KTR | ఆర్ఎస్పీకి భద్రత తగ్గించడం పూర్తిగా కక్ష సాధింపు చర్యే : కేటీఆర్
KTR | 25 ఏండ్ల పాటు ఐపీఎస్ అధికారిగా దేశానికి, సుమారు దశాబ్దం పాటు గురుకుల విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్ధుల విద్యకు ఎన్నో సేవలందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రత తగ్గించడం పూర్తిగా కక్షసాధింపు చర్యే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : 25 ఏండ్ల పాటు ఐపీఎస్ అధికారిగా దేశానికి, సుమారు దశాబ్దం పాటు గురుకుల విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్ధుల విద్యకు ఎన్నో సేవలందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రత తగ్గించడం పూర్తిగా కక్షసాధింపు చర్యే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలను ప్రజల్లో ఎప్పటికప్పుడు ఎండగడుతున్నందుకే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడింది. ఇప్పటికే పలుమార్లు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై హత్యాయత్నాలు జరిగాయి. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన స్వయంగా వెల్లడించినప్పటికీ కావాలనే భద్రతను తగ్గించడం వెనుక కుట్ర దాగి ఉంది. ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలను మానుకుని, మా పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు వెంటనే భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాను అని కేటీఆర్ తెలిపారు.
రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే ఆర్ఎస్పీకి భద్రత తగ్గింపు : హరీశ్‌రావు

రేవంత్ ప్రభుత్వ కుంభకోణాలు, అవినీతి వ్యవహారాలపై నిర్విరామంగా పోరాటం చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రతను తగ్గించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు.
25 ఏళ్లపాటు పోలీసు ఉన్నతాధికారిగా దేశానికి, సమాజానికి సేవలందించిన వ్యక్తిపై రాజకీయ కక్షతో ఇలాంటి చర్యలకు పాల్పడటం కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనం. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఎలాంటి అధికారిక హోదా లేని సీఎం రేవంత్ రెడ్డి సోదరులకు ప్రభుత్వ భద్రత, వాహనాలు కల్పిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం.. ప్రజా సమస్యలపై పోరాడుతున్న, పలుమార్లు ప్రాణహాని హెచ్చరికలు ఎదుర్కొన్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు భద్రతను తగ్గించడం అత్యంత అన్యాయం. భద్రతను తగ్గించినంత మాత్రాన ప్రవీణ్‌కుమార్ ఆత్మస్థైర్యాన్ని, పోరాటస్ఫూర్తిని దెబ్బతీయలేరు. ప్రతిపక్షాలను అణచివేసే కక్షపూరిత రాజకీయాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు తగిన భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
- ●Netflix | ఓటీటీలో ప్రభాస్ డాక్యుమెంటరీ సిరీస్ ట్రెండింగ్ - హాలీవుడ్ సినిమాలను దాటేసి...
- ●Afghanistan Earthquake | ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. భారత్, పాకిస్తాన్లలో వణికిన జనం
- ●Kavitha | మహిళా రిజర్వేషన్ల అమలుకు ఢిల్లీలో భారీ సభ నిర్వహిద్దాం : కల్వకుంట్ల కవిత
- ●Allu Sneha Reddy | నిర్మాతగా అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ - జోకర్ మూవీ లాంఛ్ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా స్నేహారెడ్డి
- ●TG RERA | తెలంగాణ 'రెరా' చైర్మన్‌గా కేఎస్ శ్రీనివాసరాజు నియామకం

CM Revanth Reddy | రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Netflix | ఓటీటీలో ప్రభాస్ డాక్యుమెంటరీ సిరీస్ ట్రెండింగ్ - హాలీవుడ్ సినిమాలను దాటేసి...

Afghanistan Earthquake | ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. భారత్, పాకిస్తాన్లలో వణికిన జనం

Kavitha | మహిళా రిజర్వేషన్ల అమలుకు ఢిల్లీలో భారీ సభ నిర్వహిద్దాం : కల్వకుంట్ల కవిత





