త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | రేపు న‌ల్గొండ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి ప‌ర్య‌ట‌న‌

CM Revanth Reddy | నల్గొండ జిల్లాలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నిర్వహించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3.35 గంటలకు నల్గొండ జిల్లా కనగల్ ఏఎంసీ మార్కెట్ యార్డ్ ప్రాంగణానికి సీఎం చేరుకోనున్నారు.

P

Telangana | Published On Jun 27, 2026, 9.00 pm IST

CM Revanth Reddy | రేపు న‌ల్గొండ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి ప‌ర్య‌ట‌న‌
Advertisement

CM Revanth Reddy | నల్గొండ జిల్లాలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నిర్వహించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3.35 గంటలకు నల్గొండ జిల్లా కనగల్ ఏఎంసీ మార్కెట్ యార్డ్ ప్రాంగణానికి సీఎం చేరుకోనున్నారు. అక్కడ హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) రోడ్లకు శంకుస్థాపన చేసి, పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు నల్గొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. అక్కడ రూ.83 కోట్ల వ్యయంతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టనున్న డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్-1కు శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమం అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Advertisement
Advertisement