోన్నతులతో ప్రోత్సహిస్తారు. వ్యాపారంలో ధనలాభాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన నిధులు సమకూరుతాయి. ఆర్థికంగా ఈ వారం అత్యంత అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల నుంచి అధిక లాభాలు అందుకుంటారు. ఆదాయ వనరులు పెరగడంతో ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఆహ్లాదంగా సాగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం ఆశించిన శుభ ఫలితాలు అందుకుంటారు. పదోన్నతులు, కోరుకున్న ప్రాంతాలకు బదిలీ వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. వ్యాపారులకు ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాన్ని పలు ప్రాంతాలకు విజయవంతంగా విస్తరిస్తారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టడం, భూములు, ఇల్లు కొనుగోళ్లకు అనుకూలమైన సమయం. ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. గ్రహాల అనుకూలత వలన స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో శుభసూచనలు ఉన్నాయి. పదోన్నతులతో పాటు బదిలీలకు కూడా అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు మెరుగైన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గొప్ప పేరు పొందిన వారితో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగుంటాయి. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం కృషికి తగిన ఫలితాలు అందుకుంటారు. వ్యాపారులు అప్రమత్తంగా వ్యవహరించడం వలన సత్ఫలితాలు సాధిస్తారు. సమయానుకూల నిర్ణయాలతో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు శ్రమ పెరిగినప్పటికీ కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో మీ కీర్తి గౌరవం పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. ఆదాయం కూడా గణనీయంగా పెరగవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. కుటుంబంలో శాంతియుతమైన వాతావరణం ఉంటుంది.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. క్రమశిక్షణ, సమయపాలనతో అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో ముందుచూపుతో వ్యవహరించడం వలన లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. అయితే అనవసరమైన ఖర్చులు నియంత్రించుకోవడం ముఖ్యం. ప్రేమ వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలతో విభేదాలు రావచ్చు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు తగిన జాగ్రత్తలతో ముందుకెళ్తే సత్ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగంలో పనిభారం పెరగడంతో మానసిక ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు మంచి అవకాశాలు అందుకుంటారు. వ్యాపారులు ఈ వారం ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది. వ్యాపార విస్తరణ, కీలక పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు పాటించడం మంచిది. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఊహించని ఆశ్చర్యకరమైన ధనలాభం ఆనందం కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగాలంటే అవగాహన ముఖ్యం.

Advertisement
Advertisement