DR Congo Vs Uzbekistan | 52 ఏళ్ల నిరీక్షణకు తెర..
DR Congo Vs Uzbekistan | అట్లాంటాలో జరిగిన ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ మ్యాచ్‌లో డీఆర్ కాంగో చరిత్ర సృష్టించింది. ఓ పరిస్థితిలో పూర్తిగా వెనుకపడగా.. మళ్లీ అద్భుతంగా పుంజుకొని ఉజ్బెకిస్తాన్‌ను 3-1తో ఓడించింది. ఈ విజయంతో 52 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. తొలిసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. చివరి-32లో ఇంగ్లండ్‌ను ఢీకొట్టబోతున్నది.
- ఉబ్జెకిస్తాన్‌పై 3-1 తేడాతో ఘన విజయం
- నాకౌట్‌లో ఇంగ్లండ్‌తో ఢీ
- ఇంటిబాట పట్టిన ఉబ్జెకిస్తాన్
DR Congo Vs Uzbekistan | అట్లాంటాలో జరిగిన ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ మ్యాచ్‌లో డీఆర్ కాంగో చరిత్ర సృష్టించింది. ఓ పరిస్థితిలో పూర్తిగా వెనుకపడగా.. మళ్లీ అద్భుతంగా పుంజుకొని ఉజ్బెకిస్తాన్‌ను 3-1తో ఓడించింది. ఈ విజయంతో 52 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. తొలిసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. చివరి-32లో ఇంగ్లండ్‌ను ఢీకొట్టబోతున్నది.
తొలిసారి నాకౌట్‌లోకి..
ప్రపంచకప్‌లో రెండోసారి మాత్రమే బరిలోకి దిగిన డీఆర్ కాంగో.. 1974లో ‘జైర్’ పేరుతో పాల్గొన్న తర్వాత మళ్లీ ఈ టోర్నీలో ఆడుతోంది. తొలి అర్ధభాగంలో వెనుకబడినప్పటికీ.. రెండో అర్ధభాగంలో మూడు గోల్స్‌తో అద్భుత పునరాగమనం చేసింది. యోవానే విస్సా రెండు గోల్స్ చేయగా, ఫిస్టన్ మయేలే మరో గోల్ సాధించాడు. కోచ్ సెబాస్టియన్ డెసాబ్రే సారథ్యంలో డీఆర్ కాంగో ఇప్పటికే గ్రూప్ దశలో క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్‌తో 1-1తో డ్రా చేసి ఆకట్టుకుంది. ప్రపంచకప్‌లో తొలిసారి ఆడుతున్న ఉజ్బెకిస్తాన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. 10వ నిమిషంలో కెప్టెన్ ఎల్డోర్ షోమురోడోవ్ జట్టుకు ఆధిక్యం అందించాడు. అబ్బోస్‌బెక్ ఫయ్జుల్లాయెవ్ ఇచ్చిన అద్భుత పాస్‌ను అందుకున్న షోమురోడోవ్ గోల్‌కీపర్ లియోనెల్ ఎంపాసిపై చాకచక్యంగా బంతిని లాబ్ చేస్తూ గోల్ నమోదు చేశాడు. 17వ నిమిషంలో నథానాయెల్ ఎంబుకు గోల్ చేసి డీఆర్ కాంగోకు సమం చేసినట్లు కనిపించినా.. ఫౌల్ జరిగినట్లు రిఫరీ గుర్తించడంతో ఆ గోల్‌ను రద్దు చేశాడు.
రెండో అర్ధభాగంలో..
రెండో అర్ధభాగంలో బంతిపై ఆధిపత్యం చెలాయించిన డీఆర్ కాంగోకు ఉజ్బెకిస్తాన్ కట్టుదిట్టమైన డిఫెన్స్ అడ్డుగా నిలిచింది. అయితే, 68వ నిమిషంలో మ్యాచ్ మలుపు తిరిగింది. పెనాల్టీ బాక్స్‌లో అబ్దుకోదిర్ ఖుసనోవ్ చేసిన ఫౌల్‌తో డీఆర్ కాంగోకు పెనాల్టీ లభించింది. దాన్ని యోవానే విస్సా ఎలాంటి తప్పిదం లేకుండా గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేశాడు. ఆ తర్వాత ఊపు మీద కనిపించిన డీఆర్ కాంగో 78వ నిమిషంలో రెండో గోల్ సాధించింది. మెషాక్ ఎలియా ప్రారంభించిన దాడిలో వచ్చిన అవకాశాన్ని ఫిస్టన్ మయేలే సద్వినియోగం చేసుకుని సమీపం నుంచి బంతిని గోల్‌లోకి పంపించాడు. ఇంజ్యురీ టైమ్‌లో మరోసారి మెషాక్ ఎలియా అద్భుతంగా బంతిని అందించగా.. యోవానే విస్సా కింద మూలలోకి అద్భుత షాట్‌తో గోల్ చేసి డీఆర్ కాంగో విజయాన్ని ఖాయం చేశాడు. దీంతో ఆటగాళ్లు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. మూడు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లు సాధించిన డీఆర్ కాంగో నాకౌట్ దశలోకి అడుగుపెట్టింది. గ్రూప్-ఎల్‌లో అగ్రస్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌తో రౌండ్ ఆఫ్ 32లో తలపడనుంది. మరోవైపు తొలి ప్రపంచకప్ ప్రయాణంలో ఉజ్బెకిస్తాన్ మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఒక్క పాయింట్ కూడా సాధించకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
🚨 HISTORY: DR Congo have reached the World Cup knockout stage for the 1st time ever. 🇨🇩
After the final whistle, the team prayed in the centre circle before running to celebrate with their fans. pic.twitter.com/hadtJ2cBZf
— Sports on Predict (@predictdotsport) June 28, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nitin Nabin | తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ఫోకస్.. మూడు రోజులు రాష్ట్రంలోనే నితిన్ నబీన్
- ●పోర్చుగల్-కొలంబియా మ్యాచ్ డ్రా
- ●Forest Officer | జింకకు పోహా తినిపించిన అటవీ అధికారి.. సస్పెండ్.. వీడియో
- ●Croatia vs Ghana | నాకౌట్‌లోకి క్రొయేషియా
- ●Kaddu Ki Kheer | పెండ్లి వేడుకలో మిగిలిన పాయసం తిని.. 30 మందికి అస్వస్థత
- ●England vs Panama | మెరిసిన బెల్లింగ్‌హామ్

Nitin Nabin | తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ఫోకస్.. మూడు రోజులు రాష్ట్రంలోనే నితిన్ నబీన్

పోర్చుగల్-కొలంబియా మ్యాచ్ డ్రా

Forest Officer | జింకకు పోహా తినిపించిన అటవీ అధికారి.. సస్పెండ్.. వీడియో

Croatia vs Ghana | నాకౌట్‌లోకి క్రొయేషియా




